Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోయిన్ లేకుండానే సెట్స్ పైకి..

హీరోయిన్ లేకుండానే సెట్స్ పైకి..

అఖిల్ సినిమాకు అన్నీ సెట్ అయ్యాయి. హీరోయిన్ ఒక్కటే బ్యాలెన్స్. హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఫైనల్ చేసి సినిమాకు కొబ్బరికాయ కొట్టేద్దామనుకున్నారు. కానీ ఆ ఒక్కటి తెగడంలేదు. అందుకే ఇక ఆలస్యం చేయకూడదనే ఉద్దేశంతో హీరోయిన్ లేకుండానే సెట్స్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో సినిమా ఈనెల 24న లాంఛనంగా ప్రారంభం అవుతుంది. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని నిర్ణయించారు. కేవలం అఖిల్ పై వచ్చే సన్నివేశాల్ని ఫస్ట్ షెడ్యూల్ లో పూర్తిచేయాలని నిర్ణయించారు.

ఈ సినిమాకు గోపీసుందర్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. మణికన్నన్ సినిమాటోగ్రాఫర్. కాస్త ఫేమ్ ఉన్న హీరోయిన్ కోసం వెదుకుతున్నారు. కియరా అద్వానీ, రష్మిక లాంటి హీరోయిన్లు బిజీ అయిపోయారు. కీర్తిసురేష్ పేరు చర్చకొచ్చినప్పటికీ అఖిల్ కంటే పెద్దగా కనిపిస్తుందనే ఉద్దేశంతో వద్దనుకున్నారు.

అలా హీరోయిన్ లేకుండానే అఖిల్ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. అఖిల్ కు ఇది నాలుగో మూవీ.

మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు నిపుణుడే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?