ఆర్థిక వ్యవస్థ ఏమవుతోంది మోడీజీ?

భావోద్వేగాలు, బీజేపీ మార్కు జాతీయ వాదాన్ని బాగానే అమల్లో పెడుతున్నారులే.. ఇంతకీ దేశ ఆర్థికవ్యవస్థ సంగతేమిటి మోడీజీ! విదేశీ పర్యటనలు, అంతర్జాతీయ స్థాయి స్నేహాలు.. మీకేమో అంతర్జాతీయ పురస్కారాలు.. ఇవన్నీ బాగానే ఉన్నాయి.. కానీ…

భావోద్వేగాలు, బీజేపీ మార్కు జాతీయ వాదాన్ని బాగానే అమల్లో పెడుతున్నారులే.. ఇంతకీ దేశ ఆర్థికవ్యవస్థ సంగతేమిటి మోడీజీ! విదేశీ పర్యటనలు, అంతర్జాతీయ స్థాయి స్నేహాలు.. మీకేమో అంతర్జాతీయ పురస్కారాలు.. ఇవన్నీ బాగానే ఉన్నాయి.. కానీ దేశ ఆర్థిక వ్యవస్థకు అంతర్జాతీయ సంస్థలు ఇస్తున్న రేటింగుల్లో పతనావస్థను గమనిస్తున్నారా?

నోట్ల రద్దు, జీఎస్టీ దుష్ఫలితాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయని.. ఆర్థిక వ్యవస్థ పూర్తి మందగమనంలో పడిపోయిందని నిపుణులు అంటూ ఉన్నారు. స్థూల జాతీయోత్పత్తి ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిందని ప్రభుత్వమే తేల్చింది. బీజేపీ వాళ్లకు పగ్గాలు దక్కి ఐదేళ్లు పూర్తి అయిపోయాయి. ఆరో సంవత్సరం నడుస్తోంది. జీడీపీ ఆరేళ్ల  కనిష్టానికి పడిపోయింది!

అవినీతి, భ్రష్ట.. కాంగ్రెస్ వాళ్లు ఉన్నప్పుడు, మోడీ లాంటి దేశభక్తుడు ప్రధానిగా లేనప్పుడు దేశఆర్థిక వ్యవస్థ పురోగమనించింది! ఇప్పుడు తిరోగమనిస్తూ ఉంది. జనాలకు అర్థం కావడం లేదు కానీ.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా పడిపోయింది. సోషల్ మీడియాలో బీజేపీ మార్కు భావజాలం గట్టిగా ప్రభావం చూపిస్తూ వాస్తవాలను మరుగున పడేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

జీఎస్టీ వసూళ్లు ఒక్క నెలకు రెండువేల కోట్ల రూపాయలు తగ్గిపోయాయని తెలుస్తోంది. తయారీరంగం తిరోగమనంలోకి పడిపోయింది. రూపాయి విలువలో పతనం గురించి వేరే చెప్పనక్కర్లేదు. కార్ల విక్రయాలు భారీగా పడిపోయాయని ఆ సంస్థలు బోరుమంటున్నాయి. ఇక విదేశీ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకునిపోతూ ఉన్నారు.

ఇటీవలి బడ్జెట్ ప్రకటన దగ్గర నుంచి మార్కెట్లు సూచీలు దిగువకే చూపుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద కొన్ని లక్షల రూపాయలు ఆవిరి కావడమే జరుగుతోంది! ఇంత జరుగుతున్నా..ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి ఈ పరిస్థితులపై స్పందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

కశ్మీర్ అంశం అయ్యాకా అయోధ్య అంశం మీద దృష్టి పెడుతున్నారట.. జనాలను ఎంటర్ టైన్ చేయడానికి బహుశా అవి సరిపోతాయి.  ఇంతకీ దేశ ఆర్థిక పరిస్థితి ఏమిటనేదే దేశభక్తులకు పట్టని అంశం అవుతోంది!

జగన్ ఎప్పూడూ జాగ్రత్తగా ఉండాలి సుమా!