Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఏం జరుగుతుంది ఇప్పుడు?

ఏం జరుగుతుంది ఇప్పుడు?

ఆంధ్రలో స్థానిక ఎన్నికలు మరోసారి కోర్టు గుమ్మంలో నిల్చున్నాయి. ఎన్నికల కమిషన్ కు వున్నఅధికారాలనే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా? లేక సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, కోర్టు తన నిర్ణయం తీసుకుంటుందా? అన్నది చూడాలి. 

గతంలో ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఎన్నికలు వద్దు అంది. కోర్టు సరే అంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కావాలి అంటోంది. కోర్టు మరేం అటుందో చూడాలి. గతంలో ఎన్నికల కమిషన్ వద్దు అన్నా కోర్టు వద్దు అనడం వెనుక లాజిక్ వుంది. 

ఎందుకంటే అప్పట్లో కరోనా వ్యాప్తి వుంది కాబట్టి. అయితే ఇప్పటికీ ఇంతో అంతో కరోనా వ్యాప్తి వుంది. అమలలో కోవిడ్ నిబంధనలు వున్నాయి. సోషల్ డిస్టెన్స్, మాస్క్ ఇవన్నీ అలాగే అమలులో వున్నాయి. అందువల్ల ఎన్నికల కమిషన్ ను కోర్టు ఆ మేరకు ప్రశ్నిస్తుందా? అన్నది చూడాల్సి వుంది. 

ప్రభుత్వం వద్దు అనడం వేరు. ఎన్నికల కమిషన్ గతంలో వద్దు అన్నప్పటి, కావాలి అంటున్నప్పటి పరిస్థితులను బేరీజ వేయాల్సి వుంటుందేమో? అప్పుడు కానీ కోర్టు నిర్ణయం బయటకు రాదేమో? కానీ ఈ ఇస్యూలో ఓ లాజిక్ వుంది. 

కోర్టు కేవలం ఎన్నికలు జరపాలి అనే నిర్ణయానికి ఎస్ ఆర్ నో చెబుతుందా? లేదా ఎస్ అంటే ఆ మేరకు కోపరేట్ చేసి తీరాలి అని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందా? అన్నది కీలకం.

కొర్టు అలా ఆదేశించకుండా, జస్ట్ ప్రభుత్వ పిటిషన్ ను తోసి పుచ్చితే, ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ వస్తే మళ్లీ అదో ఇస్యూ అవుతుంది. ఎన్నికల కమిషన్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కడమో? కేంద్రాన్ని సంప్రదించడమో చేయాల్సి వుంటుంది.  కోర్టును సంప్రదించకుండా కేవలం కేంద్రాన్ని సంప్రదిస్తే ఫలితం ఏమిటన్నది చూడాల్సి వుంది.

మొత్తం మీద స్థానిక ఎన్నికల యుద్దం రాజకీయ పక్షాల కన్నా ఎన్నికలసంఘానికి-ప్రభుత్వానికి మధ్య రంజుగా ముందే మొదలైపోయింది.

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

విక్ర‌మార్కుడు కంటే ప‌వ‌ర్ పుల్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?