ఇది ప్రియదర్ళి ‘మల్లేశం’

అవార్డ్ విన్నింగ్ సినిమాలు, అవార్డ్ విన్నర్ ల మీద సినిమాలు అంటే కాస్త ఆలోచించే కాలం ఇది. కానీ కొందరుంటారు. వాళ్లు ధైర్యం చేసి ముందుకు అడుగేస్తారు. రాజ్..ఆర్ అనే దర్శక నిర్మాత ఇలాగే…

అవార్డ్ విన్నింగ్ సినిమాలు, అవార్డ్ విన్నర్ ల మీద సినిమాలు అంటే కాస్త ఆలోచించే కాలం ఇది. కానీ కొందరుంటారు. వాళ్లు ధైర్యం చేసి ముందుకు అడుగేస్తారు. రాజ్..ఆర్ అనే దర్శక నిర్మాత ఇలాగే ముందుకు అడుగువేసి, ఓ అవార్డ్ విన్నర్ అయిన నేత కార్మికుడి జీవితం ఆధారంగా, అతగాడి బయోపిక్ అనదగ్గ సినిమాను అందిస్తున్నారు.

మల్లేశం తెలంగాణలో అనేక అవార్డులు అందుకున్న నేత కార్మికుడు. అతని జీవితగాధనే మల్లేశం అనే పేరుతో తీస్తున్నారు. పెళ్లిచూపులు సినిమాతో కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ప్రియదర్శి టైటిల్  రోల్ చేస్తున్నారు.

ఆరవ తరగతి వరకు చదివిన మల్లేశం ఎన్ని అడ్డంకులు అధిగమించి, మరమగ్గంపై అద్భుతాలు సృష్టించి, అవార్డులు అందుకున్నాడు అన్నది కథ.

ఈ సినిమా ట్రయిలర్ ను లాంచ్ చేసారు. కమెడియన్ అయిన ప్రియదర్శి చాలా సీరియస్ గా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. కమెడియన్లు సీరియస్ పాత్రలు చేయడం, అందులోనూ ఫుల్ లెంగ్త్ రోల్స్ చేయడం మన దగ్గర చాలా తక్కువ. గతంలో ఎప్పుడో రాజబాబు 'ఎవరికి వారే ఎమునా తీరే' చేసాడు. 

ప్రియదర్శి ని నటుడిగా మరో మెట్టు ఎక్కించేలాగే వుంది ట్రయిలర్. సిన్సియర్ ఎటెంప్ట్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ చిత్రానికి సురేష్ మూవీస్ బ్యాకింగ్ గా వుంది.