Advertisement

Advertisement


Home > Politics - Gossip

అసెంబ్లీలో మంత్రి పదవులపై హాట్ డిస్కషన్

అసెంబ్లీలో మంత్రి పదవులపై హాట్ డిస్కషన్

చాన్నాళ్ల తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాల కోసం ఎమ్మెల్యేలంతా ఓచోట కలిశారు. మరోవైపు మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణపై మంత్రుల్లో గుబులు ఉంది, కొత్తవారిలో ఆశ ఉంది. దీంతో సహజంగానే అసెంబ్లీ లోపల, బయట ఇదే డిస్కషన్ నడుస్తోంది. 

అసలు జగన్ మనసులో ఏముంది, ఎప్పుడు కొత్త మంత్రి మండలి కొలువుతీరుతుందని చర్చించుకుంటున్నారు ఎమ్మెల్యేలు.

ఉగాదికి మహూర్తం ఫిక్స్..

ఉగాది నాటికి కొత్త మంత్రి మండలిపై ప్రకటన వెలువడుతుందని సమాచారం. జిల్లాల పునర్విభజన పూర్తవగానే కొత్త జిల్లాల ప్రకారం మంత్రి మండలిని పునర్ వ్యవస్థీకరించే అవకాశముంది. రెండేళ్ల కాల వ్యవధి పూర్తయినా కొన్నాళ్లపాటు జగన్ ఈ విషయంలో నిదానించారు. 

కరోనా వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఆ సమయం దాటిపోయే వరకు వేచి చూశారు. ఇక జిల్లాల విభజన కూడా ఉండటంతో కొత్త జిల్లాల వారీగా మంత్రులను నియమించబోతున్నట్టు తెలుస్తోంది.

నో డౌట్.. అంతా కొత్తవారే..

గతంలో మంత్రి వర్గ విస్తరణ, మార్పులు చేర్పులు జరిగినప్పుడు పాతవారిలో కనీసం కొంతమందికయినా చోటు ఉండేది. కానీ ఈసారి జగన్ సంచలన నిర్ణయం తీసుకోబుతున్నట్టు తెలుస్తోంది. గతంలో మంత్రి బాలినేని దీనిపై హింట్ ఇచ్చినా.. కొంతమంది మాత్రం తమని మార్చబోరంటూ ప్రచారం చేసుకున్నారు. 

కానీ ఇప్పుడు మంత్రిమండలి విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటున్నారనేది వాస్తవం. పాత మంత్రుల్లో ఏ ఒక్కరికీ తిరిగి అవకాశం ఇవ్వడంలేదు. అంతా కొత్తవారితోనే మంత్రి మండలి కొలువుదీరబోతోంది. ఎన్నికలకు ముందు మళ్లీ వారి వారి సామర్థ్యాలు బేరీజు వేసుకుని ఎన్నికల టీమ్ రెడీ అవుతుంది.

ముందస్తు సమాచారం వచ్చినవారిలో సంతోషం..

మంత్రి పదవులు ఆశించిన కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కాస్త సంతోషంగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. రోజా లాంటి వారు కొత్త ఉత్సాహంతో ఉన్నారు. మరి వారికి మంత్రి పదవుల విషయంలో ముందే హింట్ వచ్చిందా లేక, మరేదైనా కారణం ఉందా అనేది తేలాల్సి ఉంది. 

అయితే ఇప్పటికే మంత్రి పదవుల విషయంలో జగన్ ఓ లిస్ట్ తయారు చేసి పెట్టుకున్నారనేది వాస్తవం. ఆ లిస్ట్ లో నుంచి పేర్లు లీకయి ఉంటే, అవి వారి చెవిన పడితే.. వారి ఆనందానికి అవధులుండవు. కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో అదే జరిగిందని తెలుస్తోంది. ఆ అదృష్టవంతులెవరనేది మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా తెలుస్తుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?