Advertisement

Advertisement


Home > Politics - Gossip

బాబుకే వెన్నుపోటు.. ఇది కదా రాజకీయం!

బాబుకే వెన్నుపోటు.. ఇది కదా రాజకీయం!

వెన్నుపోటు స్పెషలిస్ట్ అంటే ఎవరికైనా చంద్రబాబు గుర్తొస్తారు. ఆయన ప్రస్థానమే వెన్నుపోట్ల మయం. ఈ పదానికి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అలాంటి చంద్రబాబుకే వెన్నుపోటు పొడిచిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అవును.. తనను నమ్మి వచ్చిన బాబును వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమౌతోంది కాంగ్రెస్ పార్టీ.

ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. దేశరాజకీయ చరిత్రలోనే ఇద్దరు బద్ధశత్రువుల అనైతిక కలయిక ఇది. అప్పట్లో ఈ పొత్తుపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. అయినప్పటికీ వాటిని పట్టించుకోలేదు చంద్రబాబు. వెళ్లి రాహుల్ కు శాలువా కప్పి, తిరుపతి ప్రసారం అందించి వచ్చారు.

కట్ చేస్తే, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్లనే తెలంగాణలో ఘోరంగా ఓడిపోయామంటూ తేల్చారు కాంగ్రెస్ పెద్దలు. విశ్లేషకుల మాట కూడా ఇదే. అప్పట్నుంచే టీడీపీపై ఓ కన్నేసి ఉంచింది కాంగ్రెస్. కాకపోతే మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న కారణంగా పొత్తును అలానే కొనసాగించింది. సరిగ్గా ఎన్నికల ప్రక్రియ ముగిసిన వేళ.. టీడీపీకి హ్యాండ్ ఇవ్వాలని భావిస్తోంది హస్తం పార్టీ.

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రావడం ఖాయమని ఇప్పటికే సర్వేలు తేల్చేశాయి. అటు తెలంగాణలో ఆల్రెడీ కేసీఆర్ అధికారంలో ఉన్నారు. ఈ రెండు పార్టీల్ని కలుపుకుంటే దాదాపు 30 నుంచి 35 ఎంపీ సీట్లు ఉంటాయి. కేంద్రంలో మేజిక్ ఫిగర్ కు దగ్గరగా వచ్చి ఆగిపోతే, కాంగ్రెస్ కు వైసీపీ, టీఆర్ఎస్ అత్యంత కీలకంగా మారుతాయి. అందుకే ఇప్పుడా పార్టీ అటు కేసీఆర్, ఇటు జగన్ తో చర్చలు ప్రారంభిస్తోంది.

చర్చలు ఫలించి టీఆర్ఎస్-వైసీపీ కలిసి కాంగ్రెస్ కు మద్దతివ్వాలని నిర్ణయిస్తే మాత్రం అది చంద్రబాబుకు అతిపెద్ద దెబ్బగా మారుతుంది. బాబు ఉన్న కూటమిలోకి రావడానికి జగన్, కేసీఆర్ ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోరు. అలా అని వీళ్లను వదులుకోవడానికి కాంగ్రెస్ ఇష్టపడదు. కాబట్టి ఏదో ఒకసాకు చూపి చంద్రబాబును నిర్దాక్షిణ్యంగా వదిలించుకోవడానికే కాంగ్రెస్ మొగ్గుచూపుతుంది. అదేకనుక జరిగితే దేశరాజకీయాల్లో ఏకాకిగా మిగిలిపోతారు బాబు.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకున్నా చంద్రబాబుకు వెన్నుపోటు తప్పదని భావిస్తున్నారు విశ్లేషకులు. బాబును ఎక్కువకాలం భరించే స్థితిలో కాంగ్రెస్ ఉన్నట్టు కనిపించడం లేదు.

మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు నిపుణుడే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?