Advertisement

Advertisement


Home > Politics - Gossip

బాబు, ప‌వ‌న్‌ల‌కు మ‌న‌సు రాదా? లేదా?

బాబు, ప‌వ‌న్‌ల‌కు మ‌న‌సు రాదా? లేదా?

విశాఖలో గురువారం తెల్ల‌వారుజామున ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌వించ‌గా, వంద‌ల సంఖ్య‌లో క్ష‌త‌గాత్రుల‌య్యారు.  బాధిత కుటుంబాల‌ను ఆదుకునేందుకు మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.25 ల‌క్ష‌లు చొప్పున న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌తో పాటు వామ‌ప‌క్షాల నాయ‌కులు డిమాండ్ చేశారు. క‌నీసం తాము అంత పెద్ద మొత్తంలో అడిగితే అందులో స‌గమైనా ప్ర‌భుత్వాలు చెల్లిస్తాయ‌ని, బాధిత కుటుంబాల‌కు న్యాయం జ‌రుగుతుంద‌నే ప్ర‌తిప‌క్ష నేత‌లు భావిస్తుంటారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న కార్యాల‌యం నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు విశాఖ దుర్ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు సేక‌రిస్తూ, స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై అధికారుల‌కు దిశానిర్దేశిస్తూ వ‌చ్చారు. మధ్యాహ్నం విశాఖకు చేరుకున్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించి తానున్నాన‌ని, భ‌య‌ప‌డొద్ద‌ని ధైర్యం చెప్పారు. ఆంధ్రా వైద్య కళాశాలలో అధికారులు, మంత్రులతో సమీక్షించారు. అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

చ‌నిపోయిన మనుషులను వెనక్కి తీసుకురాలేకపోయినా, ఒక మంచి మనసున్న వ్యక్తిగా కచ్చితంగా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నానన్నారు.  మృతుల కుటుంబాలకు రూ.కోటి, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, స్వల్ప అస్వస్థతతో రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది వెళ్లే వారికి రూ.లక్ష, ఆస్పత్రిలో చేరగానే కోలుకుని డిశ్చార్జ్‌ అయిన వారికి రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. అలాగే  గ్యాస్‌ లీక్‌ ప్రభావిత గ్రామాల్లోని మొత్తం 15,000 మందికీ రూ.10 వేల చొప్పున న‌ష్ట ప‌రిహారాన్ని సీఎం ప్ర‌క‌టించారు.

నిజానికి ఇలాంటి సాయాన్ని గ‌తంలో ఏ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన దాఖ‌లాలు లేవు. అడ‌గ‌కుండా ఉంటే అమ్మ అయినా అన్నం పెట్ట‌ద‌ని పెద్ద‌లు చెబుతారు. అలాంటిది త‌న‌కు తానుగా పెద్ద మ‌న‌సుతో బాధిత కుటుంబాల‌ను ఆదుకున్న వైఎస్ జ‌గ‌న్‌పై అన్ని వ‌ర్గాలు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాయి. ప్ర‌తిప‌క్ష పార్టీల్లో కూడా టీటీడీ, జ‌న‌సేన నాయ‌కులు త‌ప్ప మిగిలిన నేత‌లంద‌రూ జ‌గ‌న్‌ను అభినందించ‌డంతో పాటు కృత‌జ్ఞ‌త‌లు కూడా చెప్పి త‌మ సంస్కారాన్ని చాటుకున్నారు. వివిధ ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కుల స్పంద‌న ఏంటో ఒక‌సారి ప‌రిశీలిద్దాం.

"రాష్ట్రంలో, దేశంలో ఎన్నో భారీ విపత్తులు చూశాం. కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రీ, ఏ ప్రధానమంత్రీ చేయని విధంగా బాధితులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిహారం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం.  రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‌ యంత్రాంగం స్పందించిన తీరు, తీసుకున్న చర్యలు అద్భుతం" అని  బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ కూడా జ‌గ‌న్ స‌ర్కార్‌ను ప్ర‌శంసిస్తూ ప్ర‌క‌ట‌న‌తో పాటు ఆయ‌న వీడియో విడుద‌ల చేశారు.

"మేం ఊహించిన దానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ సాయాన్ని ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనీయులు. బాధితు లను, బాధిత గ్రామాల ప్రజలకు కూడా ఆర్థిక సాయాన్ని ప్రకటించి ఆదుకున్న తీరు ప్రశంసనీయం " అని సీపీఐ జాతీయ‌ నారాయణ అన్నారు. అలాగే సీపీఐ, సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు రామ‌కృష్ణ‌, మ‌ధు స్పందిస్తూ బాధితులకు నష్టపరిహారాన్ని ప్రకటించి సీఎం వైఎస్‌ జగన్‌ వారిని ఆదుకున్న తీరు హర్షణీయమ‌న్నారు. ఆ పరిశ్రమను అక్కడి నుంచి తరలించడంతో పాటు.. ఈ దుర్ఘటనపై న్యాయవిచారణ జరిపించాల‌ని డిమాండ్ చేశారు.

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌కు మాత్రం జ‌గ‌న్ సాయంపై స్పందించేందుకు మ‌న‌సు రాలేదు. వాళ్లిద్ద‌రికీ స్పందించేందుకు మ‌న‌సు ఉందా?  లేదా? అనే అనుమానాల‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

ఎందుకంటే ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే హైద‌రాబాద్ నుంచి బాబు స్పందిస్తూ...

బాధితుల‌ను త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని, అత్యున్న‌త వైద్య స‌హాయం అందించాల‌ని, స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేయాల‌ని డిమాండ్ చేశారు. అంత‌టితో ఆయ‌న ఆగ‌లేదు. కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు  రాసిన లేఖ‌లో విశాఖ‌లో జ‌రిగిన స్టైరీస్ గ్యాస్ లీకేజీ ఉదంతం త‌న‌ను క‌ల‌చి వేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌రి బాధితుల‌ను ఆదుకోవ‌డంలో ఎంతో గొప్ప మ‌న‌సుతో స్పందించిన జ‌గ‌న్‌ను అభినందించ‌డానికి ఆ మ‌న‌సు ఏమైంది చంద్ర‌బాబు? హైద‌రాబాద్‌లో కూర్చొని లేఖ‌లు రాస్తూ, వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ...ఏదో చేస్తున్న‌ట్టు బిల్డ‌ప్ త‌ప్ప‌...చేత‌ల్లో ప్రేమ ఎక్క‌డ‌?  నిజంగా ప్ర‌జ‌ల‌పై ప్రేమే ఉంటే  జ‌గ‌న్ స‌ర్కార్ అందించిన సాయంపై స్పందించ‌కుండా ఉంటారా?

ఇక జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యానికి వ‌స్తే...జ‌గ‌న్‌పై ఎంత అక్క‌సుతో ఉన్నాడో ఈ విప‌త్క‌ర ప‌రిస్థితి మ‌రోసారి చాటి చెబుతోంది.  విశాఖ‌కు చెందిన జ‌న‌సేన నాయకుల‌తో ఆయ‌న టెలికాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ ఎల్‌జీ పాలిమ‌ర్స్ ఘ‌ట‌న‌తో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లో ఉన్నార‌ని, వారంద‌రికీ ధైర్యం చెప్పాల‌ని కోరారు. అన్ని విధాలా సాయ‌ప‌డాల‌ని జ‌న‌సేన నాయ‌కుల‌కు ప‌వ‌న్ దిశానిర్దేశం చేశారు.

మ‌రి త‌న బాధ్య‌త‌గా జ‌గ‌న్ ఎంతో స‌హృద‌య‌త‌తో విశాఖ బాధితుల‌కు పెద్ద మొత్తంలో సాయం ప్ర‌క‌టించారు. అయిన దానికి కానిదానికి జ‌గ‌న్‌ను విమ‌ర్శించే ప‌వ‌న్‌కు జ‌గ‌న్ అందించిన సాయంపై అభినంద‌న‌లు చెప్పేందుకు ఎందుకు మ‌న‌సు రాలేదు. బాబు బాట‌లోనే ప‌వ‌న్ ప్ర‌యాణిస్తున్నాడ‌నేందుకు తాజా ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. 

మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?