టూరిజం ప్లాన్స్: వ్యాపారం తప్ప మరొకటి లేదా సార్!

కేవలం వ్యాపార దృక్పథంతో చంద్రబాబు సర్కారు ఆలోచిస్తున్న టూరిజం ఐడియాలతో పాటూ.. ఇలాంటి వాటి మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది కదా.. అనే చర్చ జరుగుతోంది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ పాలసీ వచ్చే అయిదేళ్లపాటు అమల్లో ఉంటుందిట. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన తదితర అంశాలే లక్ష్యంగా నూతన విధానం ఉంటుందిట. బహుశా చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు నుంచి చెబుతున్న సంపదసృష్టి అనే పదాలకు అర్థం ఇది కూడా కావొచ్చు.

అయితే కొత్త టూరిజం పాలసీ గురించి ప్రాథమికంగా వెల్లడవుతున్న వివరాల్ని బట్టి.. ఈ పాలసీ కేవలం వ్యాపారం కనిపిస్తున్నది తప్ప.. పర్యాటకరంగం పరంగా, సాంస్కృతిక పర్యాటక వైభవం పరంగా రాష్ట్ర ఔన్నత్యాన్ని కాపాడే ప్రయత్నంగానీ, ఇనుమడింపజేసే ఆలోచనలు గానీ ప్రభుత్వం వద్ద లేవు.

ఎకోటూరిజం, క్రూయిజ్ టూరిజం, బీచ్ సర్క్యూట్ లు, బ్యాక్ వాటర్ టూరిజం అంటూ ఆధునిక పదాలను చంద్రబాబునాయుడు సర్కారు పలుకుతోంది. చంద్రబాబునాయుడు తనను తాను సీఎంగా పిలిపించుకోవడం కంటె.. రాష్ట్రానికి సీఈవోగా పిలిపించుకోవడానికి ముచ్చటపడతారనే సంగతి గతంలో ప్రచారంలో ఉండేది. ఇప్పుడు కూడా ఆయన అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. టూరిజం కొత్త పాలసీ అంశాలుగా చెబుతున్న వాటిలో కేవలం వ్యాపారం తప్ప.. రాష్ట్ర పర్యాటక వైభవాన్ని కాపాడే అంశాలు ఒక్కటి కూడా లేవు.

క్రూయిజ్ , బీచ్ సర్క్యూట్, బ్యాక్ వాటర్ టూరిజం ఇవన్నీ కేవలం విహార యాత్రలు మాత్రమే. డబ్బు విచ్చలవిడిగా తగలేసి.. కొన్ని రోజులు గడిపి వద్దాం అనుకునే వారికి ఉద్దేశించి చేసిన ప్రాజెక్టులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలాంటి ప్రాజెక్టులు వద్దని కాదు. వాటితో పాటు టూరిజం పరంగా ఆంధ్రప్రదేశ్ కు ఉన్న ప్రత్యేకత లను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. నగరాలకు సమీపంలో నదుల్లో, సముద్రాల్లో వీరు చెబుతున్న టూరిజం ప్రాజెక్టులు కేసినోలు, లాడ్జిలు, బార్లు, పబ్ లు నిర్వహించడం మాత్రమేనా టూరిజం అంటే అనే ప్రశ్న తలెత్తుతోంది.

అటవీ సంపద, విలక్షణమైనకొండలు, జలపాతాలు, గుహలు, ప్రత్యేకించి అత్యద్భుత శిల్పకళకు నెలవైన ఆలయాల ప్రాజెక్టులు అనేకం మన రాష్ట్రంలో ఉన్నాయి. కేవలం వ్యాపార దృక్పథంతో చంద్రబాబు సర్కారు ఆలోచిస్తున్న టూరిజం ఐడియాలతో పాటూ.. ఇలాంటి వాటి మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది కదా.. అనే చర్చ జరుగుతోంది. దానివల్ల రాష్ట్ర పర్యాటక వైభవం ప్రపంచానికి తెలుస్తుంది కదా.. అనే చర్చ జరుగుతోంది.

15 Replies to “టూరిజం ప్లాన్స్: వ్యాపారం తప్ప మరొకటి లేదా సార్!”

  1. నీ కడుపు మంట ప్రపంచానికి తెలియడం తప్ప, ఇంక ఏమైనా ఉందా GA…. యే కంట్రీ ఐనా ,స్టేట్ ఐనా టూరిజం ను డెవలప్ చేసేది revenue కోసమే GA…

  2. Tourism మినిస్టర్ అంటే మా నగరి పిర్రల పంది లోజానే..నిక్కర్లు ఏసుకుని పేపంచం మొత్తం టూర్లు తిరుగుతూ అబ్బో ఆ ఆర్భాటం, ఆ జబ్బర్దస్త్ డెవలప్మెంట్ ఇంకో వందేళ్ళకి కూడా నిలిచే ఉంటుంది..

    తిరుమల దర్శన యాపారం మాత్ర0 ఎక్సట్రా జబ్బర్దస్త్..

  3. టూరిజం డెవలప్మెంట్ అంటే పర్యావరణం నాశనం చేస్తూ ఋషికొండ ని గుండు కొరిగి, ప్రజల నుండి చెత్త పన్ను వసూల్ చేసిన 5000 కోట్లతో ప్యాలెస్ కట్టి, అందులో కోట్లు పోసి సముద్రం చూస్తూ జంటగా స్నానం చెయ్యడానికి బాత్ టబ్బు & ‘గుద్ద కడుక్కోవాల్సిన అవసరం లేని పాయిఖానా కట్టించడం తెలుసా బాబూ??

    ఇదీ టూరిజం డెవలప్మెంట్ అంటే..

    మందలు ఏసుకుని చేసే తిరుమల దర్శన యాపారం దీనికి అదనం..

  4. టూరిజం డెవలప్మెంట్ అంటే పర్యావరణం నాశనం చేస్తూ ఋషికొండ ని గుండు కొరిగి, ప్రజల నుండి చెత్త పన్ను వసూల్ చేసిన 5000 కోట్లతో ప్యాలెస్ కట్టి, అందులో కోట్లు పోసి సముద్రం చూస్తూ జంటగా స్నానం చెయ్యడానికి బాత్ టబ్బు & ‘గుద్ద కడుక్కోవాల్సిన అవసరం ‘లేని పాయిఖానా కట్టించడం తెలుసా బాబూ??

    ఇదీ టూరిజం డెవలప్మెంట్ అంటే..

    మందలు ఏసుకుని చేసే తిరుమల దర్శన యాపారం దీనికి అదనం..

Comments are closed.