అఖిలప్రియ.. కేరాఫ్ గందరగోళ రాజకీయం!

‘జగనన్న..’ అంటూ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత నామస్మరణ చేశారు మాజీ మంత్రి అఖిలప్రియ. తను తన ప్రత్యర్థి చేతిలో ఓడిపోలేదని, జగన్ మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయినట్టుగా…

‘జగనన్న..’ అంటూ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత నామస్మరణ చేశారు మాజీ మంత్రి అఖిలప్రియ. తను తన ప్రత్యర్థి చేతిలో ఓడిపోలేదని, జగన్ మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయినట్టుగా ఆమె ఘనంగా ప్రకటించుకున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ‘జగనన్నే’ వచ్చి పోటీ చేస్తే  ఎలాంటి ఫలితాలు వస్తాయో.. అలానే ఎన్నికల ఫలితాలు వచ్చాయని సూత్రీకరించారు అఖిలప్రియ. ఒక దశలో మంత్రిగా ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి గురించి రకరకాల మాటలు మాట్లాడిన.. అఖిలప్రియ అలా ఓడిపోయాకా ‘జగనన్న’ను స్మరించుకున్నారు.

కట్ చేస్తే.. ఆ తర్వాత అఖిలప్రియ భారతీయ జనతా పార్టీలోకి అనే వార్తలు వచ్చాయి. ఆమె కమలం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని, బీజేపీ ముఖ్యులతో సమావేశాలు కూడా జరిగాయని వార్తలు వచ్చాయి. సుజనా చౌదరి ద్వారా ఆమె బీజేపీలోకి చేరబోతున్నట్టుగా అప్పుడు వార్తలు వచ్చాయి. అఖిలప్రియ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనూ సంప్రదింపులు చేశారని, విజయమ్మ ద్వారా ఆ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారని, అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రస్తుతానికి వేచి ఉండమనే సంకేతాలను ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే వేచి ఉండే ఓపిక లేని అఖిల లేట్ చేయకుండా బీజేపీతో సంప్రదింపులు జరిపినట్టుగా గుసగుసలు వినిపించాయి. అయితే  ఆమె బీజేపీలోకి చేరలేదు.

అంతకన్నా విచిత్రం .. తెలుగుదేశం పార్టీ పల్నాడులో చేసిన న్యూసెన్స్ లో అఖిలప్రియ కనిపించడం. అక్కడ హడావుడి చేసిన తెలుగుదేశం వాళ్లలో అఖిలప్రియ కూడా ముందున్నారు. ఈమెకూ పల్నాడుకు బీరకాయ పీచు సంబంధం కూడా లేదు. అక్కడ తెలుగుదేశం హయాంలో గలాభా రేపిన, రౌడీయిజం చలాయించిన నేతలను పక్కన పెట్టి, చంద్రబాబు నాయుడు అఖిలప్రియ లాంటి వాళ్లను ముందుకు తోశారు.అదే చంద్రబాబు మార్కు రాజకీయం. ఆ రాజకీయంలో పావు అయ్యారు అఖిలప్రియ. సొంత సామాజికవర్గం రౌడీలను దాచి, చంద్రబాబు నాయుడు ఇలా రెడ్లను, వెలమలను, బీసీలను పల్నాడుకు పంపించారనే విశ్లేషణలు వినిపించాయప్పడు.

అలాంటి గేమ్ లో అఖిలప్రియ లాంటి వాళ్లు పావులు మాత్రమే అని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అదలా ఉంటే…అఖిలప్రియ భర్త పై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఏదో ఆస్తుల వ్యవహారంలో.. వాటాల వ్యవహారంపై ఆళ్లగడ్డ ప్రాంత వ్యక్తిని బెదరించడం, దాడికి పాల్పడటంతో ..అఖిలప్రియ భర్తపై హత్యాయత్నం కేసు  నమోదు అయ్యింది. భూమా నాగిరెడ్డి తో జాయింట్ వెంచర్ పెట్టుబడులు పెట్టిన వారిని బెదిరించి, మొత్తం ఆస్తిని రాయించుకోవాలని అఖిలప్రియ భర్త బెదిరించాడని సమాచారం. ఈ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు అయినట్టుగా తెలుస్తోంది.

అఖిలప్రియపై ఇలాంటి అభియోగాలు కొత్త కాదు. ఆమె ఉన్నఅనుచరులు, ఆమె కుటుంబీకులు కూడా ఆమెకు దూరం కావడం..భర్త తీరే అని ప్రచారం జరుగుతూ ఉంది. ఇలాంటి నేఫథ్యంలో ఆస్తుల వ్యవహారంలో అఖిలప్రియ భర్త దౌర్జన్యంగా వ్యహరించి, హత్యాయత్నం కేసును కూడా మీదకు తెచ్చుకున్నారని స్థానికులు అనుకుంటున్నారు. ఇలా సాగుతోంది ఈ మాజీ మంత్రి రాజకీయం!

సినిమా వస్తేనే.. యోధుడు గుర్తుకు వచ్చాడు!