తెలంగాణలో కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. అక్కడకూడా అయిదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కాబోతున్నాయి. కాకపోతే.. సంఖ్యాబలాల కారణంగా.. ఒక ఎమ్మెల్సీ సీటు భారాసకు దక్కబోతోంది. మిగిలిన నాలుగు కాంగ్రెస్ పరం అవుతాయి. కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి, ఒకదానిని తమ మిత్రపక్షం సీపీఐకు కేటాయించింది. ఎలాంటి శషబిషలు, వాయిదాలు, డొంకతిరుగుడులు లేకుండా.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకున్నదనే విశ్లేషణలు ఇక్కడ వినిపిస్తున్నాయి.
ప్రధానంగా సీపీఐకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం గురించి ప్రస్తావించాలి. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో.. సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. వారు రెండు ఎమ్మెల్యే స్థానాలకోసం గట్టిగా పట్టుపట్టగా.. ఒకటి మాత్రం కేటాయించి, భవిష్యత్తులో ఒక ఎమ్మెల్సీ ఇస్తాం అని మాట ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో అవకాశం రాగానే.. ఆ సీటును సీపీఐకు ఇచ్చారు. మిత్రధర్మాన్ని తెలంగాణ కాంగ్రెస్ బాగానే పాటించినట్టు అనుకుంటున్నారు.
అలాగే మూడుస్థానాలకు ఎంపిక విషయంలో కూడా.. తెలంగాణ కాంగ్రెస్ కసరత్తుకు ప్రశంసలే లభిస్తున్నాయి. మూడు సీట్లను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కట్టబెట్టారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, పార్టీకోసం సుదీర్ఘకాలంగా సేవలు చేసిన వారికి గౌరవం కల్పించడంఅనేదే వారి ప్రాతిపదికగా నిరూపణ అవుతోంది.
ఎందుకంటే.. ఎస్సీ వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని అప్పట్లో చెప్పారు. చివరి నిమిషంలో అది ఆయన చేజారింది. అప్పటికి.. ఎంపీ ఎన్నికల్లో వరంగల్ నుంచి అవకాశం ఇస్తామని సర్ది చెప్పారు. అదికూడా దక్కలేదు. అప్పట్లో ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని ఊరడించారు. ఇప్పుడు అవకాశం రాగానే.. వేరు ఆలోచన లేకుండా ఆయనకు న్యాయం చేశారు. ఎస్టీ వర్గానికి చెందిన శంకర్ నాయక్.. సుదీర్ఘకాలంగా పార్టీకి అంకితమైన నాయకుడు. ఆయన సేవలను గుర్తించి అవకాశం ఇచ్చారు.
బీసీ వర్గానికి చెందిన మాజీ ఎంపీ విజయశాంతి ఎన్నికల ముందే కాంగ్రెసులో చేరారు. నిజానికి ఆమె చేరిక సమయంలోనే.. తనకు ఏదో ఒక పదవి కావాలని గట్టిగా హామీ పొంది కాంగ్రెసులోకి వచ్చినట్టు సమాచారం. దానికి తగినట్టుగానే.. ఆమెకు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ.. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు.
తన ఆప్తుడు అయిన వేం నరేందర్ రెడ్డికి అవకాశం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి గానీ.. వర్కవుట్ కాలేదు. పైగా ఎమ్మెల్సీ అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక సీటు ఓసీలకు ఇచ్చే సంప్రదాయాన్ని కూడా కాంగ్రెస్ ఈసారి పక్కన పెట్టింది.
మాట నిలబెట్టుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్ ను చూసి నేర్చుకోవాలని పలువురు అంటున్నారు. చంద్రబాబునాయుడు.. తాను మాట ఇచ్చిన సీనియర్ నాయకులందరినీ పక్కకు నెట్టేసి.. ఎమ్మెల్సీల ఎంపికలో అనుసరించిన ధోరణి, ఇప్పుడు తెలంగాణతో పోల్చబడి విమర్శల పాలవుతోంది.
2019 lo anna Mangalagiri RK ki Enduku minister iyyaledhu maata ichaka?
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
emito 1 1 cheppinattu chinna chinna hamilu atu itu avutai