బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ ప్రతి దశలోనూ ప్రహసనమే. ఓ సినిమా పూర్తయిన వెంటనే నెక్ట్స్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ అతడి కెరీర్ లో కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయింది.
లాంగ్ గ్యాప్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో దర్శకుడిగా మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు బొమ్మరిల్లు భాస్కర్. ఆ సినిమా సక్సెస్ అయిందా లేదా.. రెవెన్యూస్ ఎలా ఉన్నాయి లాంటి సంగతుల్ని పక్కనపెడితే.. అసలు బొమ్మరిల్లు భాస్కర్ నెక్ట్స్ మూవీ ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత వెంటనే అతడు మరో సినిమా ఎనౌన్స్ చేస్తాడా? లేక ఎప్పట్లానే మళ్లీ కెరీర్ లో గ్యాప్ తీసుకుంటాడా అనేది చూడాలి. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మాత్రం తన దగ్గర 2-3 లైన్లు రెడీగా ఉన్నాయని ప్రకటించాడు భాస్కర్. ఏ హీరోకైనా అందులో ఒకటి నచ్చితే, దాన్ని పిక్ చేసి డెవలప్ చేస్తానని చెప్పాడు.
లాంగ్ గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ కు అవకాశం ఇచ్చిన గీతాఆర్ట్స్-2 సంస్థనే, అతడికి ఇప్పుడు మరో అవకాశం ఇస్తోంది. మంచి యూత్ ఫుల్ స్టోరీలైన్ తో వస్తే, యంగ్ హీరోను తామే సెట్ చేస్తామని ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చింది. అఖిల్ ను కూడా గీతాఆర్ట్స్ జనాలే లాక్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి బొమ్మరిల్లు భాస్కర్ కు మరో లైఫ్ లైన్ దొరికేసింది.