అంకెలు బ్లాక్ చేస్తున్న మేకర్లు

ముందుగానే బయ్యర్లకు చెప్పేసారంట..కలెక్షన్ల వివరాలు ఎవరికీ వెల్లడించవద్దు అని

పెద్ద సినిమా వచ్చింది అంటే చాలు తొలి రోజు కలెక్షన్లు ఎలా వున్నాయి. మలి రోజు ఎలా వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ ఎంత? అన్న ఎంక్వయిరీలు మొదలవుతాయి. చాలా వరకు ఫేక్ నెంబర్లు బయటకు వస్తాయి.. ఇలాంటివి సాధారణంగా పెయిడ్ పేజీలు లేదా ఫ్యాన్స్ పేజీల్లో వుంటాయి. హీరోల రికార్డుల కోసం భారీ నెంబర్లు ప్రకటించడం కూడా చేస్తుంటారు. ఏదో ఫ్యాన్స్ కోసం ఇచ్చామని తరువాత కవర్ చేసిన సందర్భాలు కూడా వున్నాయి.

ఇటీవలి కాలంలో కలెక్షన్ల మీద ఆరా పెరుగుతోంది. ఎవరి స్థాయిలో వారు కలెక్షన్ల వివరాలు సంపాదిస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో కొందరు అందరికన్నా ముందుగా తమకు కావాల్సిన సినిమాలకు ఓ విధంగా, తమకు కిట్టని సినిమాలకు మరో విధంగా నెంబర్లు తయారు చేసి, ఎలా సోషల్ మీడియాలోకి పంపాలో అలా పంపేస్తున్నారు. దీంతో ఒరిజినల్ నెంబర్లు ఎవరైనా వేసినా, అవి వృధా అవుతున్నాయి. ఈ విధంగా టాలీవుడ్ కలెక్షన్ల లెక్కల్లో నానా గత్తర జ‌రుగుతోంది.

లేటెస్ట్ గా దేవర సినిమా రాబోతోంది. సహజంగానే కలెక్షన్ల మీద చాలా అంటే చాలా ఇంట్రస్ట్ వుంటుంది. పైగా ఫ్యాన్స్ మధ్య పోటీ అన్నది కూడా ఓ పాయింట్. అందుకే ముందుగానే బయ్యర్లకు చెప్పేసారంట..కలెక్షన్ల వివరాలు ఎవరికీ వెల్లడించవద్దు అని. ఈ మేరకు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. తమకు ఎలాగూ పంపిస్తారు కదా. తాము అన్నీ లెక్కలు కట్టి సోషల్ మీడియాలోకి వదులుతాము. అంతే తప్ప జిల్లాల లెవెల్ లో ఎవరికీ ఏ నెంబర్లు వెల్లడించవద్దు అని అదేశాలు వెళ్లినట్లు టాలీవుడ్ నిర్మాతల సర్కిళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజానికి ఇలాంటి అదేశాలు కొత్త కాదు. గతంలో కూడా చాలా సినిమాలకు ఇలాంటి తాళాలు వేసారు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఏ నిర్మాత అయినా కలెక్షన్లు దాచేస్తే ఎవరిని ఎవరు మోసం చేసుకునేటట్లు? హీరోల ఇమేజ్‌ను నిలబెట్టడం కోసం తప్ప మరే విధమైన లాభం వుండదు.

అదీ కాక సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఏ నెంబర్లు బయటకు వదిలినా చలామణీ అయిపోతాయి. అదేే సినిమా యావరేజ్ అయితే మాత్రం ఏ నెంబర్లు వదిలినా జ‌నం నమ్మరు.

3 Replies to “అంకెలు బ్లాక్ చేస్తున్న మేకర్లు”

Comments are closed.