పవన్‌ను గెలిపించి తప్పుచేశా!

త‌న‌ను గెలిపించిన వ‌ర్మ‌ను రాజ‌కీయంగా భూస్థాపితం చేసేలాగా ప‌వ‌న్ అడుగులు వేస్తున్న‌రంటూ టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.

2019 ఎన్నిక‌ల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను 2024లో ఎమ్మెల్యేగా చేసిన కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ రాజ‌కీయ పీఠానికే డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎస‌రు పెట్టార‌నే ఆవేద‌న ఆయ‌న అనుచ‌రుల్లో క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో పొత్తులో భాగంగా పిఠాపురం సీటును జ‌న‌సేన‌కు కేటాయించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తాన‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించ‌గానే, ఆ నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో వ‌ర్మ అనుచ‌రులు అగ్గి పుట్టించారు. వ‌ర్మ కూడా తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

వ‌ర్మ‌ను చంద్ర‌బాబు పిలిపించుకుని, పిఠాపురం టీడీపీ కార్య‌క‌ర్త‌ల స‌మ‌క్షంలో అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు ప‌లకాల‌నే చంద్ర‌బాబు ఆదేశాల్ని వ‌ర్మ అనుస‌రించారు. కూట‌మి అధికారంలోకి రావ‌డం, ఇప్పుడు ఐదు ఎమ్మెల్సీ ప‌ద‌వుల్ని అధికార ప‌క్షానికే ద‌క్క‌డం తెలిసిందే. ఇందులో త‌ప్ప‌కుండా వ‌ర్మ‌కు ఇస్తార‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రిగింది. ఊరించి… చివ‌రికి వ‌ర్మ‌కు ఉసూరుమ‌నిపించారు.

ఇదేమ‌ని అంటే, 2027లో ఇస్తామ‌ని అడిగిన వాళ్లంద‌రికీ చెప్పి, కొంద‌రి నోళ్లు మూయించారు. నిజానికి వ‌ర్మ‌కు త‌ప్ప‌కుండా ఇవ్వాల్సి వుండింది. కానీ ఆ ప‌ని జ‌ర‌గ‌లేదు. వ‌ర్మ‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డానికి డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌రోక్ష కార‌ణ‌మ‌ని ఆయ‌న అనుచ‌రులు ఆరోపిస్తున్నారు. వ‌ర్మ‌ను ఎమ్మెల్సీ చేస్తే, పిఠాపురం మ‌రో ప‌వ‌ర్ పాయింట్ ఏర్ప‌డుతుంద‌ని, అప్పుడు జ‌న‌సేన ప్రాభ‌వం త‌గ్గుతుంద‌నే భ‌యాన్ని చూడొచ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

కేవ‌లం డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌వ‌ర్ త‌గ్గుతుంద‌నే ఏకైక కార‌ణంతోనే వ‌ర్మ‌ను ప‌క్క‌న పెట్టార‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. వ‌ర్మను పక్క‌న పెట్టాల్సిన కార‌ణం ఏంటో చెప్పాల‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌లు అంటున్నారు. ఎవ‌రి కోస‌మే సొంత పార్టీకి చెందిన నేత‌ల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌క‌పోవ‌డం ఏంట‌నే నిలదీత వ‌ర్మ అనుచ‌రుల నుంచి వ‌స్తోంది. ఇలాగైతే టీడీపీ కోసం ఎందుకు ప‌ని చేయాల‌నే ఆవేద‌న కూడా లేక‌పోలేదు. నెమ్మ‌దిగా వ‌ర్మ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను సొంత వాళ్లే విధ్వంసం చేస్తున్నార‌ని ఆయ‌న అనుచ‌రులు మండిప‌డుతున్నారు. త‌న‌ను గెలిపించిన వ‌ర్మ‌ను రాజ‌కీయంగా భూస్థాపితం చేసేలాగా ప‌వ‌న్ అడుగులు వేస్తున్న‌రంటూ టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. పవన్‌ను గెలిపించి తప్పుచేశామనే భావన వర్మ అభిమానుల్లో నెలకొంది.

54 Replies to “పవన్‌ను గెలిపించి తప్పుచేశా!”

  1. నువ్వు తెగ చించుకోకు. వర్మ ప్రెస్ మీట్ పెట్టిమరీ చెప్తున్నాడు…పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తున్న అని

  2. 😂😂😂😂….మన అన్నయ్య కోసం గొడ్డు లా కష్ట పడుతు, state మొత్తం తిరిగిన Shellemma కోసం కూడా నువ్వు ఇంత బాధ పడలేదు కదా GA…..SO SAD

  3. ఏందీ, ఇదంతా వర్మ మీద ప్రేమే? లేక పవన్ మీద అసూయ తో వర్మ మీద ప్రేమ ఒలకపోస్తువన్నవ ! అంటే కదా.

    జగన్ రెడ్డి కోసం ఆడవాళ్ళు ఎన తల్లి, చెల్లి అంట కష్టపడితే, జగన్ రెడ్డి వాళ్ళకి సహాయం చేయకపోగా, వాళ్ళ మీద కో*ర్టు లో కే*సు కూడా వేసాడు, మర జగన్ రెడ్డి నీ ఏమో అనాలి, నీ భాష లోనే!

  4. తొక్కలే.. ఆయన గెలిచిందే ఒకసారి.. పవన్‌కళ్యాణ్ పిఠాపురం లో పోటీ చేస్తున్నాడు అని అనౌన్స్‌మెంట్ రాకముందు ఈ వర్మ ఎవడో టిడిపి వాళ్లకే కాదు.. తూగో జిల్లా వాళ్లకి కూడా తెలీదు. ఎన్నికల అప్పుడు కూడా చాలా ఓవరాక్షన్ చేసాడు.. బాబుగారు ఈయన్ని పక్కన పెట్టి మంచిపనే చేసారు. ఈయనకి సీన్ ఇచ్చి పార్టీ ని కూటమి ని ఆపైన కాపు ఓట్లని దెబ్బతీసుకోవటం తప్ప ఏ రకంగా ఈయన వల్ల పార్టీ కి ఉపయోగం? ఎన్నికలు అవ్వగానే కాకినాడ ఏంపీ తో గొడవలు.. ఆపైన పిఠాపురం లో పట్టు కోసం తెరచాటు కుట్రలు.. కూటమి వల్ల ఎంతో మందికి సీట్లు పొయ్యాయి, కాని వీడు చేసినంత ఓవరాక్షన్ ఎవరూ చెయ్యలేదు.

    1. వస్తువులు అంత ఈజీగా మర్చిపోతే ఎలా? ఓ పార్టీ ప్రెసిడెంట్ అయ్యి ఉన్న పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేగా రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ, వర్మ మాత్రం తన నియోజకవర్గం పిఠాపురంలో ఇండిపెండెంట్‌గా గెలిచాడు. అది తన శక్తి బ్రదర్!

      1. ఏ పార్టీ గుర్తు లేకుండా గెలిచాడు అంటే అంత కన్నా చెప్పేది ఏమీ లేదు

      2. ఒకసారి గెలిచినంత మాత్రాన వర్మ కి పవన్‌కళ్యాణ్ కంటే ఎక్కువ ఇమేజ్ ఉన్నట్లా? ఎన్టీఆర్ కల్వకుర్తి లో ఒక అనామకుని చేతిలో ఓడిపోయాడు.. అలా అని ఎన్టీఆర్ తక్కువ.. అతను ఎక్కువ అనలేం కదా.. మంగళగిరి లో లోకేష్ ఓడిపోలేదా? అలా అని లోకేష్ కన్నా ఆ ఆర్కే ది పెద్ద స్థాయి అవుతుందా? పీకే విషయం లోనూ అంతే. రాజకీయాల్లో గెలుపు ఓటములకి అతీతం గా కొన్ని స్థాయిలు ఉంటాయి. రాష్ట్ర స్థాయి నాయకులు ఒక్కోసారి తమ సొంత నియోజక వర్గాల్లో ఓడిపోవచ్చు. అలా అని వాళ్ల ఇమేజ్ తగ్గదు. ఈ వర్మ ఇంకో నాలుగు సార్లు గెలిచినా పవన్ స్థాయి కి వస్తాడా? అలాంటిది తనకు తాను ఎక్కువ ఊహించుకుని పిఠాపురం నించి పవన్‌కళ్యాణ్ నే పంపించే కుట్రలు చెయ్యాలని చూస్తే అది సాధ్యం అయ్యే పనేనా?

        1. //మంగళగిరి లో లోకేష్ ఓడిపోలేదా? అలా అని లోకేష్ కన్నా ఆ ఆర్కే ది పెద్ద స్థాయి అవుతుందా?//

          ఆర్కే .. లోకేష్ కన్నా చాలా గొప్ప వాడే. తండ్రి పేరు పక్కకి తీసి పెడితే.. లోకేష్ అనామకుడే! ఆర్కే తండ్రి పేరు చెప్పుకుని ఎదగలేదు.. రెండు సార్లు ఒక్కడే గెలిచాడు! 40 ఏళ్ళ రాజకీయం అని గప్పాలు కొట్టుకునే.. తండ్రి ఉండి కూడా.. ఘోరంగా ఓడిపోయాడు లోకేష్. బొల్లి గాడు.. భయపడి.. 2014 లో పోటీచేయిస్తే ఓడిపోతే బాగోదు అని.. చివరకు.. ఎలాగైనా..అధికారం ఇవ్వాలని వాడిని D0n G@ చాటున.. MLC చేసుకుని మంత్రిని చేసుకున్నాడు! చివరికి 2019 లో పోటీచేస్తే.. ఘోరంగా ఓడిపోయాడు Lokesh!

          ఇంకెందుకు పెద్ద స్థాయి అవదు.. ? ఎవరి సామర్ధ్యాన్నిఅయినా. అంచనా వెయ్యాల్సింది… వాళ్ళ సామర్ధ్యాలను బట్టి కానీ తండ్రి అధికార సామర్ధ్యాన్ని బట్టి కాదు!

        2. ఒక వేళ వర్మ పోటీ చేసి ఉంటె రెబెల్ పావలా గెలిచే వాడా ? ఓడిపోయి ఉంటె.. అప్పుడేమయ్యేది? వాళ్ళ అభ్యర్థులందరూ గెలిచి నాయకుడు ఓడిపోయేవాడు! అప్పుడు పర్మనెంట్ గా ఎప్పుడు ఓడిపోయే నాయకుడిగా చరిత్రకెక్కి వాడు! దాని నుండి తప్పించాడు గా వర్మ? మరి మాట ఇచ్చినప్పుడు ఇద్దరు బొల్లి పావలా అమలు చెయ్యాలిగా న్యాయం చెయ్యాలి గా?

          1. ఆయన పోటీ చేసిందే 3 సార్లు. అందులో 2 సార్లు ఓడిపోయాడు. ఏదో పిఠాపురం తరతరాలుగా ఆయన కంచుకోట అన్నట్లు సొల్లు బిల్డప్‌లు

      3. ఆ రోజు అవసరానికి వర్మ చేతులు పెట్టుకున్నాము.

        ఈ రోజు పుల్ల పెట్టి అది టీడీపీ వాళ్ళ వ్యవహారం అని ఇరికించాము.

        బోడి కుర్మ కి ఏరు దాటినాక …తిక్క కుదిరింది.

  5. ఏ పార్టీ గెలవడానికైనా … 3-4 శాతం ఓట్లు మాత్రమే కారణమవుతాయి కనుకనే వైసీపీ కి 39.37% ఓట్ల శాతం ఇంకా వుంది. టీడీపీ కి వచ్చిన 45.6 శాతం ఓట్లలో 6.85 శాతం జనసేన ఓట్లు బదలాయింపు అనుకుంటే.. టీడీపీ సాధించింది 38.75% మాత్రమే అందుకే పవన్ కళ్యాణ్ విలువ తెలిసిన చంద్రబాబు నెత్తిన పెట్టుకుంటున్నాడు. అలాగే జనసేన పోటీ చేసిన ప్రతి చోట టీడీపీ ఓట్ల బదలాయింపు కూడా బాగా జరిగింది కనుకనే జనసేన లాభపడింది.

    ఇక పొతే వర్మ ని తప్పుకోమన్నది , ఎమ్మెల్సీ ఇస్తానన్నది చంద్రబాబు.. అది వాళ్ళ పార్టీ గోల .. వర్మకి జరిగింది కరెక్ట్ కాదు. కానీ న్యాయం చేయాల్సినది టీడీపీ! పవన్ కాదు!!!

    వర్మ తన కోపం పవన్ మీద కానీ జనసేన మీద కానీ చూపిస్తే.. పవన్ కళ్యాణ్ తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కి చుక్కలు చూపించగలడు. అందుకే వర్మని బుజ్జగిస్తున్నది టీడీపీ. అతను ఈ వ్యాఖ్య రాసే టైంకి బాగానే ఉన్నాడు. GA కి మాత్రం కడుపు ఉబ్బరం తగ్గట్లేదు. ఇది ఇంతే !!

    1. మరి ఎన్నికల ముందు ఓడ మల్లయ్య వర్మ కాళ్ళు ఎందుకు పట్టుకున్నారు?

      ఏరు దాటినాక బోడి మల్లయ్య కుర్మ చెయ్యడానికేనా??

      క్షత్రియ రాజులని బట్రాజులు చెయ్యడానికేనా ???

    2. ఆ రోజు అవసరానికి వర్మ చేతులు పెట్టుకున్నాము.

      ఈ రోజు పుల్ల పెట్టి అది టీడీపీ వాళ్ళ వ్యవహారం అని ఇరికించాము.

      బోడి కుర్మ కి ఏరు దాటినాక …తిక్క కుదిరింది.

    3. ఓహో ఔనా, 2019 లో జనసేనకి ఎంత వోట్ % వచ్చిందేంటి? ఎందుకు 1 సీటే వచ్చింది?

      1. 2019 లో జనసేన కి 5.53% వోట్ షేర్ వచ్చింది. ఒక సీట్ గెలిచింది

        2024 లో జనసేన కి 6.87% వోట్ షేర్ వచ్చింది. ఇరవై ఒక్క సీట్లు వచ్చాయి.

  6. మా పిఠాపురంలో ఒక్కడే నాయకుడు.. ఇప్పటికీ ఎప్పటికీ.. జై పవన్ జై జనసేన..

    1. మరి ఎన్నికల ముందు ఓడ మల్లయ్య వర్మ కాళ్ళు ఎందుకు పట్టుకున్నారు?

      ఏరు దాటినాక బోడి మల్లయ్య కుర్మ చెయ్యడానికేనా??

      క్షత్రియ రాజులని బట్రాజులు చెయ్యడానికేనా ???

    2. ఆ రోజు అవసరానికి వర్మ చేతులు పెట్టుకున్నాము.

      ఈ రోజు పుల్ల పెట్టి అది టీడీపీ వాళ్ళ వ్యవహారం అని ఇరికించాము.

      బోడి కుర్మ కి ఏరు దాటినాక …తిక్క కుదిరింది.

  7. ఆ రోజు అవసరానికి వర్మ చేతులు పెట్టుకున్నాము.

    ఈ రోజు పుల్ల పెట్టి అది టీడీపీ వాళ్ళ వ్యవహారం అని ఇరికించాము.

    బోడి కుర్మ కి ఏరు దాటినాక …తిక్క కుదిరింది.

  8. అవును వర్మ నిజాయితీ నిలుపుకోలేదు.. అడుగు అడుగున జనసేన పార్టీ పై పవన్ కళ్యాణ్ గారి పై అక్కసు వెళ్ళగక్కాడు .. కుట్రలు పన్నాడు ..ఇప్పటికి విషం కక్కుతూనే వున్నావడు .. వక్రబుద్ది నీ తెలుగు దేశం పార్టీ గమనించింది.. ఒకటి గుర్తు పెట్టుకో వర్మ.. అసలు కూటమి అధికారం లోకి వచ్చింది జనసేన పుణ్యమే.. బి జె పి ని కూటమిలోకి రప్పించి తన పార్టీ సీట్లను కూడా త్యాగం చేసి కూటమిని అఖండ మెజారిటీ తో అధికారం లోకి తీసుకు వచ్చిన ఘనత జనసేన పార్టీది.. వర్మ త్యాగం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఏం ఎల్ ఏ కాలేదు. ఒక వేళ వర్మ పోటీ చేసిన కూడా ఒక పదివేల ఓట్లు మెజారిటీ తగ్గేది కానీ పవన్ కళ్యాణ్ గెలుపు పక్కాగా ఉండేది..

    కానీ కుట్ర పూరిత బుద్ది అడుగు అడుగునా చూపించాడు .. .. చేసుకున్నోడికి చేసుకున్నంత వర్మా.. అర్ధం అయ్యిందా..

    1. ఆ రోజు అవసరానికి వర్మ చేతులు పెట్టుకున్నాము.

      ఈ రోజు పుల్ల పెట్టి అది టీడీపీ వాళ్ళ వ్యవహారం అని ఇరికించాము.

      బోడి కుర్మ కి ఏరు దాటినాక …తిక్క కుదిరింది.

  9. గోదావరి జిల్లాలో రాజులు క్షత్రియుల్లా బ్రతికేవోళ్ళు అని చెప్పుకునే రోజులు వచ్చాయి

Comments are closed.