ఏమిటీ మౌనం బాలయ్యా.. నీ సంగతేంటయ్యా..?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరికొచ్చేశాయి. ముందు నానా హంగామా చేసినా, వైసీపీ ధాటిని తట్టుకోలేక చివరకు పలాయనవాదం చిత్తగించారు టీడీపీ సభ్యులు. ఇక చివరి రెండురోజుల సమావేశాలకు చంద్రబాబు కూడా అందుబాటులో లేకుండాపోయారు. ఇక…

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరికొచ్చేశాయి. ముందు నానా హంగామా చేసినా, వైసీపీ ధాటిని తట్టుకోలేక చివరకు పలాయనవాదం చిత్తగించారు టీడీపీ సభ్యులు. ఇక చివరి రెండురోజుల సమావేశాలకు చంద్రబాబు కూడా అందుబాటులో లేకుండాపోయారు. ఇక పార్టీలో లేస్తున్న మూడు గొంతులపై సస్పెన్షన్ వేటుపడే సరికి పయ్యావుల ఒక్కడే ఇప్పుడా పార్టీకి పెద్దదిక్కులా మారి మాట్లాడుతున్నారు.

విచిత్రం ఏంటంటే.. సభకు రెగ్యులర్ గా వస్తున్న బాలయ్య మాత్రం నోరు మెదపకపోవడం. అసలు బాలయ్య వ్యూహం ఏంటి? అల్లుడు లోకేష్ తడబడుతూనే శాసనమండలిలో ఎలాగోలా మాట్లాడడం చూశాం. మరి బాలా మావయ్య ఎందుకు నోరు మెదపడంలేదు. కనీసం అమరావతి రియల్ ఎస్టేట్ విషయంలో తనపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా బాలయ్య ఎందుకు మౌనవ్రతం వీడలేదో అర్థంకావడం లేదు. సమావేశాల చివరిరోజైనా హిందూపురం ఎమ్మెల్యే నోరు విప్పుతారేమో చూడాలి.

చంద్రబాబు లేకపోతే టీడీపీ పరిస్థితి ఏంటో ఇప్పుడిప్పుడే స్పష్టమవుతోంది. కనీసం అసెంబ్లీలో మాట్లాడేవారే కరువయ్యారు. నోరు చేసుకునే నేతలంతా ఓటమిపాలవడంతో దిక్కులేని పార్టీలా తయారైంది టీడీపీ. చంద్రబాబు లేనప్పుడు పార్టీని ఎవరో ఒకరు భుజానికెత్తుకోవాలి. అలాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా బాలకృష్ణ ముందుకు రాకపోవడం నిజంగా శోచనీయమే.

ఎన్టీఆర్ వారసుడిగా తండ్రి స్థాపించిన పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం బాలయ్యకు ఎంతైనా ఉంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి నవ్వులపాలైన బాలకృష్ణ, ఆ భయంతోనే ఏపీ అసెంబ్లీలో మాట్లాడ్డానికి వెనకాడుతున్నట్టుంది. కనీసం చివరిరోజైనా తన ప్రతాపం చూపిస్తారా లేక మౌన వ్రతాన్నే పాటిస్తారా చూడాలి. 

క్యాడర్ ను పట్టించుకోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు!