Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆ ఇధ్దరూ ఆంధ్రలోనేనా?

ఆ ఇధ్దరూ ఆంధ్రలోనేనా?

టీవీ9 ఎక్స్ సిఇఓ రవిప్రకాష్, నటుడు శివాజీ ఎక్కడ వున్నారు? ఇది ఇప్పుడు పెద్ద ప్రశ్న. పోలీసు విచారణకు వారు రావాల్సివుంది. కానీ రాలేదు. టైమ్ కావాలని లాయర్ల ద్వారా కోరినట్లు వార్తలు వచ్చాయి. అంతవరకు ఓకె. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు ఎక్కడ వున్నట్లు?

రవిప్రకాష్ సన్నిహితులతో ఫోన్ టచ్ లో లేరని తెలుస్తోంది. నిన్నటివరకు వాట్సాప్ టచ్ లో వున్నారని, ఇప్పుడు అది కూడా లేదని టాక్ వినిపిస్తోంది. శివాజీ సంగతి అయితే అదీ తెలియదు. ఇద్దరు ఇప్పుడు తమ తమ భవిష్యత్ కార్యాచరణపై వేరువేరుగా ఆలోచనల్లో వున్నారని, అందుకే జనాలకు అందకుండా సైలంట్ గా వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ లో వుంటే ఏ క్షణం ఏమైనా జరగవచ్చు. అందువల్ల ఆంధ్రలో వున్నారన్న వదంతులు వినిపిస్తున్నాయి. ఇవి ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఆ మధ్య జనాల డేటా చోరీ కేసులో నిందితుడు అశోక్ కూడా ఆంధ్రలోనే వున్నారని వార్తలు వినిపించాయి.

ఈ లెక్కన చూస్తుంటే హైదరాబాద్ లో కేసులున్నవారు ఆంధ్రలో, అక్కడ కేసులు వుంటే హైదరాబాద్ లో తలదాచుకునే సంస్కృతి స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. రెండు ప్రభుత్వాల మధ్య ఉప్పు నిప్పులా వుండడమే ఇందుకు కారణం అనుకోవాలి. లేదూ అంటే ఎక్కడ వున్నా పట్టుకుని రావడం అన్నది పెద్ద విషయంకాదు.

23వ తేదీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 23న కనుక తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వీరందరికీ పెద్ద ఉపశమనం. లేదూ జగన్ ప్రభుత్వం వస్తే కనుక, విషయం కాస్త సీరియస్ గా మారే అవకాశం వుంది. ఆ తేదీ వరకు ఈ దాగుడు మూతలు తప్పవేమో?

అమరావతి ఇంట్లో జగన్ ఎందుకు ఉండటం లేదంటే! 

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?