హీరోయిన్ కు ఏకాంతంగా కథ చెబుతానన్నాడు

కెరీర్ ప్రారంభంలో ఓ దర్శకుడు ఆమెకు కథ చెప్పడానికి వచ్చాడట. అయితే తల్లిని కారవాన్ నుంచి బయటకు వెళ్లమని చెప్పాడట.

హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమకొచ్చిన మహిళలకు ఇది మరింత కష్టం. ఈ విషయంలో బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేదు. గ్లోబల్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా కూడా తొలినాళ్లలో ఇలాంటివి చవిచూసింది.

ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక చోప్రా తల్లి బయటపెట్టింది. కెరీర్ ప్రారంభంలో కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకున్నామని, సెట్స్ లో తను ఓ దెయ్యంలా అలా కూర్చునేదాన్నని వెల్లడించారు. అదే టైమ్ లో ప్రియాంక కూడా చాలా పరిణతి చూపించిందని, మానసికంగా ఎంతో దృఢంగా ఉండేదని, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో తనే ధైర్యంగా నిర్ణయం తీసుకుందని అన్నారు.

కెరీర్ ప్రారంభంలో ఓ దర్శకుడు ఆమెకు కథ చెప్పడానికి వచ్చాడట. అయితే తల్లిని కారవాన్ నుంచి బయటకు వెళ్లమని చెప్పాడట. కాస్త ఏకాంతంగా నెరేషన్ ఇస్తానని ప్రియాంక చోప్రాకు చెప్పాడట.

ఆ పరిస్థితిని ప్రియాంక చాలా ధైర్యంగా ఎదుర్కొందని, “తన తల్లి పక్కన లేకుండా మీరు కథ చెప్పలేకపోతే, సినిమా చేస్తానని మీరు ఎలా అనుకున్నారు.” అంటూ ఘాటుగా స్పందించిందంట. ఆ వెంటనే కారవాన్ నుంచి బయటకు వచ్చేసిందట.

ఇలా చెప్పుకుంటే ప్రియాంక కెరీర్ లో ఎన్నో ఘటనలున్నాయంటోంది ఆమె తల్లి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ, మహేష్-రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తి చేసింది. త్వరలోనే ఆమె మరోసారి సెట్స్ లో జాయిన్ అవుతుంది.

5 Replies to “హీరోయిన్ కు ఏకాంతంగా కథ చెబుతానన్నాడు”

  1. అంత నిర్మాతలు డైరెక్టర్ లు ఎదో చెయ్యబోయారని చెబుతున్నారు పేరు వచ్చాక వాళ్ళను ఎలాగా మీరు ఇబ్బందులు పెట్టేరో కూడా చెప్పండి

  2. చాక్లెట్ బాయ్ పక్కన ఈ మేడం చేస్తున్నారా.. వాళ్ళ మదర్ కూడా వస్తున్నారా

Comments are closed.