Advertisement

Advertisement


Home > Politics - Gossip

వైసీపీ సిట్టింగ్ స్థానంలో తెర‌పైకి మ‌హిళా నేత‌!

వైసీపీ సిట్టింగ్ స్థానంలో తెర‌పైకి మ‌హిళా నేత‌!

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో తెర‌పైకి మ‌హిళా నేత వ‌చ్చారు. ప్ర‌స్తుతం అక్క‌డ వైసీపీ నుంచి బ్రిజేంద్ర‌రెడ్డి (నాని) ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. వైసీపీ అభ్య‌ర్థుల ఎంపిక జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆళ్ల‌గ‌డ్డ‌లో స‌మీక‌ర‌ణ‌లు మారుతున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి.

కొన్ని రోజులుగా ఆళ్ల‌గ‌డ్డ‌లో వైసీపీ త‌ర‌పున మ‌హిళా నాయ‌కురాలు గంగుల అవంతిరెడ్డి విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. దీంతో రానున్న ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి అవంతి అనే చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ఎమ్మెల్యే నానిపై స‌ర్వే నివేదిక‌లు వ్య‌తిరేకంగా ఉన్న‌ట్టు స‌మాచారం. నాని అదృష్టం ఏమంటే టీడీపీ ఇన్‌చార్జ్ భూమా అఖిల‌ప్రియ కావ‌డం. ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌ప్రియ ప‌రిస్థితి మ‌రీ ఘోరం.  

కిడ్నాప్‌లు, దౌర్జ‌న్యాలు, భూఆక్ర‌మ‌ణ‌ల్లో అఖిల‌ప్రియ‌, ఆమె త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్‌, భ‌ర్త భార్గ‌వ్ పీక‌ల్లోతు కూరుకుపోయారు. దీంతో రాజ‌కీయంగా ఆళ్ల‌గ‌డ్డ‌లో ఎదురు గాలి వీస్తోంది. ఇటు నాని, అటు అఖిల‌ప్రియ‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రు నిలిచినా గెలిచిపోతార‌న్న వాతావ‌ర‌ణ ఆళ్ల‌గ‌డ్డ‌లో నెల‌కుంది. దీంతో నానికి బ‌దులు కొత్త అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌నే ఆలోచ‌న‌లో వైసీపీ ఉన్న‌ట్టు స‌మాచారం. దీంతో ఎమ్మెల్యే నాని సొంత అక్క అవంతిని బ‌రిలో దింపాల‌నే ఆలోచ‌న సీఎం చేస్తున్నార‌ని తెలిసింది. ఇటీవ‌ల ఆమెను ఎమ్మెల్యే నాని స్వ‌యంగా సీఎం జ‌గ‌న్ వ‌ద్దకు తీసుకెళ్లి ప‌రిచ‌యం చేశారు.

సీఎం జ‌గ‌న్ ఎలాంటి హామీ ఇచ్చారో తెలియ‌దు కానీ, అవంతి మాత్రం ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికి వెళ్లి ప్ర‌చారం చేస్తున్నారు. వైసీపీకి మ‌రోసారి అవ‌కాశం ఇవ్వాల‌ని ఓట‌ర్ల‌ను ఆమె అభ్య‌ర్థిస్తున్నారు. స‌రిగ్గా ఎన్నిక‌ల ముందే అవంతి రావ‌డం, ప్ర‌చారం చేస్తుండ‌డంతో అభ్య‌ర్థి ఆమె అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?