ఫైబ‌ర్‌నెట్ పూర్వ ఎండీ స‌ర్కార్‌కు అవాస్త‌వాల స‌మ‌ర్ప‌ణ‌!

తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న అధికారికి నివేదిక బాధ్య‌త‌ల్ని అప్ప‌గిస్తే, అది ఎలా వుంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఏపీ ఫైబ‌ర్‌నెట్‌ను క‌నురెప్పే కాటేస్తోంద‌ని, ఎవ‌రైతే న‌ష్టం తెస్తున్నారో, వాళ్ల‌ను త‌ప్పించాల‌ని చైర్మ‌న్ హోదా జీవీరెడ్డి సంచ‌ల‌న విష‌యాలు చెప్పారు. అయితే అక్ర‌మార్కుల‌కే ప్ర‌భుత్వ పెద్ద‌లు వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని గ్ర‌హించిన జీవీరెడ్డి, ఈ సంస్థ‌ను ఉద్ధ‌రించ‌డం త‌న వ‌ల్ల అయ్యే ప‌నికాద‌ని, తానే అక్క‌డి నుంచి నిష్క్ర‌మించారు. అంతేకాదు, రాజ‌కీయాల‌కు కూడా ఆయ‌న ప్ర‌స్తుతానికి దూరంగా ఉన్నారు.

జీవీరెడ్డి ప్ర‌ధానంగా ఆరోప‌ణ‌లు గుప్పించింది… ఎండీ దినేష్‌కుమార్‌, అలాగే మ‌రో ముగ్గురు ఉద్యోగులు. నిజంగా జీవీరెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వాల్ని నిగ్గు తేల్చాల‌నే ఉద్దేశ‌మే ప్ర‌భుత్వానికి ఉన్న‌ట్టైతే… ఏం చేయాలి? ఏం చేసింది? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ఆరోప‌ణ‌ల‌పై ఒక ఉన్న‌తాధికారితో విచార‌ణ జ‌రిపించి, నివేదిక తెప్పించుకోవాలి. కానీ ప్ర‌భుత్వం ఏం చేసిందంటే… ఎవ‌రైతే ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారో, ఆయ‌న‌తోనే నివేదిక ఇప్పించుకుంది. ఇంత‌కంటే దౌర్భాగ్యం మ‌రొక‌టి వుంటుందా?

ఏపీ ఫైబ‌ర్‌నెట్‌లో అస‌లేం జ‌రిగిందో దినేష్‌కుమార్ వాస్త‌వాల్ని నివేదిక రూపంలో మంత్రి జ‌నార్ద‌న్‌రెడ్డికి స‌మ‌ర్పించార‌ట‌. ఆ నివేదిక ప్ర‌కారం జీవీరెడ్డి ప‌చ్చి అబద్ధాలు చెప్పార‌నే అభిప్రాయం క‌లుగుతోంది. ఇలాంటి సంకేతాలు పంప‌డం ద్వారా ప్ర‌భుత్వం ఏం ఆశిస్తున్న‌దో అర్థం కావ‌డం లేదు. మంత్రికి దినేష్‌కుమార్ స‌మ‌ర్పించిన నివేదిక‌లో నిజాలు నేతిబీర‌కాయ‌లో నెయ్యి చందంగా ఉన్నాయ‌నే మాట వినిపిస్తోంది.

గ‌త ఐదు నెల‌ల్లో 9,758 క‌నెక్ష‌న్లు పెంచిన‌ట్టు నివేదిక‌లో పేర్కొన్నారు. కానీ విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత 50 వేల క‌నెక్ష‌న్లు త‌గ్గాయి. దినేష్‌కుమార్ నివేదిక ప్ర‌కారం క‌నెక్ష‌న్లు పెరిగితే, ఆదాయం కూడా పెరిగి వుండాలి క‌దా? ప్ర‌త్యేకంగా క‌నెక్ష‌న్ల ఆదాయం ఊసే లేదెందుకు?

మ‌రీ ముఖ్యంగా నెట్‌వ‌ర్క్ బ్యాండ్‌విడ్త్‌ను స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించ‌డం ద్వారా ఏటా రూ.5 కోట్లు ఆదా చేశామ‌ని ఆయ‌న నివేదిక‌లో తెలిపారు. కానీ విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం రూ.40 కోట్ల ఆదాయం త‌గ్గింది. ఆల్రెడీ ఇంత మందిని తీసేయాల‌ని జీవీరెడ్డి ఇచ్చిన ఆదేశాలు అమ‌లు కాలేద‌న్న‌దే ప్ర‌ధాన ఆరోప‌ణ‌. జీవీరెడ్డి వైదొల‌గిన త‌ర్వాత‌, రెండుమూడు రోజులుగా మాత్రమే 200 మందిని తొల‌గించిన‌ట్టు ప‌మాచారం.

జీఎస్టీకి సంబంధించి 18% వ‌డ్డీ, జ‌రిమానాతో క‌లిపి రూ.377.14 కోట్లు చెల్లించాల‌ని 2025, జ‌న‌వ‌రి 23న జీఎస్టీ నుంచి మ‌రో నోటీసు అందిన‌ట్టు దినేష్‌కుమార్ నివేదిక‌లో త‌ప్పుడు స‌మాచారం ఇచ్చారు. మ‌రో నోటీసు అన‌డంలోనే త‌న త‌ప్పును తానే బ‌య‌ట పెట్టుకున్నారు. 2024లోనే జీఎస్టీ నోటీసు ఇచ్చింది. దాన్ని ప‌ట్టించుకోకుండా, చెత్త‌బుట్ట‌లో ప‌డేయ‌డంతో జరిమానా విధిస్తూ భారీ మొత్తంలో చెల్లించాల‌ని జీఎస్టీ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చింది. అంత‌కు ముందు ఇచ్చిన నోటీసుకు స్పందించ‌క‌పోవ‌డం వ‌ల్లే ప్ర‌భుత్వం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వ‌చ్చింద‌న్న‌ది వాస్త‌వం. నోటీసుకు, ఆదేశాల‌కు తెలియ‌నంత అమాయ‌క స్థితిలో జ‌నం ఉన్నారని దినేష్‌కుమార్ అనుకుంటున్నారా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

మూడు నెల‌ల్లోగా వివ‌ర‌ణ ఇవ్వడం కాదు, అప్పీల్ చేసుకోవాల్సి వుంటుంది. అది కూడా రూ.15 కోట్లు చెల్లించాల్సిన దుస్థితి. అలాగే సంస్థ ఖాతాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో నిర్ల‌క్ష్యం వ‌హించిన ఆడిట్ సంస్థ‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టామ‌ని దినేష్‌కుమార్ చెబుతున్న దాంట్లో నిజం లేద‌ని ఫైబ‌ర్‌నెట్ వ‌ర్గాలు అంటున్నాయి. ఆ సంస్థ‌నే దినేష్‌కుమార్ వేధింపులు త‌ట్టుకోలేక‌పోయిన‌ట్టు వాళ్లు చెబుతున్న ప్ర‌కారం నిజం. డీహెచ్‌కే అండ్ అసోసియేట్స్ సంస్థ దినేష్ ఏరికోరి తెచ్చుకున్న‌ద‌ని ఫైబ‌ర్‌నెట్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి.

తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న అధికారికి నివేదిక బాధ్య‌త‌ల్ని అప్ప‌గిస్తే, అది ఎలా వుంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఫైబ‌ర్‌నెట్‌లో ప్ర‌భుత్వ పెద్ద‌లెవ‌రో, ఏదో కోరుకుంటున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. అంద‌రూ క‌లిసి ఆ సంస్థ‌ను దివాళా తీయించ‌డానికి నిర్ణ‌యించ‌న‌ట్టుగా దినేష్‌కుమార్ ఇచ్చిన నివేదిక చూస్తేనే అర్థ‌మ‌వుతోంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

7 Replies to “ఫైబ‌ర్‌నెట్ పూర్వ ఎండీ స‌ర్కార్‌కు అవాస్త‌వాల స‌మ‌ర్ప‌ణ‌!”

  1. అంటే ఇప్పుడు దినేష్ కుమార్ ఇచ్చిన నివేదిక తప్పులతడక అంటావ్? అంటే జి వ్ రెడ్డి చేసిన ఆరోపణలు అన్నీ కరెక్ట్ అంటావ్. 900 మందిని జగన్ సర్కార్ ఊరికే జీతాలు ఇచ్చి మేపింది అంటావ్. జగన్ జమానా లో ఫైబర్నేట్ నష్టాల్లోకి వెళ్ళింది అని జి వ్ రెడ్డి చెప్పింది నిజమే అంటావ్

    1. నేను నిజాలు చెప్పాను, నిజాయితీగా పని చేశాను.

      నిజాయితీకి ఏమి విలువ ఇస్తారో అర్థం అయ్యింది.

      ప్రజలకి అర్థం అవ్వాలని చెప్పాను.

      ప్రజలు వివేకవంతులైతే అర్థం చేసుకంటారు.

      ప్రజలు గొఱ్ఱెలైతే కప్పదాటు వెయ్యబోయి గుంతలో పడతారు.

  2. నేను నిజాలు చెప్పాను, నిజాయితీగా పని చేశాను.

    నిజాయితీకి ఏమి విలువ ఇస్తారో అర్థం అయ్యింది.

    ప్రజలకి అర్థం అవ్వాలని చెప్పాను.

    ప్రజలు వివేకవంతులైతే అర్థం చేసుకంటారు.

    ప్రజలు గొఱ్ఱెలైతే కప్పదాటు వెయ్యబోయి గుంతలో పడతారు.

Comments are closed.