కాంగ్రెస్ ను దెబ్బేసి, బీజేపీని తిడుతున్నారు!

మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును నిలువునా చీల్చిన ఘనుడిగా అసదుద్దీన్ ఒవైసీ పేరు మార్మోగుతూ ఉంది. దాదాపు నలభై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమిని మూటగట్టుకున్నఓట్ల తేడాకు సమానంగా ఎంఐఎం ఓట్లను పొందిందని  విశ్లేషకులు…

మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును నిలువునా చీల్చిన ఘనుడిగా అసదుద్దీన్ ఒవైసీ పేరు మార్మోగుతూ ఉంది. దాదాపు నలభై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమిని మూటగట్టుకున్నఓట్ల తేడాకు సమానంగా ఎంఐఎం ఓట్లను పొందిందని  విశ్లేషకులు తేల్చారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీని తిడుతూ ఉన్నారు ఒవైసీ. బీజేపీని తిడుతూ ఉన్నారు.

అయితే  బీజేపీకి మాత్రం ఒవైసీ అలాంటిలాంటి మేళ్లు చేయడం లేదని పరిశీలకులు అంచనా వేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి అవసరమైనచోటల్లా కాంగ్రెస్ ను దెబ్బేయడమే ఒవైసీ పని అని కూడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

అదే సమయంలో బీజేపీ పాలన వచ్చి ఐదారేళ్లు అవుతున్నా.. ఇప్పటి వరకూ ఒవైసీని కమలం పార్టీ వాళ్లు ఏ మాత్రం ఇబ్బంది పెట్టని వైనాన్ని కూడా విశ్లేషకులు ప్రస్తావిస్తూ ఉన్నారు.భారతీయ జనతా పార్టీ తన వైరి పక్షంలోని అనేక మందిపై కేసులు పెట్టింది. కాంగ్రెస్ వాళ్లను అయితే ముప్పు  తిప్పలు పెడుతూ ఉంది. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్లను తీహార్ కు పంపించింది. అయితే ఒవైసీ లపై చిన్నపాటి కేసులు కూడా లేవు. 

కాంగ్రెస్ హయాంలోనే అక్బరుద్దీన్   ఒవైసీని జైలు పంపించారు. విద్వేష ప్రసంగాల నేపథ్యం ఉంది ఈ అన్నదమ్ములకు. అయితే వీరిని బీజేపీ వాళ్లు ఎలాంటి ఇబ్బందీ పెట్టడం లేదు!ఇదంతా వ్యూహం అని, ఒవైసీని బీజేపీ బాగా చూసుకుంటోందని, అందుకే తన గుర్రం పారే చోట ఒవైసీ తన పార్టీని నిలబెట్టి, కాంగ్రెస్ ఓటు బ్యాంకును చెల్లాచెదురు చేస్తూ బీజేపీని కాపాడుతూ ఉంటారని పరిశీలకులు ఒక అభిప్రాయానికి వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ విమర్శించడంలో కూడా ఒవైసీది ఇదే స్ట్రాటజీ అని, కేసీఆర్ మేలు కోసం కాంగ్రెస్ ను విమర్శిస్తూ ఉంటారనే అభిప్రాయాలున్నాయి.

ఎన్నికలు  వచ్చినప్పుడు అలా కాంగ్రెస్ ను తిడుతూ, ఎన్నికలు లేనప్పుడు బీజేపీని తిట్టడం ఒవైసీ వ్యూహమని విశ్లేషకులు అంటూ ఉన్నారు. ఈ క్రమంలో మరోసారి ఒవైసీ బీజేపీపై విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ బీజేపీ-సేనలపై ఆయన దుమ్మెత్తి పోశారు. అయినా వారి విజయంలో 'కీలక' పాత్ర పోషించి ఇప్పుడు వాళ్లను విమర్శించడం ఒవైసీకే చెల్లిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.