గంటాకు తమ్ముళ్ళ ఝలక్ ?

తెలుగుదేశం రాజకీయాల్లో గంటా  శ్రీనివాసరావు  మార్క్ వేరుగా ఉంటుంది. అందరూ అధినాయకుడు చంద్రబాబు చుట్టూ తిరిగితే గంటా మాత్రం నా రూట్ సెపరేట్ అంటూంటారు. ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చినా గెలుపు తన సొంతం…

తెలుగుదేశం రాజకీయాల్లో గంటా  శ్రీనివాసరావు  మార్క్ వేరుగా ఉంటుంది. అందరూ అధినాయకుడు చంద్రబాబు చుట్టూ తిరిగితే గంటా మాత్రం నా రూట్ సెపరేట్ అంటూంటారు. ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చినా గెలుపు తన సొంతం అనుకుంటారు. దానికి కారణాలు లేకపోలేదు. ఆయన వరసగా ఓటమి ఎరగకుండా గెలిచిన నేత. పైగా ఎన్నికలకు  ప్రతీసారి పార్టీలు, నియోజకవర్గాలు మారినా కూడా ఆయన విజయం తధ్యంగా నమోదు అవుతోంది.

దాంతో గంటా తనకు సొంత ప్రజా బలం. వ్యూహాలు ఉన్నాయని గట్టిగానే  అనుకుంటారు. ఆయన్ని ఆ విధంగా గుర్తించి గౌరవించే పనిని టీడీపీ హై కమాండ్ కూడా పవర్లో ఉన్నపుడు  చేస్తూ వచ్చింది. ఇక పార్టీ ఓడిన తరువాతనే గంటాకు ఎక్కడలేని  నీరసం వస్తోంది. పార్టీలో ఉందునా మానేనా అన్నట్లుగా గంటా తీరు ఉంటోంది.

ఆయన తీరే అలా ఉంటే తమ్ముళ్ళు మాత్రం ఎందుకు ఆలోచిస్తారు. అందుకే ఆయన్ని గెలిపించిన విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో తమ్ముళ్ళు చాలా మంది పోలోమంటూ వైసీపీలోకి జంప్ అయిపోయారు. గంటా అంటీ ముట్టనట్లుగా ఉండడంతో వారు కూడా నిస్తేజం నుంచి మెల్లగా ఇపుడే బయటపడినట్లున్నారు. తన దారి బాగానే కనుక్కున్నారని సెటైర్లు పడుతున్నాయి.

ఇక గంటా కేవలం మూడు వేల ఓట్ల తేడాతో మాత్రమే ఇక్కడ నుంచి గెలిచారు. ఇలా తమ్ముళ్ళు జారుకుంటే పట్టు జారడం ఖాయమని అంటున్నారు. ఇంటి ముందు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టుకుని ఇలా తమ్ముళ్ళు ఫిరాయిస్తే గంటా ఇలాకాలో పసుపు జెండా ఎగిరేనా అన్న డౌట్లు కూడా ఇపుడు వస్తున్నాయట. మరి గంటా ఇంతవరకూ హై కమాండ్ కి షాక్ ఇచ్చారని, ఇపుడు తమ్ముళ్ళు ఆయనే షాక్ ఇస్తున్నారని అంటున్నారు.

ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే వ్య‌క్తి చిరంజీవి