నన్ను పట్టించుకోరా… రగిలిపోతున్న చంద్రబాబు

ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి టైమ్ దగ్గరపడేకొద్దీ చంద్రబాబులో అసహనం పెరిగిపోతోంది. టీడీపీ శాసన సభాపక్ష సమావేశంలో ఇదే అసహనం బైటపడింది. ప్రమాణ స్వీకారోత్సవానికి తనకు ఆహ్వానం అందినా.. జగన్ వైభవాన్ని చూసేందుకు బాబు…

ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి టైమ్ దగ్గరపడేకొద్దీ చంద్రబాబులో అసహనం పెరిగిపోతోంది. టీడీపీ శాసన సభాపక్ష సమావేశంలో ఇదే అసహనం బైటపడింది. ప్రమాణ స్వీకారోత్సవానికి తనకు ఆహ్వానం అందినా.. జగన్ వైభవాన్ని చూసేందుకు బాబు ఇష్టపడలేదు. తనది 40 ఏళ్ల సీనియారిటీ అనే అహం బాబుకి అడ్డొచ్చింది. తనకంటే చిన్నవాడైన జగన్ చేతిలో తిన్న చావుదెబ్బను బాబు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. 

అయితే బాబు కడుపు మంటకు మరో కారణం కూడా ఉంది. జగన్ పిలిచిన వెంటనే పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తానని చెప్పడం చంద్రబాబుకి కంటగింపుగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ కి ఇచ్చిన ఆతిథ్యాన్ని చూసి బాబు కుళ్లుకుంటున్నారు. జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూడా కేసీఆర్ వస్తారని తెలియడంతో ఆ ఫ్రస్టేషన్ మరింత పెరిగింది. 

ఇక నిన్న మొన్నటి వరకూ తనతో కలసిమెలసి ఉన్న(ఇది బాబు ఫీలింగ్) డీఎంకే అధినేత స్టాలిన్ కూడా జగన్ పట్టాభిషేకానికి వస్తానని చెప్పడం బాబుకి మరింత తలనొప్పిగా మారింది. అప్పటి వరకూ తానేదో యూపీఏ కన్వీనర్ లాగా ఫీలై.. అన్ని రాష్ట్రాలు తిరిగొచ్చి అందరూ తన వెంటే ఉంటారని అనుకుంటే.. ఇప్పుడు తనను లెక్క చేసే వారు కూడా లేరని తెగ ఇదైపోతున్నారు బాబు. 

అంతే కాదు, తాను ఐదేళ్లలో చేయలేని పనుల్ని జగన్ చేసి చూపిస్తే ఇక తనకి అధికారం శాశ్వతంగా దూరమైపోతుందనే బాధ మరోవైపు ఉండనే ఉంది. వెరసి.. కడుపుమంటతో రగిలిపోతున్న చంద్రబాబు జగన్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నప్పటికీ.. పట్టాభిషేక వైభవాన్ని టీవీలో చూసి కుళ్లుకోబోతున్నారనమాట.