రెస్టారెంట్ కి వెళ్ళడమే ఒక అనుభూతి. అలాంటిది విశాఖలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక అందమైన నౌకను అద్భుతమైన రెస్టారెంట్ గా తీర్చిద్దిదడమే కాదు, అక్కడ సకల సదుపాయాలను సమకూరుస్తున్నారు.
విశాఖలో 2020 అక్టోబర్ ప్రాంతంలో వచ్చిన పెను తుఫాను కి బంగ్లాదేశ్ కి చెందిన ఎంవీ మా అనే నౌక కొట్టుకుని వచ్చింది. ఆ నౌకను ఇప్పటికీ ఇక్కడే ఉంది. దాంతో ఈ నౌకను అన్ని విధాలుగా బాగుచేసి ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా డిజైన్ చేస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ ఆద్వర్యంలో ఒక ప్రైవేట్ సంస్థ పీపీపీ పద్ధతిలో చేసుకున్న ఒప్పందం మేరకు ఫ్లోటింగ్ రెస్టారెంట్ సకల వైభవాలతో తయారవుతోంది.
విశాఖ వచ్చే వారికి ఇది ఇపుడు సరికొత్త ఆకర్షణగా ఉంటుంది. ఇక అయిదు వందల మంది అతిధులు ఏక కాలంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఏసీ రెస్టారెంట్ తో పాటు, ఓపెన్ రూఫ్ టాప్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ కి అదనము ఆకర్షణలుగా ఉంటాయి.
మరో నాలుగు నెలల్లో ఈ రెస్టారెంట్ అందుబాటులో రానుంది. దాని కంటే ముందు ఈ నెల చివరలోనే ఈ నౌకలోకి సందర్శకులు ప్రవేశించేలా అనుమతులు ఇస్తున్నారు. మొత్తానికి విశాఖలో ఎన్నో ప్రకృతి అందాలు ఉన్నాయి. మరి కొన్ని టూరిజం డిజైన్లు ఉన్నాయి. ఇపుడు వాటికి ధీటుగా ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ అలరించడం ఖాయమని అధికారులు చెబుతున్నారు.