Advertisement

Advertisement


Home > Politics - Gossip

బాంబు పేల్చిన కాంగ్రెస్ మాజీ నాయకుడు

బాంబు పేల్చిన కాంగ్రెస్ మాజీ నాయకుడు

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హవా నడుస్తున్న కాలంలో ఆర్టీసీ చైర్మన్ గా పనిచేసిన పాపులర్ కాంగ్రెస్ నాయకుడు గొనె ప్రకాశ రావు హఠాత్తుగా ఒక బాంబు పేల్చారు. ఈ తరానికి ఈయనెవరో పెద్దగా తెలియదు. ఎప్పుడో రాజకీయాల నుంచి విరమించారు. 

కానీ అప్పుడప్పుడు రాజకీయాలకు సంబంధించి సంచలన విషయాలు చెబుతుంటారు. అప్పుడప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వారు ఈయన్ని ఇంటర్వ్యూ చేస్తుంటారు. పాత కాలం రాజకీయాలు చెబుతుంటారు. ఇప్పటి రాజకీయాలకు సంబంధించి కొన్ని రహస్యాలు కూడా చెబుతుంటారు.

 కొన్ని సంచలనం కలిగిస్తుంటాయి. గొనె ప్రకాశ రావు చెప్పే కొన్ని విషయాలు నిజమవుతాయని కొందరు అంటుంటారు. సరే ...ఏది ఎలా ఉన్నా ప్రకాశ రావు ఓ సంచలన విషయం చెప్పారు. అంతకూ ఆయన చెప్పిన విషయం ఏమిటంటే ...వెటరన్ హీరో మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ ఏపీలో టీడీపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తాడట.

ఎలాగూ సినిమాల్లో నటించడం లేదు కాబట్టి దృష్టి రాజకీయాల వైపు మళ్ళిందేమో. భూమా నాగిరెడ్డి కూతుళ్ళ (భూమా అఖిలప్రియ టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి) ప్రభావం కూడా ఉందేమో చెప్పలేం. ఆల్రెడీ విడాకులు తీసుకున్న మనోజ్ రెండో పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాడు కదా.  

మ‌నోజ్ ఇటీవ‌ల భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనిక‌తో క‌లిసి హైద‌రాబాద్ లోని ఒక వినాయ‌క మండ‌పం వ‌ద్ద కనిపించాడు. దీంతో వీరిద్ద‌రూ వివాహం చేసుకోబోతున్నారంటూ వార్త‌లు వ‌చ్చాయి. అవి నిజమేనని గోనె అన్నారు. మంచు మ‌నోజ్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

రాజ‌కీయాలంటే త‌న‌కూ ఇష్ట‌మేన‌ని, పోటీ చేస్తానంటూ మ‌నోజ్ గ‌తంలోనే చెప్పాడు. తాజాగా ప్ర‌కాశ‌రావు చెప్పిన‌దాని ప్ర‌కారం సైకిల్ ఎక్క‌డం ఖరారైనట్లుగా సమాచారం. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాబోయే ఎన్నిక‌ల్లో పోటీచేయ‌డానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడని గొనె ప్రకాశ రావు తెలిపారు. 

అంతే కాకుండా మౌనిక‌, మ‌నోజ్ వివాహం చేసుకోబోతున్నారని చెప్పారు. మ‌నోజ్ ప్ర‌ణ‌తిరెడ్డిని 2015లో వివాహం చేసుకొని 2019లో విడాకులు తీసుకున్నాడు. అలాగే మౌనిక కూడా తన భర్తతో విడాకులు తీసుకుంది. ఇద్దరూ ప్రముఖ కుటుంబాలకు చెందినవారు కావడంతో పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవొచ్చు. 

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మోహ‌న్‌బాబును జ‌గ‌న్ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి ఎంపిక చేస్తార‌ని ఆశించారు. అదేమీ జ‌ర‌గ‌లేదు. మోహన్ బాబు కూడా వైసీపీతో ఆంటీ ముట్టనట్లుగా ఉన్నారు. అయితే ఆయన కుటుంబానికి టికెట్ ఇవ్వొద్దంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నాయట.  

గత ఎన్నికల్లో మోహన్ బాబు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించారని, వైసీపీలో సీటివ్వకపోవడంతోనే మళ్లీ ఇక్కడకు వస్తున్నారంటున్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ కోసం విద్యార్థులతో కలిసి ధర్నా చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మరి మనోజ్ పై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?