వైసీపీ సీనియర్ మంత్రికి ఢిల్లీ దారి…?

వైసీపీలో మార్పుచేర్పులు జరుగుతున్నాయి. ఈసారి అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ సీట్లను భారీ ఎత్తున గెలుచుకునేందుకు అధినాయకత్వం సీరియస్ గానే వ్యూహ రచన చేస్తోంది. సీనియర్లుగా ఉన్న నేతలను ఢిల్లీ బాట పట్టించాలని చూస్తోంది…

వైసీపీలో మార్పుచేర్పులు జరుగుతున్నాయి. ఈసారి అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ సీట్లను భారీ ఎత్తున గెలుచుకునేందుకు అధినాయకత్వం సీరియస్ గానే వ్యూహ రచన చేస్తోంది. సీనియర్లుగా ఉన్న నేతలను ఢిల్లీ బాట పట్టించాలని చూస్తోంది

ఉత్తరాంధ్రాలో వైసీపీకి కొరుకుడు పడని పార్లమెంట్ సీటుగా శ్రీకాకుళం ఉంది. 2014, 2019లలో రెండు సార్లూ ఇక్కడ టీడీపీ గెలిచింది. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు ఇక్కడ నుంచి వరసగా విజయం సాధించారు. హ్యాట్రిక్ సక్సెస్ సాధిస్తాను అని ఆయన అంటున్నారు.

ఆయనని ఢీ కొట్టేందుకు వైసీపీ సీనియర్ మంత్రిని బరిలోకి దించనుంది అని ప్రచారం సాగుతోంది. రెవిన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఈ దఫా ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు. ఆయనను ఎంపీగా పంపిస్తే శ్రీకాకుళం సీటు గ్యారంటీగా వైసీపీ ఖాతాలో పడుతుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావుని ఢిల్లీ బాట పట్టించాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఈ సీనియర్ మంత్రి అయితే సుముఖంగా ఉన్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈయన కనుక నో చెబితే అపుడు స్పీకర్ తమ్మినేని సీతారాం ని అయినా పోటీ చేయిస్తారు అని తెలుస్తోంది. 

నూటికి తొంబై తొమ్మిది పాళ్ళు మాత్రం ప్రసాదరావు వైపు హై కమాండ్ చూపు ఉంది అంటున్నారు మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రసాదరావు ఎపుడూ ఎంపీగా పోటీ చేయలేదు. ఆయనకి ఇది కొత్త అనుభవం అవుతుంది అని అంటున్నారు.