జనవరి- సంక్రాంతికి వస్తున్నాం, ఫిబ్రవరి- తండేల్, మార్చి..? ఇలా ఒక్కో సినిమాకు మధ్య నెల రోజులు గ్యాప్ వుంటోంది. అంటే ఆడియన్స్ నెలకు ఒక్క మిడ్ రేంజ్ లేదా చిన్న సినిమానే చూడాలని ఫిక్స్ అయ్యారా? లేక ఒక్క సినిమాకే ఓపెనింగ్ వుంటోందా? కాదూ.. ఒక్క సినిమానే నచ్చేలా తీయగలుగుతున్నారా? ఇవన్నీ ప్రశ్నలే. ఈ నేపథ్యంలో మార్చి నెల కూడా సగానికి వచ్చేసింది. ఇంకా ఈ నెల డ్యూ హిట్ పడలేదు. ఈ వారం రెండు సినిమాలు, తరువాత వారం ఒక సినిమా, ఆఖరి వారం నాలుగు సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర అదృష్టం పరీక్షించుకోబోతున్నాయి.
మరీ చిన్న సినిమా అనుకున్న వాటిని ఓటిటికి వదిలేస్తారా? యావరేజ్ అంటూ టాక్ వచ్చిన వాటిని విడిచిపెడతారా? డబ్బింగ్ నే కదా అని ఆలోచిస్తారా? ఇలా ఏ సినిమా లక్ ఏమిటి అన్నది వెయిట్ చేస్తే కానీ తెలియదు. పైగా ఈ నెల అంతా పరీక్షల సీజన్. అందువల్ల ఫ్యామిలీలు అయితే ఇంట్లోంచి కదిలి రావు. సినిమా సూపర్ అంటే తరవాత ఖాళీ అయ్యాక చూస్తారు. అంత వరకు థియేటర్లో వుంటే, అదే బ్లాక్ బస్టర్ అయితే లేట్ రన్నింగ్ కూడా వుంటుంది.
ఈవారం అయితే కిరణ్ అబ్బవరం దిల్ రుబా, నాని నిర్మాతగా కోర్ట్ సినిమాలు రెండూ విడుదల అవుతున్నాయి. కోర్ట్ అన్నది ఎమోషనల్ జర్నీ. కోర్ట్ డ్రామా. టీనేజ్ యంగ్ హీరో హీరోయిన్ల మీద కథ, ప్రియదర్శిది పెద్ద రోల్ కాదు మిగిలిన క్యారెక్టర్ల మీద రన్ అవుతుంది. అందువల్ల మహరాజా లాంటి ఎమోషనల్ సినిమాల మాదిరిగా బాగుంది అనిపిస్తే రన్ వుంటుంది లేదంటే ఎలా వుంటుందో చూడాలి.
రెండో సినిమా కిరణ్ అబ్బవరం దిల్ రుబా. ఎమోషనల్ టచ్ వున్న లవ్ స్టోరీ. అగ్రెసివ్ కుర్రాడి జర్నీ. పాటలు బావున్నాయి. జనాల్లోకి బాగానే వెళ్లాయి. ఇక బాగుండాల్సింది సినిమానే. అది కూడా నూటిని నూరు శాతం బాగుండాలి. కుర్రాళ్లు కిరీటం పెడతారు. కానీ ఆ మేరకు సినిమా వుందా అన్నది విడుదలైతే కానీ తెలియదు. హీరో కిరణ్ అబ్బవరం అయితే సినిమా మీద గట్టి నమ్మకంతో వున్నారు. ఆ నమ్మకం నిజమైతే మార్చి విన్నర్ దిల్ రుబా కావచ్చు.
All the best
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,