Advertisement

Advertisement


Home > Politics - Gossip

అమ్మ ఒడి: వైసీపీ Vs టీడీపీ

అమ్మ ఒడి: వైసీపీ Vs టీడీపీ

ప్రజాసంకల్ప యాత్రలో హామీ ఇస్తే ఎవ్వరూ నోరు మెదపలేదు, మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా ఎవ్వరూ కామెంట్ చేయలేదు, ముఖ్యమంత్రి పదవి చేపట్టాక మేనిఫెస్టోలో ఉన్నవి ఉన్నట్టు అమలు చేస్తామన్నప్పుడు కూడా అందరూ సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు కొంతమంది నోళ్లు లేస్తున్నాయి. అమ్మఒడి పథకం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నిటికీ వర్తిస్తుందని జగన్ ప్రకటించగానే ఓ వర్గం విమర్శలు సంధిస్తోంది. 

ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల్లోని కొంతమంది నేతలు అమ్మఒడిపై విమర్శలు చేస్తున్నాయి. సర్కారు బడుల ఉసురు తీస్తారా? ప్రైవేట్ స్కూళ్లకు పిల్లల్ని పంపించే తల్లిదండ్రులంతా పేదవాళ్లా? అంటూ లాజిక్ లు మాట్లాడుతున్నారు. ఈ విమర్శల వెనక టీడీపీ హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. టీడీపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘాలు, టీడీపీ ప్రేరేపిత నాయకులు కొంతమంది పనిగట్టుకుని ఈ దుష్ప్రచారానికి మద్దతు తెలుపుతున్నారు. 

నిజానికి అమ్మఒడిపై టీడీపీ చేయాలనుకున్న రచ్చ ఇది కాదు. కేవలం ప్రభుత్వ బడులకే ఈ పథకం వర్తించేలా ప్రకటన వస్తే.. జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించాలని మేనిఫెస్టో హామీని సరిగ్గా అమలు చేయలేకపోయారని విరుచుకుపడాలనుకుంది. అయితే టీడీపీకి షాకిస్తూ, అమ్మలందరికి సంతోషాన్నిచ్చేలా అన్ని బడులకూ ఈ పథకం వర్తిస్తుందని తేల్చి చెప్పారు సీఎం జగన్. దీంతో టీడీపీ యూటర్న్ తీసుకుంది. అమ్మఒడి పథకాన్ని అన్ని స్కూళ్లకు ఎలా వర్తింపచేస్తారంటూ కొత్త పల్లవి అందుకుంది. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారంటూ, కార్పొరేట్ స్కూళ్ల కోసమే అమ్మఒడి పథకం తెచ్చారని వితండవాదనకు దిగుతోంది. 

టీడీపీ విమర్శలకు వైసీపీ దీటుగానే సమాధానమిస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తున్నప్పుడు తప్పు కనపడలేదా? ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇస్తున్నప్పుడు తప్పుగా తోచలేదా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అందుబాటులో మంచి స్కూళ్లు లేక, పిల్లల భవిష్యత్ పై రాజీ పడలేక అప్పులు చేసి మరీ స్కూల్ ఫీజులు కడుతున్న పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారికి ఆసరాగా ఉండటం కోసమే అమ్మఒడి పథకం అమలు చేస్తున్నారు జగన్. 

తెల్ల రేషన్ కార్డు అనే అర్హత ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి.. దాదాపుగా నిరుపేదలకే ఇది లబ్ధి చేకూరుస్తుందని చెప్పాలి. ఇలాంటి మంచి పథకాన్ని కూడా విమర్శిస్తోన్న టీడీపీ నీఛ రాజకీయాలకు, అలాంటి వారికి మద్దతు తెలుపుతున్న ఉపాధ్యాయ సంఘాలకు వైసీపీ గట్టిగానే సమాధానం చెబుతోంది.

బాబుపై కేసుల విచారణకు ఇక అవరోధాలు లేవు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?