Advertisement

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబుకు ఆమాత్రం తేడా తెలియదా?

చంద్రబాబుకు ఆమాత్రం తేడా తెలియదా?

చంద్రబాబునాయుడు మళ్లీ తాజాగా సుద్దులు చెప్పడం ప్రారంభించారు. అంతా తాను చేసినట్లుగానే జగన్ ప్రభుత్వం కూడా చేయాలని కొత్త పాట అందుకున్నారు. కరోనా వ్యాపిస్తుందనే ఆందోళనతో రాష్ట్రమంతా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పేదలకు ఏమేం ఇవ్వాలో ఏం సాయం చేయాలో.. జగన్ ప్రభుత్వానికి మార్గదర్శనం చేసే బాధ్యతను చంద్రబాబు పిలవని పేరంటంలా నెత్తికెత్తుకున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే జగన్ సర్కారు.. లాక్ డౌన్ సందర్భంగా పేదలను ఆదుకోవడానికి భారీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని పేదలందరికీ 25 కిలోల బియ్యం, వెయ్యిరూపాయలు ఇచ్చేలా జగన్ ప్రకటించారు. అవి వారికి ఇళ్లకే  చేరుస్తామని ప్రకటించారు. అయితే చంద్రబాబు తాను గతంలో హుదుద్ తుపాను సందర్భంగా ఇచ్చిన తరహాలోనే పేదలందరికీ ఇవ్వాలని అంటున్నారు. అప్పట్లో ఏమేం ఇచ్చారో సరుకుల పట్టీ కూడా ఆయన చదివి వినిపిస్తున్నారు. హుదుద్ కు, కరోనాకు తేడా ఏంటో.. నలభయ్యేళ్ల సీనియారిటీ ఉన్న చంద్రబాబుకు తెలియదా అని ప్రజలు విస్తుపోతున్నారు.

హుదుద్ అనేది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన విపత్తు. తతిమ్మా రాష్ట్రమంతా  చేయూత అందించింది. అలాంటప్పుడు ఎంతైనా సాయం అందించవచ్చు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కరోనా బారిన పడింది. యావద్దేశం ఇదే లాక్ డౌన్ లో ఉంది. రాష్ట్రం మొత్తానికి అదే మోతాదులో ఇవ్వాలనడం ఎలా కుదురుతుంది? సాధారణంగా కుదరదు- కానీ.. జగన్ చేస్తున్న సాయం తక్కువ కాదు. నెలరోజులకు మాత్రమే ఇలా 25 కిలోల బియ్యం ఇస్తున్నారు. తర్వాత మళ్లీ లాక్ డౌన్ ఉంటే మళ్లీ అందించే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ ఈలోగానే.. ఈ అంశాలనుంచి తన ఘనతను చాటుకోవడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు ఆశపడుతున్నట్లు కనిపిస్తోంది.

మరో కోణం కూడా ఉంది. హుదుద్ అనేది విపత్తు విధ్వంసం. ఆ విధ్వంసం జరిగిపోయిన తర్వాత సాయం అందించారు. అంటే.. అప్పటికే.. ప్రజలు తమకు ఉన్న సర్వస్వమూ కోల్పోయి ఉన్నారు. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు చేసిన సాయం చాలా తక్కువ. ఇప్పుడు కరోనా లాక్ డౌన్ అనేది అలా జరిగిపోయిన విధ్వంసం కాదు.. జరగకుండా ముందుజాగ్రత్తగా చేపడుతున్నది మాత్రమే. కాబట్టి అవసరానికి మించిన సాయాన్నే ప్రభుత్వం అందిస్తున్నదనేది ప్రజాభిప్రాయం. పైగా మరో కీలకాంశం గమనించాలి. ఒకేసారి రెండు నెలలకు సరిపడా బియ్యం, సాయం అందిస్తే.. అప్పటిదాకా ఇదే లాక్ డౌన్ ఉంటుందేమో.. పరిస్థితి మారదేమో అని ప్రజలు పానిక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ మాత్రం తార్కికజ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎలా అయ్యారోనని ప్రజలు నవ్వుకుంటున్నారు.

21 రోజులు మొత్తం దేశమంతా లాక్ డౌన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?