“దేవర సినిమా చూసేంతవరకైనా నన్ను బతికించండి” అంటూ వైద్యులకు మొరపెట్టుకుంటున్న ఎన్టీఆర్ అభిమాని కౌశిక్.. 2 రోజులుగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. బోన్ కాన్సర్ తో బాధపడుతున్న అతడు ఎన్టీఆర్ కు వీరాభిమాని.
విషయం తెలుసుకున్న తారక్, స్వయంగా స్పందించాడు. తన వీరాభిమానితో వీడియో కాల్ లో మాట్లాడాడు. కలిసి దేవర సినిమా చూద్దామని హామీ ఇచ్చాడు.
“కౌశిక్.. మనిద్దరం కలుద్దాం.. నేనే వీలు చూసుకొని వస్తా. నేను తప్పకుండా వచ్చి కలుస్తాను, నువ్వు కూడా త్వరగా కోలుకొని నా దగ్గరకు రా, కలుద్దాం. ధైర్యంగా ఉండు, ట్రీట్ మెంట్ తీస్కో. నీకేం కాదు. దేవుడున్నాడు, అమ్మానాన్న ఆశీస్సులున్నాయి, నా సపోర్ట్ ఉంటుంది. నీకేం కాదు, ధైర్యంగా ట్రీట్ మెంట్ తీస్కో. నువ్వు కోలుకున్న తర్వాత ఇద్దరం కలిసి దేవర సినిమా చూద్దాం.”
ఈ సందర్భంగా తన అభిమానికి ట్రీట్ మెంట్ ఇప్పిస్తానని కూడా మాటిచ్చాడు ఎన్టీఆర్. చికిత్సకు దాదాపు 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, అంత భరించే స్తోమత లేదని కౌశిక్ తల్లి చెప్పగా.. అదంతా తను చూసుకుంటానని తారక్ భరోసా ఇచ్చాడు.
Nice gesture, keep it up NTR
Respect.
Good
vc available 9380537747
Call boy works 9989793850