జీ హుజూర్ అన‌లేనన్న హుజూరాబాద్‌

తెలంగాణ‌లో ఆట మొద‌లైంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తాను జీ హుజూర్ అన‌లేన‌ని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ తేల్చి చెప్పారు. ఈట‌ల రాజ‌కీయ పంథాపై నెల‌కున్న ఉత్కంఠ‌కు శుక్ర‌వారం తెర‌ప‌డింది.  Advertisement కేసీఆర్‌తో…

తెలంగాణ‌లో ఆట మొద‌లైంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తాను జీ హుజూర్ అన‌లేన‌ని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ తేల్చి చెప్పారు. ఈట‌ల రాజ‌కీయ పంథాపై నెల‌కున్న ఉత్కంఠ‌కు శుక్ర‌వారం తెర‌ప‌డింది. 

కేసీఆర్‌తో స‌మ‌ర‌మే అని ఆయ‌న త‌న రాజీనామా ద్వారా తేల్చి చెప్పారు. హైద‌రాబాద్ శివారు శామీర్‌పేట నివాసంలో ఈట‌ల మీడియాతో మాట్లాడుతూ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు.

19 ఏళ్ల టీఆర్ఎస్‌ అనుబంధానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం ఎన్నో సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు గుర్తు చేసుకున్నారు. గతంలో 17 మంది రాజీనామా చేస్తే కేవలం ఏడుగురు మాత్రమే గెలిచారన్నారు. 

టీఆర్ఎస్ నుంచి ఎన్నిసార్లు బీ ఫాం ఇచ్చినా తాను గెలిచానని చెప్పారు. ఆత్మ గౌరవం, బాధ్యతలేని మంత్రి పదవి అవసరం లేదని చెప్పాన‌న్నారు. ప్రగతి భవన్‌ కాదు.. బానిసల నిలయంగా పెట్టుకోవాలని చెప్పిన‌ట్టు ఈట‌ల తెలిపారు. త‌న‌ను బొందపెట్టమని ఆదేశాలు అందుకున్న మంత్రి హరీశ్‌రావుకు అవమానం జరిగింద‌న్నారు.

తన వివరణ తీసుకోకుండానే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారని  ఈటల రాజేందర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతార‌ని, కనీసం త‌న‌ వివరణ కూడా తీసుకోకుండా చర్యలు తీసుకున్నార‌ని వాపోయారు. 

ఈ రాష్ట్రంలో, ఈ రాజుగారి పాల‌న‌లో ఒక మంత్రి మీద ఒక అనామ‌కుడు ఫిర్యాదు చేస్తే, క‌నీసం ఏం జ‌రిగిందో తెలుసుకోకుండా మున్సిపాలిటీ ఎన్నిక‌లు ముగిసిన అర్ధ‌గంట‌లోపే శాఖ నుంచి త‌ప్పించార‌న్నారు.  

త‌న‌పై జరుగుతోన్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని ఈట‌ల హెచ్చ‌రించారు. ఒక‌ప్పుడు కేసీఆర్‌ ధర్మాన్ని నమ్ముకుంటే.. ఇప్పుడు డబ్బు అణచివేతలను నమ్ముకున్నార‌ని ఈట‌ల ధ్వ‌జ‌మెత్తారు.

కుట్రలు, కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించొచ్చ‌ని ఈట‌ల తెలిపారు.  సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్ అధికారైనా ఉన్నారా? 85 శాతం అణ‌గారిన వ‌ర్గాల రాష్ర్టంగా చెప్పిన కేసీఆర్‌, వారి కోసం తానేం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. 

ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షలో ఆర్థికమంత్రి ఉండర‌న్నారు. దరఖాస్తు అందించి ఫొటో దిగేందుకు కూడా టీఎన్జీవోలకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఇందిరా పార్క్ వ‌ద్ద వేసిన ప్ర‌తి టెంట్ల‌లో తాను మాట్లాడిన విష‌యాన్ని గుర్తు చేశారు.