చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రజల కోసం అది చేస్తా ఇది చేస్తా అంటూ చాలా హామీలనే ప్రకటించారు. అలాగే ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత.. అంతకు మించి.. చాలా ఆర్భాటంగా మరికొన్ని మాటలు కూడా వల్లించారు.
ఇవన్నీ కూడా పార్టీ నాయకుల కోసం ప్రభుత్వం ఏం చేయబోతున్నదో తెలియజెప్పే హామీలు! మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత.. నామినేటెడ్ పోస్టుల గురించి ఆ అన్ని పార్టీల నాయకుల్లోనూ చాలా చాలా ఆశలున్నాయి. వారి ఆశలను మరింత పుచేలాగా.. చంద్రబాబునాయుడు పదవుల పందేరానికి వందరోజుల డెడ్ లైన్ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆ విషయంలో మాట నిలబెట్టుకోలేదు. ఇప్పుడు పార్టీ నాయకుల్లో నిరాశ రాజ్యమేలుతోంది.
పార్టీల్లో ఎమ్మెల్యేలుగా గెలిచేవారు కొందరే ఉంటారు. వారిని మించి డబ్బు ఖర్చు పెట్టేవారు, పార్టీకోసం కష్టపడేవారు ఇంకా అనేకమంది ఉంటారు. అలాంటి వారిలో కొందరు కాంట్రాక్టుల రూపేణా లబ్ధి ఆశించవచ్చు. మరికొందరు నామినేటెడ్ పదవుల రూపంలో హోదాలను ఆశిస్తారు.
నిజానికి ఈ పదవులు.. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రభుత్వం ఇచ్చే సరైన గుర్తింపు. కానీ పదవులకు అర్హులను ఎంపిక చేయడంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిపోయినప్పటికీ.. ఇప్పటిదాకా నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోవడం.. ప్రజల దృష్టిలో కాకపోవచ్చుగానీ.. పార్టీ నాయకుల దృష్టిలో చంద్రబాబు నాయుడు వైఫల్యమే.
అయిదేళ్లుగా అధికారానికి హోదాలకు దూరంగా ఉన్న తెలుగుదేశం నాయకులు ఆవురావురుమని ఉన్నారు. పదవులకోసం ఎగబడుతున్నారు. పార్టీ గెలిచిన రోజు నుంచి అధిష్ఠానం మీద పదవుల కోసం ఒత్తిళ్లు ఉన్నాయి. అయితే సమీకరణాలను ఫాలో అయ్యే చంద్రబాబు.. ఎన్నికల సమయంలో టికెట్లు పంచిన దామాషాలోనే.. నామినేటెడ్ పదవుల పంపకం కూడా ఎన్డీయే పార్టీల మధ్య ఉంటుందనే సంకేతాన్ని మాత్రం స్పష్టంగా చెప్పారు.
అంతే తప్ప.. ఒక్క వ్యవస్థకు కూడా కమిటీలను వేయలేదు. ప్రధానంగా టీటీడీ వంటి వాటికి చాలా పోటీ ఉంటుంది. అయితే ఏ ప్రకటనా కూడా ఇప్పటికి రాలేదు. మధ్యలో వందరోజుల ప్రభుత్వకాలం పూర్తయ్యేలోగా నామినేటెడ్ పదవుల పందేరం కూడా పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా హామీ ఇచ్చారు. మూడు పార్టీల నాయకుల్లోనూ ఆశలు మోసులెత్తాయి. ఇప్పుడు వందరోజులు పూర్తయ్యాయి. ఆ వేడుకలు చేసుకున్నారు గానీ.. పదవుల ఆశావహుల ఊసు మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు.
అధికారంలోకి రాగానే.. ఏయే పోస్టుల్లో కీలక అధికారులుగా ఎవరిని నియమించుకోవాలో ముందే డిసైడ్ అయి, రోజుల వ్యవధిలోనే ఆ పర్వం పూర్తిచేసిన చంద్రబాబు, నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇంత మితిమీరిన జాగు చేస్తున్నారెందుకని పార్టీ నాయకులు బాధపడుతున్నారు.
vc estanu 9380537747
Call boy works 9989793850
Anni free cbn🤣🤣🤣🤣🤣