Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఇంకా ఎక్కడెక్కడ గోతులు తవ్వుతున్నారో?

ఇంకా ఎక్కడెక్కడ గోతులు తవ్వుతున్నారో?

కుర్చీ కింద గోయి తవ్వడం అనేది కుట్ర రాజకీయాలకు సంబంధించి చాలా పురాతనమైన పదప్రయోగం. ఇప్పుడు అలాంటి పదవిలో ఉన్నవారిని కూలదోసే కుట్రలకు కూడా  ఆధునికత జత అయిపోయింది. నైతిక విలువలు, ఫిరాయింపులపై అనర్హత వేటు వంటివి.. ఆధునిక రాజకీయాల్లో పలకకూడని బూతు పదాలు అయిపోయాయి. అలాంటి నేపథ్యలో మోడీ-షా ద్వయం... దేశంలోని ఇంకా ఏయే ప్రభుత్వాలను కూల్చే ఉద్దేశంతో పావులు కదపనున్నదో అనే సందేహాలు రేగుతున్నాయి. ఎన్డీయేతర ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా... ఆయా ప్రాంతాల్లో తాము చక్రం తిప్పడానికి, అనగా కుట్ర చేయడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా.. భరతం పట్టడానికే వారు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారు దాదాపుగా కూలిపోయినట్లే. మంత్రులతో రాజీనామాలు చేయించి.. మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించడం ద్వారా... అసంతృప్తులను బుజ్జగించి.. ప్రభుత్వాన్ని నిలుపుకోవాలనుకున్న కమల్‌నాధ్ ప్రయత్నాలకు ఆదిలోనే గండిపడింది.  ఆయనతో అందరితో రాజీనామాలు చేయించేలోగానే.. ఈ తిరుగుబాటు వచ్చింది. సింధియా గ్రూపు ఎమ్మెల్యేలంతా తమ రాజీనామాలు సమర్పించారు. స్పీకరు వాటిని ఆమోదించినా ప్రభుత్వం కూలిపోతుంది. ఆమోదించకపోతే.. భాజపా ప్రవేశపెట్టిన అవిశ్వాసం చర్చకు వచ్చి ప్రభుత్వం కూలిపోక తప్పదు. అంటే ఏం జరిగినా ప్రభుత్వం కూలడం గ్యారంటీ. కాకపోతే.. ఆమోదిస్తే ఆ స్థానాలకు ఉప ఎన్నికలు రావొచ్చు.

ఈ పరిణామాలను గమనిస్తున్న మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వంలో కూడా గుబులు పుట్టినట్టుగా కనిపిస్తోంది. అక్కడ అధికారంలోకి శివసేన రాకముందే.. ఎన్సీపీని చీల్చడానికి భాజపా ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల్లోని కొందరిని చీల్చవచ్చుననే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాత్రం.. మధ్యప్రదేశ్ లోని వైరస్ (భాజపా కుట్ర) మహారాష్ట్ర దాకా రాదంటూ నర్మగర్భంగా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.

మొత్తానికి మోడీ సర్కారు.. దేశవ్యాప్తంగా ‘మార్జిన్’లో మనుగడ సాగిస్తున్న ఏ ఎన్డీయేతర ప్రభుత్వాన్నయినా కూల్చేసి.. తమ జెండా పాతడానికి గోతులు తవ్వేస్తుందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది. గతంలో ఇలాంటి చరిత్రలేని భాజపాకు.. ఈ చేతలు, దక్కుతున్న కీర్తి కొత్తకొత్తగా ఉండొచ్చు.

సీఎంను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?