చంద్రబాబు నాయుడు.. రెంటికీ చెడ్డ రేవడీ?

బయటకు వస్తేనేమో కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు.. తన వాళ్ల మధ్యన కూర్చుంటేనేమో బీజేపీతో జతకట్టడం గురించి సమాలోచనలు జరుపుతూ ఉన్నారట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఫలితాల అనంతరం ఏ పార్టీతో కలిసి…

బయటకు వస్తేనేమో కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు.. తన వాళ్ల మధ్యన కూర్చుంటేనేమో బీజేపీతో జతకట్టడం గురించి సమాలోచనలు జరుపుతూ ఉన్నారట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఫలితాల అనంతరం ఏ పార్టీతో కలిసి వెళ్లడం అనే అంశం గురించి చంద్రబాబు నాయుడు ఇప్పుడు  మరో యూటర్న్ తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.  నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీని ఒక రేంజ్ లో భుజాలకు ఎత్తుకున్నారు తెలుగుదేశం అధినేత. వరసగా రాహుల్ గాంధీతో సమావేశాలు, బీజేపీ వ్యతిరేక పక్షాలతో సమావేశాలు, బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారాలు.. ఇవీ చంద్రబాబు నాయుడు చేసిన పనులు.

కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు తిరిగి మరీ బీజేపీని ఓడించాలంటూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం చేశారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేశారు. బీజేపీ వ్యతిరేక కూటమే అధికారంలోకి వస్తుందంటూ చంద్రబాబు నాయుడు ఆయా సందర్భాల్లో చెప్పారు కూడా! అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు లెక్కలు మారాయాని.. మళ్లీ బీజేపీ వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు సంప్రదింపులు మొదలయ్యాయని టాక్. తన రాజగురువు ద్వారా చంద్రబాబు నాయుడు మళ్లీ కమలం పార్టీని కదిలించే ప్రయత్నంలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే బీజేపీతో వైరంలేదన్నట్టుగా అప్పుడే చంద్రబాబు నాయుడు తన పార్టీ శ్రేణుల వద్ద వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది.  ఇలా ఫలితాలకు సమయం దగ్గర పడుతున్నతరుణంలో చంద్రబాబు నాయుడు మరో యూటర్న్ కు ప్రిపరేషన్ చేశారని స్పష్టం అవుతోంది.

బయటకు వస్తే కాంగ్రెస్ గురించి, తన వాళ్ల మధ్యన బీజేపీ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు ఫలితాలు వచ్చాకా ఎవరితో జట్టు కట్టే ప్రయత్నం చేస్తారో! ఇలా రెంటికీ చెడ్డ రేవడీ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఫలితాలు తేడాకొడితే, ఎంపీ సీట్లు తక్కువ స్థాయిలో వస్తే  చంద్రబాబును పట్టించుకునేవారు అయితే ఎవరూ ఉండరని విశ్లేషకులు అంటున్నారు.

మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు నిపుణుడే