నిర్మాతలు సినిమా తీయకుండా ఉంటే ఆఫీస్ ఖర్చు మహా అయితే నెలకు కొన్ని లక్షలు. ఏడాదికి మహా అయితే కోటి రూపాయలు. అలా కాకుండా ఏదో ఒకటి తీసేయాలని సినిమాలు మొదలెట్టేస్తే కోట్లకు కోట్లు నష్టం. కొందరు హీరోలు ఉన్నారు. ఏళ్ల తరబడి డిజాస్టర్లు ఇస్తూ వస్తున్నారు. అలా అని ఫ్రీగా చేయరు. పార్టనర్‌షిప్ మీద చేయరు. 7 నుంచి 9 కోట్లు ఇవ్వాల్సిందే. అలా ఇచ్చి నిర్మాత శంకరగిరి మాన్యాలు పట్టేయాల్సిందే. చాలా మంది మిడ్ రేంజ్ హీరోలకు కనీసపు ఓపెనింగ్‌లు ఉండడం లేదు. థియేటర్ అమ్మకాలు జరగడం లేదు. ఓటిటి వాళ్లు పావలాకు పదికి అడుగుతున్నారు తప్ప రేటు రావడం లేదు. ఇలాంటి ‘గిట్టుబాటు లేని’ హీరోల జాబితా పెద్దదే ఉంది.
అయినా ఎవరో ఒక బకరా దొరికేస్తున్నారు. సినిమా తీసేస్తున్నారు. నష్టాల పాలవుతున్నారు. ఏళ్ల తరబడి హిట్ లేకపోయినా, ఏళ్ల తరబడి డిజాస్టర్లు ఇస్తున్నా ఇంకా ఎందుకు సినిమా ఇస్తున్నారో తెలియదు. ఎందుకు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారో తెలియదు. జనం ఈ లిస్ట్ హీరోలందరినీ ఎప్పుడో పక్కన పెట్టేశారు అని గమనించకుంటే ఎలా?
శర్వానంద్, గోపీచంద్ హిట్ కొట్టి ఎన్నాళ్లైంది? సుధీర్ బాబు హిట్ చూసి ఎంతకాలమైంది? ఇంకా చాలా మంది ఉన్నారు అసలు హిట్ చూసి, సరైన ఓపెనింగ్ చూసి. ఆ మాటకు వస్తే పెద్ద హీరోల్లో కూడా హిట్ చూసి చాలా అంటే చాలా కాలం అయిపోయిన వాళ్లు ఉన్నారు.
రవితేజకు “ధమాకా” ముందు హిట్ లేదు. “ధమాకా” తర్వాత హిట్ లేదు. పైగా చేసిన ప్రతి సినిమాకు నిర్మాతలకు కోట్లకు కోట్లు గల్లంతయ్యాయి. అయినా పాతిక కోట్లు ఇచ్చి మరీ సినిమాలు చేస్తూనే ఉన్నారు నిర్మాతలు.
శర్వానంద్ తొమ్మిది నుంచి పది కోట్లు. ఓటిటి అమ్మకాలు లేక స్వంతంగా పే ఫర్ వ్యూ కింద విడుదల చేసుకోవాల్సి వస్తోంది.
గోపీచంద్ ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్. ఈ జాబితాలో కొందరు మెగా హీరోలు కూడా ఉన్నారు.
చిన్న హీరోలు కోటి ఆ పైకి తీసుకుంటున్నారు. వారి లెవెల్లో వారు నష్టాలు ఇస్తున్నారు నిర్మాతలకు. కోట్లకు కోట్లు తీసుకుంటున్న వారు వారి లెవెల్లో నష్టాలు ఇస్తున్నారు. అయినా సినిమాలు తీస్తూనే ఉన్నారు. తీస్తూనే ఉంటారు. అదే మ్యాజిక్.
Eee…chuddam
Mari naaku?
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
అన్ని ఫ్లాప్స్ పడుతున్నా బ్యానర్, డైరెక్టర్, రికమండేషన్స్ వీటి ఆధారంగానే సినిమాలు చేస్తారు. ఈ హీరోలు. స్టోరీస్ సెలక్షన్ రాదు ఏం రాదు… రెమునరేషన్ వస్తే చాలు చేస్తుంటారు. వీళ్ళకు ఎవరైనా అప్ కమింగ్ వాళ్ళు స్టోరీస్ చెప్పాలంటే అంత ఈజీ కాదంట… స్టోరీస్ కంటే డైరెక్టర్ ప్రొఫైల్ ముఖ్యం అంటారు
Orey lanjakodakaaa mega heroes perulu kuda cheppu ra kojjaaaaaa. Yeppudu chusina raviteja meedha padi yedusthaaru entra me greatandhra vallu. Raviteja ki nuvvu yemnanna dabbu isthunnava raaa yerrihook lanjakodakaaa
Recommendation మీద సినిమాలు తీయర్ బిజినెస్ recomendation మీద నడవదు