
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తన అరెస్ట్ తప్పదని కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి ముందే తెలుసా? అంటే ఔననే సమాధానం వస్తోంది. కడప ఎంపీగా తన లోక్‌సభ పరిధిలోని ప్రజానీకం అవసరాల రీత్యా అవినాష్‌రెడ్డి సిఫార్సు లేఖలు ఇస్తుంటారు. ఒకవేళ తాను అరెస్ట్ అయితే సిఫార్సు లేఖల కోసం ఇబ్బంది పడకుండా అవినాష్‌రెడ్డి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం.
కర్నూలులోని విశ్వ భారతి ఆస్పత్రిలో తన తల్లి శ్రీలక్ష్మికి అవినాష్‌రెడ్డి దగ్గరుండి ట్రీట్‌మెంట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్పత్రికి తన లెటర్ ప్యాడ్‌లను తెప్పించుకుని సంతకాలు చేసి ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అవినాస్‌రెడ్డి సంతకాలు చేసిన లెటర్ ప్యాడ్లను వైఎస్ కుటుంబానికి చెందిన ముఖ్య నాయకుడి వద్ద పెట్టినట్టు తెలిసింది. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరింది.
దర్యాప్తు ముగింపునకు సీబీఐకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. జూన్ నెలాఖరు లోపు విచారణ పూర్తి చేయాల్సి వుంది. ఈ నేపథ్యంలో అవినాష్‌రెడ్డి మినహాయిస్తే, కీలక నిందితులందరినీ సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఆరు సార్లు అవినాష్‌ను సీబీఐ విచారించింది. మరోసారి విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది.
అయితే వివిధ కారణాల రీత్యా అవినాష్ సీబీఐ విచారణకు వెళ్లడం లేదు. దీంతో సీబీఐ ఆయన్ను అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఏది ఏమైనా ఎలాంటి పరిణామాలొచ్చినా, తన వల్ల జనానికి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో లెటర్ ప్యాడ్లపై సంతకాలు చేయడం చర్చకు దారి తీసింది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా