Advertisement

Advertisement


Home > Politics - Gossip

భూమా అఖిల‌ప్రియ చేజారిన‌..2,000 కోట్ల ఆస్తులు!

భూమా అఖిల‌ప్రియ చేజారిన‌..2,000 కోట్ల ఆస్తులు!

ఈ మ‌ధ్య‌నే తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపిన హ‌ఫీజ్ పేట కిడ్నాపింగ్ వ్య‌వ‌హారం లో ఆస‌క్తిదాయ‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హ‌ఫీజ్ పేట‌లోని 50 ఎక‌రాల భూములకు సంబంధించిన వివాదంలో హైద‌రాబాద్ కు చెందిన ప్ర‌వీణ్ రావు సోద‌రుల‌ను తెలుగుదేశం నేత అఖిల‌ప్రియ అనుచ‌రులు కిడ్నాప్ చేశారు. ఈ వ్య‌వ‌హారంలో వారి చేత సంత‌కాలు చేయించుకునే ప్ర‌య‌త్నం జ‌రిగిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. 

చివ‌ర‌కు ఆ కిడ్నాప్ డ్రామా ఫెయిల‌యిన‌ట్టుగా ఉంది. ఈ వ్య‌వ‌హారంలో అఖిల‌ప్రియ అరెస్టు అయ్యారు. ఆమె భ‌ర్త ప‌రారీ అయ్యారు. సోద‌రుడు కూడా ప‌రార్ అయ్యారు. చివ‌ర‌కు ఇటీవ‌లే అఖిల‌ప్రియ భ‌ర్త‌కు బెయిల్ ద‌క్కింది. ప‌రారీలో ఉండ‌గానే బెయిల్ అయితే సంపాదించుకున్నారు కానీ, ఆ ఆస్తుల‌ను మాత్రం భూమా ఫ్యామిలీ ద‌క్కించుకోలేక‌పోతోంద‌నేది తాజా అప్ డేట్!

ఆ భూములు త‌మ‌వి అని భూమా జ‌గ‌త్ విఖ్యాత్ కిడ్నాప్ వ్య‌వ‌హారం త‌ర్వాత ప్ర‌క‌టించారు. అయితే అవి వీరివి అయిన‌ప్పుడు ప్ర‌వీణ్ రావు సోద‌రుల చేత సంత‌కాలు ఎందుకు పెట్టించుకోవాల్సి ఉంద‌నేది ఆయ‌న చెప్ప‌లేదు. అది కూడా బ‌ల‌వంతంగా సంత‌కాలు ఎందుకు పెట్టించుకునే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌నేది కూడా క్లారిటీ లేదు. 

ఇక హ‌ఫీజ్ పేట భూ వివాదంలో ప్ర‌భుత్వం కూడా కోర్టును ఆశ్ర‌యించింది. ఆ భూమ‌లన్నీ ప్ర‌భుత్వానివి అంటూ తెలంగాణ గ‌వ‌ర్న‌మెంటు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించ‌గా, అలాంటిదేమీ లేద‌ని తేల్చి చెప్పింద‌ట‌. ఒక‌సారి కాదు ప‌లు సార్లు జ‌రిగిన విచార‌ణ‌లో.. ఆ భూములు ప్రైవేట్ వ్య‌క్తుల‌వే అని కోర్టు స్ప‌ష్ట‌త ఇచ్చింద‌ట‌.

ఈ నేప‌థ్యంలో..  ప్ర‌వీణ్ రావు ఫ్యామిలీకి కూడా భారీ ల‌బ్ధి క‌లుగుతోంద‌ట‌. వివాదంలోని 50 ఎక‌రాల భూమి వారికే చెందుతుంద‌ని కోర్టు స్ప‌ష్ట‌త ఇచ్చింద‌ట‌. ఏ 50 ఎక‌రాల భూమి అయితే త‌మ‌ది అని భూమా జ‌గ‌త్ విఖ్యాత్ అన్నాడో, ఆ భూములు ఇప్పుడు ప్ర‌వీణ్ రావు కుటుంబానికి సొంతం అయ్యాయ‌ని తెలుస్తోంది.

ఆ ప్రాంతంలో ఎక‌రం భూమి దాదాపు 40 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంద‌ట‌. ఈ మార్కెట్ రేటు ప్ర‌కారం చూస్తే..వివాదంలోని భూమి విలువ‌ దాదాపు 2000 కోట్ల రూపాయ‌లు! ఈ ప్ర‌కారం చూస్తే.. భూమా ఫ్యామిలీ నుంచి 50 ఎక‌రాల భూమి చేజారింద‌ని, స్థూలంగా రెండు వేల కోట్ల రూపాయ‌ల ఆస్తి వారి నుంచి చేజారింద‌ని లెక్క‌లు చెబుతున్నాయి. మ‌రి ఈ వివాదం మూలాలు ఏమిటో కానీ.. ఈ భూములు భూమా ఫ్యామిలీకి ఎలా ద‌క్కాయో, ఎలా చేజారాయో కానీ.. భారీ నంబ‌ర్లు అయితే వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?