కిలో చికెన్‌కు రూ.10 వ‌సూలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే!

ఎన్నిక‌ల్లో తాము పెట్టిన పెట్టుబ‌డి తిరిగి రాబ‌ట్టుకోవాలి క‌దా? అనే ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌శ్నిస్తున్నారు.

దోపిడీ కూడా స్థాయిని బ‌ట్టి ఉండాల‌ని కోరుకునే రాజ‌కీయ నాయ‌కులున్నారు. దోపిడీ అనేది క్షేత్ర‌స్థాయిని బ‌ట్టి, గ్రామ నాయ‌కుల మొద‌లుకుని వుంటోంది. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని స‌త్యం. అనుచ‌రులు ఆర్థికంగా బాగుప‌డ‌డానికి దోపిడీ వ్య‌వ‌హారంపై కొంద‌రు ఎమ్మెల్యేలు, మంత్రులు చూసీచూడ‌న‌ట్టు వుంటారు. కూట‌మి ఎమ్మెల్యేలు, మంత్రుల అరాచకాల‌పై అప్పుడ‌ప్పుడు ప్ర‌భుత్వ అనుకూల మీడియా క‌థ‌నాలు రాస్తోంది.

తాజాగా రామాయ‌ప‌ట్నం పోర్టు నిర్మాణ ప‌నుల్లో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వ‌ర‌రావు దోపిడీకి తెర‌లేపార‌ని నేరుగానే రాశారు. అయితే రాత‌కు నోచుకోని నాగేశ్వ‌ర‌రావు లాంటి నాయ‌కుల అరాచకాలెన్నో అని కూట‌మి శ్రేణులు వాపోతున్నాయి.నంద్యాల జిల్లాలోని ఓ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి చికెన్ సెంట‌ర్ నుంచి కిలోపై రూ.10 వ‌సూలు చేస్తున్నారు. ఈ దోపిడీ రూపంలో వ‌చ్చే ఆదాయాన్ని కూడా ఎందుకు వ‌దులుకోవాల‌నే భావ‌న మ‌రి! బ‌హుశా ఇంత చిల్ల‌ర దోపిడీ గ‌తంలో ఏ ఎమ్మెల్యే కూడా చేసి వుండ‌ర‌నే మాట వినిపిస్తోంది.

చికెన్‌పైనే వ‌సూలు చేస్తున్నారంటే, ఇక అవ‌కాశం వ‌స్తే భారీ మొత్తంలో వ‌సూలు చేయ‌డానికి వెనుకాడ‌ర‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. చికెన్ నుంచి వ‌సూలు చేస్తున్న స‌ద‌రు ప్ర‌జాప్ర‌తినిధి నియోజ‌క‌వ‌ర్గంలో ఇటీవ‌ల ఉత్సాహాలు జ‌రిగాయి. ఆ సంద‌ర్భంగా ప్ర‌తి దుకాణ‌దారు నుంచి వెయ్యి రూపాయిలు చొప్పున వ‌సూలు చేశారు. ఇదంతా చాటుమాటుగా సాగిన‌, సాగుతున్న వ్య‌వ‌హారాలు కానేకావు.

ఔను, ఎన్నిక‌ల్లో తాము పెట్టిన పెట్టుబ‌డి తిరిగి రాబ‌ట్టుకోవాలి క‌దా? అనే ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌శ్నిస్తున్నారు. పాల‌న బాగుంటే తిరిగి అధికారంలోకి వ‌స్తామ‌ని, త‌మక్కొరి వ‌ల్లే అధికారం పోద‌ని ఎవ‌రికి వాళ్లు దోపిడీని స‌మ‌ర్థించుకుంటున్నారు. అలాంట‌ప్పుడు రామాయ‌ప‌ట్నం లాంటి చోట ఆదాయాన్ని ఎమ్మెల్యే ఎలా వ‌దులుకుంటారు? ఏ నియోజ‌క‌వ‌ర్గం చూసినా , కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల దోపిడీ స‌ర్వ‌సాధార‌ణ‌మైంది. అయితే అది రూపం మార్చుకుంది. అంతే తేడా.

5 Replies to “కిలో చికెన్‌కు రూ.10 వ‌సూలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే!”

  1. జగన్ ఐదేళ్ళలో గొర్రెలని బాగా మేపి బలిసేటట్లు చేసినాడు.

    మంచినీళ్ల మీద టాక్స్ వేసి ఈ నాలుగేళ్లలో వీలయినంత పిండుతాము ప్రజా గొఱ్ఱల నుండి.

    చివర్లో ఇంత గడ్డి వేసి మచ్చిక చేసుకుంటాము.

    మేతకి వంగే గొర్రెలే మాకు అధికారానికి రక్ష!!

Comments are closed.