జ‌గ‌న్‌తో బాలినేనికి ఆర్థిక విభేదాలు!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి బంధం తెంచుకోడానికి ప్ర‌ధాన కార‌ణం..

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి బంధం తెంచుకోడానికి ప్ర‌ధాన కార‌ణం … వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఆర్థిక విభేదాలే కార‌ణ‌మ‌ని స‌మాచారం.

విద్యుత్‌శాఖ మంత్రిగా బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి ఉన్న‌ప్పుడు ఒక కంపెనీ నుంచి బాలినేనికి కొంత సొమ్ము ఇచ్చేలా ఒప్పందం కుదిరిన‌ట్టు తెలిసింది. అయితే ఒప్పందం ప్ర‌కారం మొత్తం డ‌బ్బు ఇవ్వ‌క‌పోవ‌డం, కొంత పెండింగ్‌లో ఉండ‌డం, త‌న‌కు ఇవ్వాల్సిన సొమ్ము కోసం బాలినేని అడుగుతుండ‌డం… గ‌త రెండేళ్లుగా సాగుతోంద‌ని తెలిసింది.

చివ‌రికి ప్ర‌భుత్వం ప‌డిపోవ‌డంతో బాలినేనికి టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఆ సొమ్మును ఇప్పించాల‌ని జ‌గ‌న్‌పై బాలినేని ఒత్తిడి తెస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌భుత్వం లేద‌ని, కొంత ఓపిక వ‌హించాల‌ని జ‌గ‌న్ చెబుతూ వ‌స్తున్నార‌ని స‌మాచారం. పైగా స‌ద‌రు కంపెనీ ప‌నుల్ని కూట‌మి ప్ర‌భుత్వం నిలిపేసింద‌ని బాలినేని దృష్టికి జ‌గ‌న్ తీసుకెళ్లార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెప్పాయి.

ఈ నేప‌థ్యంలో త‌న‌కు ఆర్థిక ఇబ్బందులున్నాయ‌ని, ఏదో ఒక‌టి చేయాల‌ని, లేదంటే పార్టీని వీడుతాన‌ని బాలినేని బ్లాక్ మెయిల్‌కు పాల్ప‌డ్డార‌ని పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డని వైసీపీ నేత‌లు తెలిపారు. ఇక వైసీపీలో వుండ‌లేనని జ‌గ‌న్‌కు బాలినేని చెప్పినా, ఆయ‌న మాత్రం లైట్ తీసుకున్నారు. దీంతో వైసీపీకి త‌న అవ‌స‌రం లేద‌ని జ‌గ‌న్ అనుకుంటున్నార‌ని అల‌క‌బూనిన బాలినేని చివ‌రికి పార్టీతోనూ, బంధువైన జ‌గ‌న్‌తోనూ బంధాన్ని తెంచ్చుకున్నారు.

ఇవాళ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో భేటీ అవుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఆయ‌న ప్ర‌స్థానం జ‌న‌సేన‌తో. ప‌వ‌న్‌తో ఎంత కాలం న‌డుస్తారో చూడాలి. బాలినేని స్వ‌భావం రీత్యా జ‌న‌సేన‌లో ఎక్కువ కాలం కొన‌సాగే అవ‌కాశం వుండ‌ద‌నే మాట వినిపిస్తోంది.

51 Replies to “జ‌గ‌న్‌తో బాలినేనికి ఆర్థిక విభేదాలు!”

  1. ఒక్కరోజులో ఎంత investigative జర్నలిజం . అందుకే నిలకడ లేదు GA లో ఎవరికి అనేది.

  2. ఒక్కరోజులో ఎంత ఇన్వెస్తిగతివె జర్నలిజం . అందుకే నిలకడ లేదు GA లో ఎవరికి అనేది.

  3. ఇది కూడా janasena కే నష్టం అంటావ్….😂😂….మన అన్నయ్య పార్టీ ముసేసే దాక ఇలాగే మోసం చెయ్ GA….😂😂

  4. ఎక్కడ చూసినా అవినీతి డబ్బు తోనే లింక్ లు ఉంటాయి ఏంటి GA
    మన పార్టీ కి.
    జత్వాని కేసు గురించి ఎమీ రాయటం లేదు.
  5. 2022 నుండి హే జగన్ కి బాలేని చెడి హే, బలేని నీ మాత్రం పదవి దొబిడు జగన్ ycp పార్టీ అంటే అవినీతి అనాయం చేసే రాజకీయ పార్టీ దానిలో నీకు భాగమే గ్రెట్ ఆంద్ర నోవు చెప్పే సోది ఎవర్ నమరు

  6. రోడ్ మీదకు వస్తే scst కేసు నిరసన తెలిపితే scst కేసు ప్రతిపక్ష నాయుడుకే దిక్కులేదు ఇక సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా చేసిన ప్రభుత్వ పెద్దలను వదిలేస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే ఎట్టి పరిస్థితిలోను వైసీపీ ని రానివ్వకూడదనే ఓటర్లు ఎక్కడెక్కడ నుంచో వ్యయ ప్రయాసల కోర్చి ఓట్లు వేసి వెళ్లారు వాళ్ళు నయాపైసా ఆశించకుండా వచ్చి పనికిమాలిన ప్రభుత్వాన్ని ఉంచితే కస్టపడి పనిచేసుకొని డిగ్నిఫైఎడ్ గ బతుకు దామనుకొన్న వాడిని బతకనివ్వరని ఓట్లు వేశారు ఇప్పుడు ఈ దోపిడీ దారులు ను వదిలేస్తే ఓట్లు వేసిన వారిని అవమాన పరచినట్టే వైసీపీ ఇక రూలింగ్ కి రాదు కారణం దానికి నుఎట్రాల్ వోటింగ్ లేదు వీళ్ళను తోలు తియ్యవలసిందే అధికారం ఉంటే ఏమైనా చేయ్యొచ్చాను కొనే వారికీ కచ్చితం గ గుణపాఠం చెప్పాలి

  7. ఇన్ని రోజులూ ఆర్థిక విబేధాలు ఉన్నాయని తెలియదా లేక తెలిసీ దాచేశారా?

    కూరిమి గల దినములలో

    నేరములెన్నడును గలుగ నేరవు మరి యా

    కూరిమి విరసంబైనను

    నేరములే తోచుచుండు నిక్కము సుమతీ..!

  8. అంతేగా. మరి అన్నియ్య తో ఆర్ధిక కంపు కాక ఇంకేమి ఉంటాయి? మింగటమే తప్ప కక్కడం తెలీదు కదా.

  9. ఇంత కీ , ప్యాలస్ నుండి గ్రేట్ ఆంధ్ర కి రావాల్సి న బకాయి లు వచేసినట్లు వున్నాయి. జగన్ మీద నీలుగుడు తగ్గించాడు వెనకటి రెడ్డి.

  10. ఆర్థిక నేరగాళ్లతో ఆర్థిక విభేదాలు కాక గట్టు పంచాయితీలు ఉంటాయా ఎంకటి బామ్మర్ది..?

    జగన్ తప్పేమి లేదన్నట్టు రాసే ఎన్వీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆర్టికల్స్ పాడుకాను..

  11. క్యాసినో పిచ్చితో శ్రీలంకలో రూ.350కోట్లు దొబ్బబెట్టు

    కున్నాడట?! ఇక రేసుల పిచ్చితో బెంగుళూరులో కూడా క్షవరం అయ్యిందట?!మరి రికవర్ అవ్వాలంటే పవర్ లో ఉండాలిగా ?!అందుకే ఈ జంపింగట

  12. But Great Andhra did not reveal whether 420 got his share of bribe. May be 420 might have eaten Balireddy share also. So great Andhra atlast disclosed lot of corruption in earlier government and it was done under the guidance of ex CM

Comments are closed.