స‌మాజానికి నిప్పు …పొంచి ఉన్న ముప్పు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నోటా కంటే త‌క్కువ ఓట్లు వ‌చ్చిన జాతీయ అధికార పార్టీ బీజేపీ మ‌త రాజ‌కీయాల‌కు తెర‌లేపింది. అయితే  ఇలాంటి విద్వేష‌పూరిత రాజ‌కీయాల‌ను తెలుగు స‌మాజం ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొడుతూ వ‌స్తోంది. ఇప్పుడు కూడా మ‌రీ…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నోటా కంటే త‌క్కువ ఓట్లు వ‌చ్చిన జాతీయ అధికార పార్టీ బీజేపీ మ‌త రాజ‌కీయాల‌కు తెర‌లేపింది. అయితే  ఇలాంటి విద్వేష‌పూరిత రాజ‌కీయాల‌ను తెలుగు స‌మాజం ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొడుతూ వ‌స్తోంది. ఇప్పుడు కూడా మ‌రీ ముఖ్యంగా  బీజేపీ హిందుత్వ ఎజెండాతో చేస్తున్న నీచ రాజ‌కీయాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం ఎంతో చైత‌న్య‌వంతంగా, స్ఫూర్తిదాయ‌కంగా మౌనంతో త‌గిన బుద్ధి చెబుతోంది.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విశ్వాసాల రీత్యా క్రిస్టియ‌న్‌. మ‌న‌ది లౌకిక రాజ్యం. ఎవ‌రే మ‌తం ఆచ‌రించాల‌నేది వారి వారి వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే రాజ‌కీయంగా బ‌ల‌ప‌డేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంచుకున్న ఏకైక ఎజెండా మ‌తం. 2024లో ఎలాగైనా ఏపీలో అధికారంలోకి రావాల‌ని బీజేపీ -జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం త‌హ‌త‌హ‌లాడుతోంది. దీన్నెవ‌రూ త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. 

అయితే ప్ర‌జాద‌ర‌ణ పొంద‌డానికి బీజేపీ -జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం అవ‌లంబిస్తున్న రాజ‌కీయ విధానాలు అభ్యంత‌ర‌కరంగా ఉన్నాయి. ప్ర‌జ‌ల మ‌ధ్య అంత‌రాల్ని పెంచేలా ఆ రెండు పార్టీల చ‌ర్య‌లున్నాయ‌నే అభిప్రాయాలు రోజురోజుకూ బ‌ల‌ప‌డుతున్నాయి.

అంత‌ర్వేది ఘ‌ట‌న‌ను సాకుగా తీసుకుని బీజేపీ -జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం విద్వేష రాజ‌కీయాల‌ను పెంచి పోషిస్తోంద‌నే భావ‌న క్ర‌మంగా బ‌ల‌ప‌డుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జ‌ల మ‌ధ్య మ‌తం పేరుతో విభ‌జ‌న తీసుకొచ్చేందుకు ఆ రెండు పార్టీలు చేస్తున్న క్షుద్ర రాజ‌కీయాలు భ‌య‌పెడుతున్నాయి.

అంత‌ర్వేదిలో శ్రీ‌ల‌క్ష్మి న‌ర‌సింహ‌స్వామి ర‌థాన్ని దుండ‌గ‌లు ద‌గ్ధం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ స‌ర్కార్ త‌క్ష‌ణం స్పందించింది. ప్రాథ‌మికంగా ఆల‌య ఈవోతో పాటు మ‌రికొంద‌రిపై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వం తీసుకొంది. అయిన‌ప్ప‌టికీ బీజేపీ -జ‌న‌సేన దూకుడుగా వ్య‌వ‌హ‌రించాయి. హిందూ మ‌త ఉద్ధార‌క పార్టీలైన‌ట్టు అంత‌ర్వేదిలో ద‌గ్ధ‌మైన ర‌థం మంట‌ల్లో చ‌లి కాచుకోవాల‌ని ఆ రెండు పార్టీలు నానా తిప్ప‌లు ప‌డ్డాయి. బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీల డిమాండ్ మేర‌కు ర‌థం ద‌గ్ధ‌మైన ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ కోరుతూ ఏపీ స‌ర్కార్ కేంద్రానికి లేఖ రాసింది.

సీబీఐ విచార‌ణ చేప‌ట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్య‌త బీజేపీ -జ‌న‌సేన‌ల‌పై ఉంది. ఆ ప‌ని చేయ‌డం మాని … మ‌రోసారి చ‌లో అమ‌లాపురం పిలుపునివ్వ‌డం ఆ పార్టీల దివాలాకోరు రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌న‌మ‌ని పాల‌క పార్టీ వైసీపీ ఆరోపిస్తోంది. హిందూ దేవతా విగ్రహాల ధ్వంసాలు, ఆలయ రథాల దగ్ధం, గుళ్లో ఆభరణాల దొంగతనం… రాష్ట్రవ్యాప్తంగా వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలను నిర‌సిస్తూ ‘చలో అమలాపురం’ పేరుతో బీజేపీ పిలుపునిచ్చింది. 

పోలీసులు అమలాపురం ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. దీంతో  బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కొందరిని ముందుగానే గృహ నిర్బంధంలో ఉంచారు.

బీజేపీ -జ‌న‌సేన వైఖ‌రి చూస్తుంటే ….జ‌గ‌న్ స‌ర్కార్ ఇంత త్వ‌ర‌గా అంత‌ర్వేది ర‌థం ద‌గ్ధ‌మైన ఘ‌ట‌న‌పై సీబీఐ విచార‌ణ కోర‌డం న‌చ్చిన‌ట్టు లేదు. అంత‌ర్వేది ఘ‌ట‌న పునాదుల‌పై రాజ‌కీయంగా బ‌ల‌ప‌డాల‌నే ఆ పార్టీల ఆశ‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ గండికొట్టింది. అందుకే బీజేపీ -జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం ఏపీ స‌ర్కార్ వైఖ‌రిని జీర్ణించుకోలేకున్నాయి.

ఒక వైపు జ‌గ‌న్ స‌ర్కార్ బీజేపీ -జ‌న‌సేన విష‌పూరిత రాజ‌కీయాల‌ను ప‌సిగ‌ట్టి …వేగంగా స్పందించి ….సీబీఐ విచార‌ణ కోరి రాజ‌కీయంగా పైచేయి సాధించింది. కానీ బీజేపీ -జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం తాజా రాజ‌కీయ పంథాను చూస్తుంటే …మున్ముందు ఏపీలో బ‌ల‌ప‌డేందుకు హిందుత్వ ఎజెండాతో మ‌నుషుల మ‌ధ్య అంత‌రాల‌ను పెంచే కుట్ర‌కు వెనుకాడ‌వ‌ని అర్థ‌మ‌వుతోంది. అంత‌ర్వేదిలో దుండ‌గులు ర‌థానికి నిప్పు పెడితే … ఈ రెండు పార్టీలు రాజ‌కీయ‌, అధికార కాంక్ష‌తో …. ఏకంగా స‌మాజానికే మ‌త‌మ‌నే మంట పెడుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున వ‌స్తున్నాయి.

అందువ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మాజం బీజేపీ -జ‌న‌సేన ర‌గిల్చే విద్వేషాగ్నిలో చిక్కుకోకుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రాన్ని …ఆ పార్టీల రాజ‌కీయ పంథా హెచ్చ‌రిస్తోంది. అంత‌ర్వేదిలో ర‌థం ద‌గ్ధం కంటికి క‌నిపించేదైతే ….బీజేపీ -జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం స‌మాజానికి పెడుతున్న నిప్పు మ‌నో నేత్రానికి మాత్ర‌మే క‌నిపిస్తుంది. ఈ విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ ప‌సిగ‌ట్టి ఆ రెండు పార్టీల మ‌త రాజ‌కీయాల ఉచ్చులో ఇరుక్కోకుండా జాగ్ర‌త్త వ‌హించాలి.

జడ్జీల కూతుర్లు కూడా చట్టంముందు సమానులే