వర్మకు దక్కిన బెయిల్ వైసీపీకి ఆదర్శం కావాలి!

రామ్ గోపాల్ వర్మ అనుసరించిన వ్యూహాన్ని, పద్ధతిని వైసీపీ పెద్దలు, న్యాయనిపుణులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీతో అనుబంధం ఉన్న అందరూ కూడా ఇప్పుడు కోర్టులను ఆశ్రయిస్తూ వస్తున్న పరిస్థితి. ఎప్పుడు ఎవరి మీద ఎక్కడ ఎలాంటి కేసు నమోదు అవుతుందో తెలియదు.

సాధారణంగా కేసు నమోదు అయిన తరువాత.. ముందస్తు బెయిల్ కోసం ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏ కేసు లేకపోయినా సరే.. బెయిల్ పిటిషన్ వేయదాం అని నాయకులు ఆరాటపడేలా ఉంది. రకరకాల కేసులు పెడుతున్నారు.. స్టేషన్లకు తిప్పుతున్నారు.. వేధిస్తున్నారు.. ఇలా రకరకాలుగా జరుగుతోందనే ఆరోపణలు వైసీపీ వారినుంచి వస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో పలుచోట్ల తన మీద సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కేసులు నమోదు కాగా.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పొందిన ముందస్తు బెయిల్ మిగిలిన వైసీపీ నాయకులకు ఆదర్శం వంటిదని అందరూ అనుకుంటున్నారు.

ఎందుకంటే.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వైసీపీకి చెందిన పలువురి మీద కేసులు నమోదు అవుతూ ఉండగా.. చాలా మంది బెయిల్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ ప్రయత్నాల్లో చాలా మందికి ముందస్తు బెయిళ్లు దొరకడం లేదు. కొందరికి బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతూ.. కేవలం అరెస్టు నుంచి రక్షణ అవకాశం మాత్రమే దక్కుతోంది.

ఎంపీగా పనిచేసిన నందిగం సురేష్ వంటి వారికి అసలు ఏదీ దొరకలేదు. నెలల తరబడి ఇంకా రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉన్నారు. అందరూ ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుండగా.. రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎంచక్కా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోగలిగారు.

ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు.. తాము సోషల్ మీడియా కేసులు నమోదు అవుతున్న కార్యకర్తలకు న్యాయ సహాయం అందిస్తున్నాం అంటూనే ఉన్నారు. కానీ.. ఆ సహాయం ఎవ్వరినీ కాపాడడం లేదు. ఎవ్వరినీ కేసుల నుంచి బయటకు పడేయడం లేదు. ఇలాంటి నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ అనుసరించిన వ్యూహాన్ని, పద్ధతిని వైసీపీ పెద్దలు, న్యాయనిపుణులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

వర్మ చాలా స్పష్టంగా తన వాదన వినిపించుకునేలా చేశారు. ఆయన మీడియా ఇంటర్వ్యూల్లో ఏం చెప్పారో.. అదే వాదన న్యాయవాది వినిపించారు. ఆ కీలకం గమనిస్తే.. వైసీపీ కార్యకర్తలు కేసులు పెడుతున్నా సరే.. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు

16 Replies to “వర్మకు దక్కిన బెయిల్ వైసీపీకి ఆదర్శం కావాలి!”

  1. వైసీపీ నుంచి పొందిన ప్రతిఫలానికన్నా కోర్ట్ ఖర్చులకి ఎక్కువ మింగితే అనుకున్న పని జరిగినట్టేగా..

  2. ఎంత దిగజారుడు ఆర్టికల్ సర్ … వర్మ బెయిల్ వైసీపీ కి ఆదర్శం కావాలా… మీరు ఏమి ప్రోత్సహిస్తున్నారు సర్ .. *నోటికొచ్చింది మాట్లాడండి బెయిల్ తెచ్చుకోండి* అంతేనా .. మీలాంటి వల్ల కాదా వైసీపీ ఇంకా ఇంకా మునిగిపోతున్నది

  3. జస్ట్ ఒక పెగ్ వోడ్కా వేయడానికి టైం ఇచ్చారంతే. అంత ఆదర్శంగా తీసుకోవలసిన పని లేదు.

Comments are closed.