లోకేశ్ మాట‌కే విలువ‌.. ఆయ‌న‌కు రిటైర్మెంట్‌!

టీడీపీలో కొత్త‌, యువ ర‌క్తాన్ని నింపేందుకు య‌న‌మ‌ల‌ను ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింద‌ని సీనియ‌ర్ నేత‌లు అంటున్నారు.

కూట‌మి ప్ర‌భుత్వంలోనూ, టీడీపీలోనూ నారా లోకేశ్ మాట‌కే ఎక్కువ విలువ‌. ఈ అభిప్రాయాన్ని బ‌ల‌ప‌రిచేలా టీడీపీ నిర్ణ‌యాలున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపికలో కూడా లోకేశ్ మార్క్ క‌నిపిస్తోంది. టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడికి రాజ‌కీయ రిటైర్మెంట్ ఇవ్వ‌డం ఒక్క లోకేశ్‌కే సాధ్య‌మైంద‌ని సొంత పార్టీ నేత‌లే అంటున్నారు. ఇదే సీఎం చంద్ర‌బాబునాయుడైతే, య‌న‌మ‌ల‌ను ప‌క్క‌న పెట్ట‌డానికి సాహ‌సించే వారు కాదంటున్నారు.

య‌న‌మ‌లకు ఎమ్మెల్సీ ప‌ద‌విని రెన్యువ‌ల్ చేయ‌క‌పోవ‌డం ద్వారా… అయ్యా మీ సేవ‌లు ఇక చాలు అని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టైంద‌ని ప‌లువురు అంటున్నారు. చంద్ర‌బాబు కేబినెట్‌లో త‌న‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో … త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏంటో య‌న‌మ‌ల‌కు లోకేశ్ చూపించార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీలో కొత్త‌, యువ ర‌క్తాన్ని నింపేందుకు య‌న‌మ‌ల‌ను ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింద‌ని సీనియ‌ర్ నేత‌లు అంటున్నారు.

ఇప్ప‌టికే య‌న‌మ‌ల కుమార్తె దివ్య తుని ఎమ్మెల్యేగా, అల్లుడు పుట్టా మ‌హేశ్ ఏలూరు ఎంపీగా, వియ్యంకుడు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ వైఎస్సార్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ప్రాతినిథ్యం వ‌హించ‌డాన్ని గుర్తు చేస్తున్నారు. టీడీపీ మొత్తాన్ని య‌న‌మ‌ల కుటుంబంతో నింపితే, ఇక మిగిలిన వాళ్ల‌లో అసంతృప్తి రాదా? అని ప్ర‌శ్నిస్తున్న నాయ‌కులు లేక‌పోలేదు.

అయితే చంద్ర‌బాబుకు అత్యంత సంక్షోభ స‌మ‌యంలో తాను అండ‌గా నిలిచాన‌ని, ఎమ్మెల్సీగా మ‌రోసారి కొన‌సాగిస్తార‌ని అనుకున్న‌ట్టు స‌న్నిహితుల వ‌ద్ద య‌న‌మ‌ల అంటున్నారు. త‌న‌కు ప‌ద‌వి రాక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మంత్రి లోకేశ్ అని య‌న‌మ‌ల ఆగ్ర‌హంగా ఉన్నార‌ని తెలిసింది. కేబినెట్‌లోకి త‌న‌ను తీసుకోక‌పోవ‌డంతో ఎమ్మెల్సీని రెన్యువ‌ల్ చేయ‌ర‌ని ముందే అర్థ‌మైంద‌ని, నేడు అదే నిజ‌మైంద‌ని ఆయ‌న అంటున్నార‌ని స‌మాచారం.

19 Replies to “లోకేశ్ మాట‌కే విలువ‌.. ఆయ‌న‌కు రిటైర్మెంట్‌!”

  1. ఈ వయసు మళ్ళిన నాయకులు ఇంకా ఎంత కాలం ఉండగలరు? వీళ్ళు స్వచ్చందంగా తప్పుకొని క్రొత్త తరానికి అవకాశం ఇవ్వాలి. యువ నాయకులకి కూడా అనుభవం రావాలి కదా?

  2. వారసులకు అవకాశం ఇస్తున్న సీనియర్ నేతలు తమకు అవకాశం కావాలని పట్టు పట్టడం సబబు కాదు

  3. tappu ledu kada inka ennallu padavulu kosam pakuladutaru vunna neeru pote kada kotta neeru vachedi even chandra babu kooda tanu taggi lokesh ne munduki pamputunnaru kada ade andariki vartistundi

Comments are closed.