Advertisement

Advertisement


Home > Politics - Gossip

భీమిలి నుంచి బొత్స?

భీమిలి నుంచి బొత్స?

మంత్రి బొత్స సత్యనారాయణ వైకాపాలో కీలక నేత. ఆయనది విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం. కానీ ఇప్పుడు వైకాపాలో అంతా బదిలీల పర్వం నడుస్తోంది. ఇదో కొత్త తరహా రాజకీయ ఎత్తుగడ. దీని ఆవిష్కర్త వైఎస్ జగన్. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగానే బొత్స సత్యనారాయణ ను చీపురుపల్లి నుంచి భీమిలి నియోజకవర్గానికి బదిలీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవెంత వరకు నిజమో కానీ, అదే జరిగితే బొత్సకు మేలు అనే చెప్పాలి. చీపురుపల్లిలో తెలుగుదేశం తరపున కిమిడి నాగార్జున పోటీలో వుండబోతున్నారు. గత కొన్నేళ్లుగా గ్రౌండ్ వర్క్ బాగా చేసుకుంటున్నారు. యువకుడు కావడంతో అందరితో కలిసిపోయి, ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో నియోజకవర్గం మారడం అన్నది బొత్సకు కాస్త కలిసి వచ్చే విషయమే.

పైగా భీమిలి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ జనాభా ఎక్కువ. గతంలో గంటా, అవంతి ఇక్కడి నుంచే గెలిచారు. అయితే రాజులు లేదా కాపులు ఇక్కడి నుంచి పోటీలో వుంటూ వస్తున్నారు. అదీ కాక ఈ నియోజకవర్గం విశాఖ ఎంపీ స్థానం కిందకు వస్తుందని తెలుస్తోంది. అక్కడ బొత్స భార్యనే పోటీ చేస్తున్నారు.

బహుశ ఇవన్నీ కలిసి బొత్స ను భీమిలి వైపు నడిపిస్తున్నాయేమో? ఇక్కడ జనసేన పోటీ చేస్తుందని కాదు తేదేపా అని టాక్ వుంది. గంటా శ్రీనివాసరావు కూడా ఈ నియోజకవర్గం మీదే కన్నేసారని, మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద భీమిలి సీటు ఆసక్తిగా తయారవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?