ఆ నష్టం పూడ్చుకునేలా సీఆర్డీయే కొత్త ప్లాన్!

చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతంలో తలపెట్టిన నివాస గృహాల సముదాయం హ్యాపీనెస్ట్ ను తిరిగి కొనసాగించే విషయంలో.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నష్టాన్ని పూడ్చుకునే ఆలోచనతో ముందుకు సాగుతోంది. Advertisement జగన్…

చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతంలో తలపెట్టిన నివాస గృహాల సముదాయం హ్యాపీనెస్ట్ ను తిరిగి కొనసాగించే విషయంలో.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నష్టాన్ని పూడ్చుకునే ఆలోచనతో ముందుకు సాగుతోంది.

జగన్ వచ్చిన తర్వాత అమరావతిలోని ఇతర వ్యవహారాలతో పాటు సహజంగా ఆగిపోయిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం తిరిగి కొనసాగించనున్నట్టుగా గతంలోనే ప్రకటించారు. ఇక్కడ ఫ్లాట్లను ప్రకటించినప్పుడే కొన్నవారికి అప్పుడు అమ్మిన ధరలకే పూర్తిచేసి అప్పగించాలని, కొత్తగా భారం మోపరాదని చంద్రబాబు నిర్ణయించినట్టుగా ప్రచారం చేశారు. తద్వారా.. జగన్ ఆ ప్రాజెక్టును ఆపివేయడం వలన.. ప్రభుత్వం ఇన్ని వందల కోట్ల భారం అదనంగా పడబోతున్నదంటూ.. ఒక విద్వేష ప్రచారం సాగించడానికి హ్యాపీనెస్ట్ ను వారు వాడుకున్నారు.

ఇప్పుడు కొత్త ఆలోచనతో సీఆర్డీయే ముందుకెళుతోంది. వారి వ్యూహం నష్టంపూడడానికి మాత్రమే కాదు, ఇతర వక్రఆలోచనలతో కూడా సాగుతున్నదా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది.

గతంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు కింది జీ+18 విధానంలో 12 టవర్లు నిర్మించేలా ప్లాన్ చేశారు. మొత్తం 1200 ఫ్లాట్లు ఉంటాయి. గతంలో బాబు సర్కార్ అమ్మకాలు ఆన్ లైన్ లో ప్రారంభించిన వెంటనే గంటల వ్యవధిలో అన్నీ అమ్ముడుపోయాయి. అందరూ అడ్వాన్సులు చెల్లించారు. జగన్ వచ్చిన తర్వాత ఆగిపోవడంతో.. బుక్ చేసుకున్న వారు 177 మంది అడ్వాన్సు వెనక్కు తీసుకున్నారు.

బుకింగ్ లేకుండా 13 ఫ్లాట్లు మిగిలిపోయాయి. మొత్తం 190 మళ్లీ అమ్మాలన్నమాట. అంటే వెయ్యి ఫ్లాట్లను పాత ధరకే, అప్పుడు కొన్నవారికి అప్పగిస్తారు. ఇప్పుడు నిర్మాణ వ్యయం పెరిగినాసరే.. పాత వారికి భారం పడదు. కొత్తగా నిర్మాణాలు పూర్తిచేయడానికి ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచారు.

అయితే 190 ఫ్లాట్ల విక్రయాన్ని గతంలో మాదిరిగా ఆన్ లైన్ లో కాకుండా వేలం పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటోంది. పైగా ఆ వేలం ఇప్పుడే కాకుండా, అమరావతి నిర్మాణ పనులు ముమ్మరంగా జరిగి ఒక దశకు చేరిన తర్వాత అమ్మాలని అనుకుంటున్నారు. దానివల్ల వేలం పాట పెరిగి, మంచి ధరవస్తుందని వారి అభిప్రాయం.

ఆలోచన మంచిదే కానీ.. కొన్ని విమర్శలున్నాయి. అప్పట్లో కూడా వేలం పెట్టి ఉంటే బాగుండేదని.. కానీ తమ సొంత వారికి లబ్ధి చేకూర్చడానికి ఆన్లైన్ బుకింగ్ పేరిట నడిపించారని సర్కారు తీరుపై విమర్శలు వచ్చాయి. తెలుగుదేశంపై నమ్మకం లేని వారు మాత్రమే బుకింగులు రద్దు చేసుకున్నారు గనుక.. అయినవాళ్లందరూ కొనసాగుతున్నారు గనుక.. వారికి తక్కువ ధరకే లాభం జరిగేలా ఈ స్కెచ్ వేశారనే ఆరోపణలున్నాయి.

ఇప్పుడు చేస్తున్న పద్ధతి తప్పు కాకపోయినప్పటికీ.. నిర్మాణభారం పెరగడం వల్ల జరిగే నష్టం కొంత పూడుతుందని అంటున్నారు. అలాగే.. మిగిలిన వెయ్యి ఫ్లాట్ల ధరను కూడా మరీ చదరపు అడుగు రూ. 4049 అన్నట్టుగా కాకుండా కొంత పెంచినా తప్పులేదని, పెంచకపోవడం అనేది కేవలం అయినవారికి లబ్ది చేయడానికే అని అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి.

12 Replies to “ఆ నష్టం పూడ్చుకునేలా సీఆర్డీయే కొత్త ప్లాన్!”

  1. విద్వేష ప్రచారం ఏంటి GA? ప్రాజెక్ట్ నీ ఆపంది నిజం కాదా ?
    ప్రాజెక్టులు విశాల తెలంగాణ లో పెట్టండి అంది నిజం కాదా?
    కనీసం సిగ్గు శరం మనం మర్యాద ఉండాలి GA
  2. మా జగన్ అన్న Happy nest project లొ ఎదొ అవినీతి జరిగింది అని, contractor ని రద్దు చెసి రివర్సె టెండరింగ్ వెసాడు. అయితె ఈ సారి ఎ ఒక్క contractor కనీసం ముందుకు రాలెదు. 4 సార్లు tender లు పిలిచినా ఆ ధరకి మెము చెయలెము అంటూ ఎవరూ ముందుకు రాలెదు.

    .

    ఆలస్యం కారణంగా అప్పడు కొన్నవారు కొర్ట్ కి వెళ్ళారు. అప్పడు కొన్న వారికి కూడా ఇప్పుడు నీ ఇష్తం వచ్చినట్టు ధరలు పెంచి ఇస్తాం అంటె కొర్ట్ లొ అది చెల్లదు.

    సరిగ్గా వెళ్ళె పని ని జగన్ ఎంత చండాలం చెస్తాడు అన్న దానికి పొలవరం తరువాథ happy nest ఒక ఉదాహరణ. ఇప్పుడు ఈ అదనపు భారం జగన్ పుణ్యమె !

  3. “జగన్ వచ్చిన తర్వాత అమరావతిలోని ఇతర వ్యవహారాలతో పాటు సహజంగా ఆగిపోయిన”

    Jagan does not need new enemies..these kind of articles are enough…so if Jagan comes to power, naturally andhra will suffer!!!!

    lol

  4. If we thought from buyer’s perspective, they invested long back ago, but haven’t received plots even after 7 years. In addition to the loss of interest, they had a bad humiliation from the previous govt.

Comments are closed.