ఏకంగా ‘370’ రద్దుచేశారు.. ప్రత్యేకహోదా ఇవ్వలేరా?

ఏపీకి ప్రత్యేక హోదానా..? అమ్మో దానికి ప్రణాళికా సంఘం ఒప్పుకోదు, ఆర్థికసంఘం అడ్డు చెబుతుంది, ఇతర రాష్ట్రాలు మూకుమ్మడిగా వద్దంటాయి, రాజ్యాంగం సవరించాలి. అసలీ తలనొప్పి ఎందుకు ప్రత్యేకహోదా వదిలేయండి, ప్యాకేజీతో పని కానిద్దాం.…

ఏపీకి ప్రత్యేక హోదానా..? అమ్మో దానికి ప్రణాళికా సంఘం ఒప్పుకోదు, ఆర్థికసంఘం అడ్డు చెబుతుంది, ఇతర రాష్ట్రాలు మూకుమ్మడిగా వద్దంటాయి, రాజ్యాంగం సవరించాలి. అసలీ తలనొప్పి ఎందుకు ప్రత్యేకహోదా వదిలేయండి, ప్యాకేజీతో పని కానిద్దాం. ఇదీ ఏపీ ప్రజలకు బీజేపీ రోజూ అప్పజెప్పే పాఠం. మరి ఆర్టికల్ 370 పరిస్థితి ఏంటి?

ఏ తేనెతుట్టె కదిపితే దేశమంతా అట్టుడికిపోతుంది అని ఇన్నాళ్లూ అందరూ అనుకున్నారో దాన్నే సులభంగా పెకలించి వేసింది బీజేపీ సర్కార్. ఎవరు ఏమనుకున్నా తాను అనుకున్నది సాధించింది. విదేశీ ప్రభుత్వాలు సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. అలాంటి బీజేపీకి ఏపీ ప్రత్యేకహోదా ఒక లెక్కా, ఎవర్ని బుజ్జగించాలో, ఎవర్ని బెదిరించాలో, ఎవరి నోరు ఏం చెప్పి మూయించాలో అన్నీ బాగా తెలిసిన ద్వయం మోదీ, అమిత్ షా. అలాంటి వాళ్లు తల్చుకుంటే ఈపాటికే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వొచ్చు. కానీ ఇవ్వరు.

ఏ పనిచేసినా లెక్కలేసుకుని చేసే మనస్తత్వం మోదీ, అమిత్ షా జోడీది. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే.. రాజకీయంగా ఉన్నఫలంగా బీజేపీకి లాభం లేదు. ఒకటీ అరా సీట్లు ఏపీలో వస్తాయేమో కానీ అధికారం మాత్రం చేజిక్కదు, అది వాస్తవం. అందుకే ఏపీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అంత ఆసక్తి చూపించడంలేదు.

రాష్ట్ర విభజనతో రెండు విధాలుగా లాభపడొచ్చని కాంగ్రెస్ ఎత్తువేసింది. అటు ఏపీ, ఇటు తెలంగాణలో చక్రం తిప్పొచ్చని అనుకుంది. కానీ రెండు రాష్ట్రాల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. బీజేపీ భయం కూడా ఇదే. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే ఆ క్రెడిట్ తమకు దక్కదని బీజేపీ భావిస్తోంది. కొన్నేళ్లుగా హోదా కోసం పోరాడుతున్న ముఖ్యమంత్రి జగన్ ఖాతాలోకి అది చేరిపోవడం ఖాయం. ఇదే బీజేపీ భయం.

హోదాపై ఆ పార్టీ బైటకు చెబుతున్న కారణాల్లో ఏ ఒక్కటీ నిజంకావు. ఆర్టికల్ 370ని రద్దు చేసేదమ్మున్న బీజేపీకి ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం పెద్ద సమస్యకాదు. కానీ మోడీ-షా ఆ పనిచేయరు. ఎందుకంటే వాళ్లకు రాజకీయంగా అది కలిసిరాదు కాబట్టి.

జనసేన… బతికి ఉంటేనే బేరముంటుంది!

రాహుల్ తో రచ్చ చేసిన రకుల్