Advertisement

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబుతో 'దేశం' సరి

చంద్రబాబుతో 'దేశం' సరి

తెలుగుదేశం పార్టీ చంద్రబాబుతో సరి అని ఘంటాపథంగా చెప్పేసారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఏ కారణమైనా కావచ్చు, చంద్రబాబు తరువాత ఇక తెలుగుదేశం పార్టీ వుండదని, వైకాపా ప్రాంతీయ పార్టీగా, భాజపా జాతీయ పార్టీగా మిగులుతాయని ఆయన ఓ ఇంటర్వూలో పేర్కొన్నారు. 

బెంగాల్ లో ముఫై ఏళ్లు పాలించిందని, తెలుగుదేశం కన్నా గొప్ప సంస్థాగతమైన పార్టీ అని, అలాంటిది జ్యోతి బసు మరణించిన తరువాత ఎన్నాళ్లో మనలేకపోయిందని, ఆ వ్యవస్థ అంతా వేరే పార్టీలకు తరలిపోయిందని ఆయన ఉదాహరణ ఇచ్చారు.

లోకేష్ అసమర్థత కావచ్చు మరే కారణం కావచ్చు, తెలుగుదేశం పార్టీ దుకాణం చంద్రబాబు తో సరి అనే వంశీ చెప్పడం విశేషం. అంతేకాదు, ఓ ప్రాంతీయ పార్టీని ఎన్టీఆర్ జాతీయ పార్టీ లెవెల్ కు తీసుకెళ్తే, దాన్ని చంద్రబాబు ఉప ప్రాంతీయ పార్టీ లెవెల్ కు దిగజార్చేసారని ఆయన అన్నారు. 

తెలంగాణలో పార్టీని లేకుండా చేసారని, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ పెట్టలేకపోయారని ఆయన వివరించారు. 

ఎన్నికల్లో తనకు పార్టీ అయిదు కోట్లు ఇచ్చిందనడాన్ని ప్రస్తావిస్తూ, ఆ లెక్కన 2019 ఎన్నికల్లో పదివేల కోట్లు ఖర్చు చేసి వుండాలని అంత డబ్బు చంద్రబాబుకు ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన నిలదీసారు.  

తండ్రి ఖర్జూర నాయుడు సంపాదించిన రెండు ఎకరాలు అమ్మితే వచ్చిందా? లేక తల్లి కొండాపూర్ లో అమ్మిన అయిదు ఎకరాలతో వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?