జమ్మూ, కాశ్మీర్ బిల్లుకు సంపూర్ణ మద్దతు

జమ్మూ, కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో వి.విజయసాయి రెడ్డి పాల్గొంటూ ఈ బిల్లుకు మా పార్టీతోపాటు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు  సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.…

జమ్మూ, కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో వి.విజయసాయి రెడ్డి పాల్గొంటూ ఈ బిల్లుకు మా పార్టీతోపాటు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు  సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దశాబ్దాలుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న జమ్మూ, కాశ్మీర్ సమస్యకు పరిష్కారంగా ప్రవేశపెట్టిన కీలకమైన ఈ బిల్లుపై మాట్లాడే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.

జమ్మూ, కాశ్మీర్‌ను ఆక్రమించేందుకు పాకిస్తాన్‌ సైన్యం ప్రయత్నించినపుడు భారత సైన్యం పాక్‌ చొరబాటును తిప్పికొడుతూ దాదాపు 25 కిలోమీటర్లు పాక్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయిందని అన్నారు. ఆనాడు భారత సైన్యాన్ని వెనక్కి రప్పించి నెహ్రూ చారిత్రక తప్పిదం చేయలేదా అని ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌ను ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్‌ 370ని ప్రవేశపెట్టడం ద్వారా నెహ్రూ నాటి కాశ్మీర్‌ పాలకుల ఒత్తిడికి తలవంచబట్టే నేడు ఈ దుస్థితి దాపురించిందని అన్నారు. తాత్కాలికమైన ఈ ఆర్టికల్‌ 370ని కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దుచేసి ఉంటే ఈరోజు దీనిపై చర్చించాల్సిన అవసరం ఉండేది కాదని చెప్పారు.

ఒక ఒరలో రెండుకత్తులు ఏ విధంగా ఇమడనప్పుడు దేశంలో రెండు వేర్వేరు ప్రాంతాలు స్వతంత్రంగా ఎలా ఉండగలవని ప్రశ్నించారు. ఒకదేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు వేర్వేరు పతాకాలు, ఇద్దరు వేర్వేరు ప్రధాన మంత్రులు భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా కనిపించవని అన్నారు. భారత జాతీయ పతాకాన్ని తగులబెడితే అది నేరంకాని ప్రాంతం దేశంలో అంతర్భాగం ఎలా అవుతుందని నిలదీశారు. ఇలాంటివి ఒక్క జమ్మూ, కాశ్మీర్‌లో మాత్రమే సాధ్యమవుతున్నాయని అన్నారు. కాశ్మీరీ యువతిని వివాహం చేసుకున్న పాకిస్తానీ భారతీయ పౌరుడు అవుతున్నాడు. అదే భారతదేశంలోని ఏ ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న కాశ్మీరీ యువతిని ఆ రాష్ట్రంలో అంటరాని వ్యక్తి అవుతోందని అన్నారు. ఇది దారుణమైన లింగవివక్ష కాదా అని ప్రశ్నించారు.

భారతదేశాన్ని ఒక దేశంగాను, ఒక సంఘటిత ప్రాంతంగాను, ఒక జాతిగాను చూడాలన్న ఆకాంక్షతో దేశప్రజలు 1947 నుంచి పోరాడుతూనే ఉన్నారు. దేశప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడానికి ఈరోజు హోంమంత్రి అమిత్‌ షా నడుం బిగించారు. సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ విడిచి పెట్టిన కార్యాన్ని హోంమంత్రి ఈరోజు పూర్తి చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ, జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదాలను సరిచేసి 130 కోట్ల భారత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చి అమిత్‌ షా సబ్‌కా వికాస్‌ నినాదాన్ని ఆచరణలో పెట్టబోతున్నారని విజయసాయి రెడ్డి ప్రశంసించారు.

ఈ చర్య దేశ పౌరుల మధ్య వివక్షను తొలగించి దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని మరింత పట్టిష్టం చేయగలదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. జమ్మూ, కాశ్మీర్‌ శాంతి, సౌభాగ్యాలతో పురోగమిస్తుందని అన్నారు. ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆయన అభినందనలు తెలియచేశారు.

జనసేన… బతికి ఉంటేనే బేరముంటుంది!

రాహుల్ తో రచ్చ చేసిన రకుల్