ఎమ్మెల్సీగా ఆయ‌న వైపే బీజేపీ మొగ్గు!

మిత్ర‌ప‌క్షంలో భాగంగా ద‌క్కిన ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీటును ఏపీ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు ఇవ్వాల‌ని ఆ పార్టీ జాతీయ నాయ‌క‌త్వం నిర్ణ‌యించింది.

మిత్ర‌ప‌క్షంలో భాగంగా ద‌క్కిన ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీటును ఏపీ బీజేపీ మాజీ అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు ఇవ్వాల‌ని ఆ పార్టీ జాతీయ నాయ‌క‌త్వం నిర్ణ‌యించింది. ఇవాళ్టితో నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు ముగియ‌నుంది. ఇప్ప‌టికే జ‌న‌సేన త‌ర‌పున నాగ‌బాబు నామినేష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే.

గ‌త రాత్రి టీడీపీ త‌మ ముగ్గురు అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించింది. బీజేపీకి కేటాయించిన ఆ ఒక్క సీటును సీనియ‌ర్ నాయ‌కుడికి ఇవ్వాల‌ని జాతీయ నాయ‌క‌త్వం నిర్ణ‌యించ‌డం విశేషం. దీంతో ఆ ఐదుగురు అభ్య‌ర్థులెవ‌ర‌నే సస్పెన్ష‌న్‌కు తెర‌ప‌డింది. ఇవాళ న‌లుగురు అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేయ‌నున్నారు.

సోము వీర్రాజు అంటే టీడీపీకి మొద‌టి నుంచి వ్య‌తిరేక‌తే. చంద్రబాబునాయుడు, లోకేశ్ త‌దిత‌ర నేత‌ల్ని నిర్మొహ‌మాటంగా చాలా సంద‌ర్భాల్లో సోము వీర్రాజు విమ‌ర్శించారు. టీడీపీని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ద‌గ్గ‌రికి తీసుకోవ‌ద్ద‌ని బీజేపీ జాతీయ నాయ‌క‌త్వానికి సోము వీర్రాజు చెప్పార‌న్న కోపం ఆ పార్టీ నేత‌ల్లో వుంది. సోము వీర్రాజును త‌ప్పించి, ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి ఏపీ బీజేపీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో టీడీపీ హ్యాపీగా ఫీల్ అయ్యింది.

పేరుకే పురందేశ్వ‌రి బీజేపీ నాయ‌కురాల‌ని, త‌న తండ్రి స్థాపించిన టీడీపీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మో ఆమె ప‌నిచేస్తార‌నే విమ‌ర్శ‌, అభిప్రాయం సొంత పార్టీ నాయ‌కుల్లో వుంది. ఏపీలో బీజేపీ మిత్ర‌ప‌క్ష ప్ర‌భుత్వం ఉన్న‌ప్ప‌టికీ, సోము వీర్రాజు గ‌త తొమ్మిది నెలల్లో ఎక్క‌డా క‌నిపించిన దాఖ‌లాలు లేవు. అయిన‌ప్ప‌టికీ వీర్రాజు వైపు బీజేపీ మొగ్గు చూప‌డం, టీడీపీకి, పురందేశ్వ‌రికి న‌చ్చ‌ద‌నే వాద‌న కూడా లేక‌పోలేదు. ఏది ఏమైనా చంద్ర‌బాబు ,ఆయ‌న టీమ్ ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితి. ఇక పురందేశ్వ‌రి నిర్ణ‌యాలు తీసుకునే ప‌రిస్థితిలో లేరు.

10 Replies to “ఎమ్మెల్సీగా ఆయ‌న వైపే బీజేపీ మొగ్గు!”

  1. మోడీ గారు కూడా వైసీపీ పాలు తాగిన సోము గారికి సీట్ ఇచ్చి జగన్ గారిని ఆనంద పర్చేరు రేపటి నుంచి సీట్ ఇప్పించిన జగన్ గారికి ఈయన గోచి సర్దడమే మిగిలింది

  2. జాగా బొక్క క్యాండిడేట్. ఎంత పార్టీ నిబద్ధత ఉన్నా పార్టీ కి నయాపైసా ఉపయోగం లేని..పైపెచ్చి పార్టీ కి, కూటమి కి హాని కలిగేలా ప్రవర్తించే ఈయనకి ఇవ్వటం వల్ల ఏంటి ఉపయోగం.

  3. బీజేపీ మొదటి నుంచి ఇదే గేమ్ ఆడుతుంది. తమ బలానికి మించి పదవులు తీసుకోవటం తద్వారా కూటమి పార్టీలలో చిచ్చు పెట్టి పరోక్షంగా వైసీపీ కి మేలు చెయ్యాలి. గత సాధారణ ఎన్నికలలో అనకాపల్లి నుంచి ఎంపీ గా పోటీ చెయ్యటానికి అన్నీ రెడీ చేసుకున్న నాగబాబు ని కాదని బీజేపీ ఆ సీటు తీసుకున్నది. అదే విధముగా నరసాపురం స్థానం తీసుకొని సిట్టింగ్ ఎంపీ అయినా రఘురామా రాజుకి సీటు లేకుండా చెయ్యాలని చూసారు. నాగబాబు కి రాజ్యసభ సీటు ఇవ్వాలనుకున్న దశలో మళ్ళీ బీజేపీ ఒక సీట్ కావాలని కాలు అడ్డం పెట్టారు. ఇప్పుడు MLC ల విషయంలో అదే చేశారు.

    ఇదే విధముగా ఆంధ్రాలో బీజేపీ కుట్రలు కొనసాగితే టీడీపీ , జన సేన తలుచుకుంటే తెలంగాణలో బీజేపీ కి అధికారం సంగతేమో కానీ కనీసం అయిదు స్థానాలు మించి రావు .

  4. సంతోషం, బాబు గారు ఏదో ఒక మంత్రి పదవి కూడా ఇచ్చి సత్కారం చేస్తే సరి.

  5. ఆంధ్రుల అస్థిత్వాన్నే.. ఆప్ కా నామ్ క్యా హై అని అడిగినందుకు..

    అందరికంటే ఎక్కువగా అప్పట్లో మన అధినాయకత్వమే ఫీల్ అయినట్టుంది !?

    2015 లో బాబుగారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ఋణాన్ని…

    2018 – 19 లో ఈ ఈర్రాజు ఎంత బాగా తీర్చుకున్నారో మనందరికంటే బాబుగారికే బాగా తెలుసనుకోండి !?

    కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా…ఇంతకంటే ఫోరాట యోధుడు లేక ఈయనకి ఇవ్వాల్సి వచ్చింది !!

Comments are closed.