జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కృష్ణానదిపై ఒక బ్రడ్జి నిర్మించాల్సి ఉంది. సహజంగానే.. మొత్తం జాతీయ రహదారిని నిర్మించే ఎన్హెచ్ఏఐ వారే ఈ బ్రిడ్జిని కూడా నిర్మిస్తారు. వారి పని వారిని చేసుకోనివ్వకుండా మధ్యలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం అడ్డంపడింది. దీనికి మేం అందాలు దిద్దేస్తాం.. అత్యద్భుత సుందరమైన బ్రిడ్జిగా రూపొందించేస్తాం.. అంటూ ముందుకొచ్చారు. బోలెడంత డబ్బు తగలేసి.. తమకు సంబంధం లేని ఆ బ్రిడ్జి నిర్మాణానికి కూడా చంద్రబాబు ప్రభుత్వమే ఆబ్ స్ట్రాక్ట్ పెయింటింగ్ లా ఉండే ఆ వంతెన డిజైన్లకు చంద్రబాబు, ఆయన వందిమాగధులూ రకరకాల భాష్యాలు చెప్పారు. బీభత్సంగా కీర్తించారు. ఇలాంటి డిజైన్లు నభూతో నభవిష్యతి అన్నారు. వాటిని ఎన్హెచ్ఏఐ ఎదుట పెట్టారు.
డిజైన్లకు వారు చెప్పిన అభ్యంతరాలు ఏమీ లేవుగానీ… ఖర్చు దగ్గరే తేడాకొట్టింది. మామూలుగా ఆరులైన్లతో నిర్మించదలచుకున్న ఈ వంతెనకు 400 కోట్ల రూపాయలతో ఎన్హెచ్ఏఐ అంచనాలు తయారుచేసింది. నిర్మాణం ఇక జరుగుతుందనగా సర్కారు ఈ సరికొత్త డిజైన్లను ‘ఎగస్ట్రా’గా జోడించింది. దాంతో కొత్త అంచనాలు తయారు చేశారు. ఆ డిజైన్ల ప్రకారం చేయాలంటే మొత్తం 800 కోట్లు అవుతుందని లెక్కతేల్చారు. అంటే.. సరిగ్గా వంతెన నిర్మాణానికి అయ్యే ఖర్చు కంటే దాని సోకుల కోసం రెట్టింపు అన్నమాట.
అంత డబ్బు అదనంగా పెట్టడం తమవల్ల కాదంటూ ఎన్హెచ్ఏఐ చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ వాటా ఖర్చు భరించేట్లయితే పనులు ప్రారంభిస్తాం అంటూ తేల్చిచెప్పింది. మాకు అందాలు కూడా చాలా ముఖ్యం అంటూ.. డిజైన్లకోసమే బోలెడంత తగలేసిన బాబు సర్కారు.. బ్రిడ్జిని ఇలా నిర్మించేస్తున్నాం అంటూ.. డిజైన్లు పూర్తయిన వెంటనే బీభత్సంగా ప్రచారం చేసుకుని.. ప్రజల ఎదుట మార్కులు కొట్టేయాలని చూసిందే తప్ప.. కేంద్రం పెట్టిన కండిషన్ ను ఆమోదించి.. అందుకు అవసరమైన డబ్బు సమకూర్చే ప్రయత్నం చేయలేదు. దాంతో ఎన్హెచ్ఏఐ కూడా నిర్మాణం మొదలెట్టకుండా ఆగింది.
రాష్ట్రంలో ప్రభుత్వం మారి, జగన్ సీఎం కాగానే.. కేవలం అందం కోసం 400 కోట్ల రూపాయల అదనపు ఖర్చు పెట్టడానికి ఒప్పుకోలేదు. రాష్ట్ర సర్కారు మా వల్ల కాదని తేల్చేసింది. ఇప్పుడిక ఇదివరలో ప్లాన్ చేసుకున్నట్లుగానే … మామూలుగా ఉండేలా.. బ్రిడ్జి నిర్మించడానికి ఎన్హెచ్ఏఐ సిద్ధమవుతోంది. అందమూ… డిజైన్లూ అంటూ.. బాబు చేసిన ఎగస్ట్రాలకు ఎన్హెచ్ఏఐ కోత పెట్టింది. జగన్ మీద బురద చల్లడానికి.. తము కన్న కలల్ని తొక్కేస్తున్నాడని అనడానికి పచ్చదళాలు దీనిని కూడా వాడుకుంటాయో ఏంటోనని ప్రజలు అనుకుంటున్నారు.