భూమా మౌనిక సంత‌కాలు ఫోర్జ‌రీ!

మ‌నోజ్ భార్య మౌనిక ఆస్తుల విష‌య‌మై సంచ‌ల‌న విష‌యం అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

మంచు కుటుంబంలో గొడ‌వ‌లు ప‌తాక స్థాయికి చేరిన నేప‌థ్యంలో, మ‌నోజ్ భార్య మౌనిక ఆస్తుల విష‌య‌మై సంచ‌ల‌న విష‌యం అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. భూమా నాగిరెడ్డి, శోభ దంప‌తుల‌కు ముగ్గురు పిల్ల‌లు. పెద్ద కుమార్తె అఖిల‌ప్రియ‌, రెండో కుమార్తె మౌనిక‌, అంద‌రికంటే చిన్న వాడు జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి. ఇంత వ‌ర‌కూ వీళ్లు ఆస్తులు పంచుకోలేద‌ని స‌మాచారం.

చాలా కాలంగా త‌న వాటా పంచాల‌ని మౌనిక త‌న అక్క అఖిల‌ప్రియ‌పై ఒత్తిడి చేస్తున్న‌ట్టు తెలిసింది. కార‌ణం తెలియ‌దు కానీ, వాటాల పంపిణీ జాప్య‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో విలువైన ఆస్తుల్లో కొన్నింటిని అమ్మిన‌ట్టు, అలాగే మ‌రికొన్నింటిని బ్యాంకుల్లో త‌న‌ఖా పెట్టి భారీ మొత్తంలో లోన్ తెచ్చుకున్న‌ట్టు భూమా మౌనిక తెలుసుకున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ప్ర‌తి డాక్యుమెంట్‌లోనూ త‌న సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేశార‌ని తెలుసుకుని మౌనిక షాక్ అయ్యారు.

నంద్యాల ప‌ద్మావ‌తిన‌గ‌ర్‌లో రూ.4 కోట్ల విలువైన స్థ‌లాన్ని అమ్మిన‌ట్టు చేసుకున్న అగ్రిమెంట్‌లో త‌న సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేశార‌ని తెలుసుకున్న మౌనిక తీవ్ర ఆవేద‌న‌, ఆగ్ర‌హానికి గుర‌య్యారు. అలాగే ఆళ్ల‌గ‌డ్డ‌లో కూడా విలువైన ఆస్తుల్ని అమ్మ‌డం, అలాగే బ్యాంకుల్లో త‌న‌ఖా పెట్ , అందులో త‌న సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేశార‌ని మౌనిక తెలుసుకున్నారు. ఇదేంట‌ని ప్ర‌శ్నించినా ఆమెకు స‌మాధానం చెప్పేవాళ్లు లేరు.

ఈ నేప‌థ్యంలో పుట్టింటి నుంచి వాటా ద‌క్కించుకోడానికి న్యాయ పోరాటానికి ఆమె సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందుకు సంబంధించి కేసు వేయ‌డానికి అన్ని ర‌కాలుగా ఆమె ఏర్పాట్లు చేసుకున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. ఏ క్ష‌ణ‌మైనా కోర్టులో కేసు వేయ‌డానికి ఆమె న్యాయ‌వాది రెడీగా ఉన్నారు. కోర్టులో మౌనిక కేసు వేయ‌డ‌మే ఆల‌స్యం, భూమా కుటుంబం ర‌చ్చ వీధికెక్క‌నుంది.

6 Replies to “భూమా మౌనిక సంత‌కాలు ఫోర్జ‌రీ!”

    1. దశరధున్ని నాడు దిక్కులేని

      దశకు తెచ్చింది ఆడదిరా

      అయ్యో భీష్ముడంతటివాణ్ణి

      అంపశయ్యను పెట్టి చంపింది ఆడదిరా

      అందాల అగ్గిలో విశ్వామిత్రుడి

      నిష్ఠ చెరిపింది ఆడదిరా

      అహ పల్నాడు నేలంతా

      పచ్చినెత్తుట్లోన తడిపింది ఆడదిరా

      కోడల్ని తగలపెట్టే అత్త కూడా ఆడదిరా

      కోడల్ని తగలపెట్టే అత్త కూడా ఆడదిరా

      ఈ మగవాన్ని నేడు చెరిచింది ఆడదిరా

  1. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu Naidu) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ‘‘రాష్ట్రానికి గూగుల్‌‌ను తీసుకువచ్చేందుకు మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం. ప్రతిసారి మీరు మీ సామర్ధ్యాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు’’ అంటూ సీఎంను పవన్ పొగడ్తలతో ముంచెత్తారు.

  2. వంశంలో,కుటుంబంలో వేరేవ్వరికి దళితధ్రువపత్రాలు లేని ప్రభుత్వ ఉద్యోగిని నకిలీ దళిత ఉద్యోగులని అంటారు. ముందుగా అది జగమెరిగిన సత్యం. పట్టుబడిన తర్వాత, న్యాయవాది, అందులో చనిపోయిన తల్లికి దళిత ఇంటిపేరు ఉన్నట్టు, నకిలీ కథను, ఒక అవతారమూర్తిని సృష్టిస్తారు. ఇక అందులోనే రాజారత్నం పుణ్యకాలం అంతా జీతాలు మింగేసేదగా. రిటైర్ అయ్యేదాకా జడ్జీలు కూనిరాగం తీస్తూ, జీతాలు కాజేయమంటారు. రిటైర్ అయ్యే మాసంలో, ఇప్పుడు విచారణ చేయడంలో అర్ధం లేదు.సంశయ లాభం ఎత్తుగడ.చవకబారు వెసులు బాటు హై కోర్ట్ జడ్జీలు కల్పిస్తారు. ఇదీ దగా, మోసం, రాజ్యాంగ విరుద్ధం అని ఎంత మొత్తుకున్నా జడ్జీలు వినరు.హైదరాబద్ కర్మాంఘాట్ లో మైత్రీపురం కాలనీ లో మిథానిఉద్యోగి సరికొండ పాపరాజు పెద్దకూతురు ఆత్మహత్యచేసుకోడానికి కారణం సవతితల్లి బిరుదురాజు రాజారత్నం.పూర్తీ అరాచకం న్యాయవాదిదే. పోలీసులులాభం కల్పిస్తారు

Comments are closed.