బర్త్ డే తో లైమ్ లైట్ లోకి మాజీ ఎమ్మెల్యే

ఆయన విశాఖ జిల్లా గాజువాకలో సీనియర్ నాయకుడు. వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్యేగా పెందుర్తి నుంచి ఒకసారి గెలిచారు. ఆ తరువాత పరిణామాల నేపధ్యంలో టీడీపీలోకి వెళ్లి తిరిగి వైసీఈలోకి వచ్చారు. ఆయ‌న తిప్పల గురుమూర్తిరెడ్డి.…

ఆయన విశాఖ జిల్లా గాజువాకలో సీనియర్ నాయకుడు. వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్యేగా పెందుర్తి నుంచి ఒకసారి గెలిచారు. ఆ తరువాత పరిణామాల నేపధ్యంలో టీడీపీలోకి వెళ్లి తిరిగి వైసీఈలోకి వచ్చారు. ఆయ‌న తిప్పల గురుమూర్తిరెడ్డి. చాలా కాలం తరువాత ఆయన మళ్లీ వెలుగులోకి వచ్చారు. తన పుట్టిన రోజు వేడుకలను అధికార పార్టీ నేతలను అందరినీ పిలిచి గ్రాండ్ గా చేసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆయనకు గ్రీటింగ్ చెబుతూ రాజకీయాల్లో మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని కోరుకున్నారు. నిజానికి 2019 ఎన్నికల్లో ఆయనకు గాజువాక టికెట్ దక్కాలి. కానీ పార్టీలో చాలాకాలంగా ఉన్న సీనియర్ తిప్పల నాగిరెడ్డికి అది దక్కింది. ఈయనకు ఆయన బాబాయ్ కూడా. మరి రాజకీయాలలో వరసల కంటే పదవులే ముఖ్యం కదా.

ఈసారి అయినా ఎమ్మెల్యే టికెట్ ఆయనకు దక్కుతుందా అంటే నాగిరెడ్డి వారసులు రెడీగా ఉన్నారని టాక్. ఏది ఏమైనా ఉన్నత పదవులు ఆయన అందుకోవాలని వైసీపీలో నేతలు కోరుకుంటున్నారు. ఆయన కూడా రోజూ అదే అనుకుంటున్నారు. కానీ ఇరవై ఏళ్ళ క్రితం చేసిన ఎమ్మెల్యే గిరి తరువాత మళ్లీ అసెంబ్లీ వైపు చూడలేదు.  

కొత్త జిల్లాల ఏర్పాటు తో సీనియర్ల అవసరం వైసీపీకి చాలా గట్టిగా పడబోతోంది. మరి ఆ విధంగా తిప్పల తిప్పలు తీరనున్నాయా అంటే చూడాలి.