తన కెరీర్ ముగింపులో ఓ వైవిధ్యమైన సినిమా అందించాలని సంకల్పించారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఇటీవలే ఈ మేరకు ఓ పోస్టర్ వదిలారు. ముగ్గురు హీరోయిన్లు..ముగ్గురు డైరక్టర్లు..ఓ హీరో అంటూ. ముగ్గురు హీరోయిన్ లతో ఒక హీరోతో సినిమా తీయడం రాఘవేంద్రరావుకు కొత్త ఏమీ కాదు. గతంలో జగపతిబాబుతో ఓ సినిమా ఇలాగే చేసారు.
అయితే ఇప్పటి సినిమా స్పెషాలిటీ ఏమిటంటే ఒకే సినిమాకు ముగ్గురు డైరక్టర్లు పని చేయడం, పైగా రాఘవేంద్రరావు లాంటి దర్శకుడి పర్యవేక్షణ. బాహుబలి నిర్మాతల నిర్మాణం. ఇంతకీ ఈ సినిమాలో ఎవరు హీరో? ఆ ముగ్గురు డైరక్టర్లు ఎవరు?
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఈ సినిమాలో హీరోగా నాగశౌర్య చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు దర్శకుల్లో ఒకరు క్రిష్. మూడు కథలు, ముగ్గురు హీరోయిన్లు వుంటారు. ఒక్కో కథను ఒక్కో దర్శకుడు డైరక్ట్ చేస్తారు. కాన మూడింటికి నాగశౌర్యనే హీరో అన్నమాట.
మొత్తానికి తన చివరి సినిమాగా కేఆర్ఆర్ వైవిధ్యంగా ట్రయ్ చేయడం వరకు ఓకె,. కానీ ఆయన దర్శకత్వం చేయకుండా వేరేవాళ్లు చేస్తే, ఆయన సినిమా ఎట్లయితది? ఏమో?